యేసయ్య అనవచ్చా? |
ప్రియమైన సహోదరీ, సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా
హృదయపూర్వక వందనములు.
నేటి క్రైస్తవ్యములో అనేకమంది క్రీస్తును యేసయ్య అనే పేరుతో
పిలుస్తున్నారు కాని గ్రంధములో ఆయనను యేసయ్య అనే పేరుతో ఎవరైనా సంభోదించారా లేదా
అనే విషయమును గ్రహించలేని స్థితిలో ఉండి ఆయన నామమమును వ్యర్థముగా
ఉచ్చరిస్తున్నారు.
★ యేసు అనగా :
» ఇంగ్లీషు లో “ Jesus ”.
» ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపముల
నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. – (మత్తయి.
1:21).
★ క్రీస్తు అనగా :
» ఇంగ్లీషు లో “ Christ “.
◆ క్రీస్తు అను శబ్దమునకు అర్థము “అభిషక్తుడు”.
» దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. – (లూకా. 2:11).
» ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. – (మత్తయి. 1:16).
యేసుని అయ్యా అని సంభోదించినవారు
● సమరయ స్త్రీ : (యోహాను. 4:11, 15, 19).
● వ్యాధిగ్రస్తుడు : (యోహాను. 5:7).
● మరియ : (యోహాను. 20:15).
★ అయ్యా అనగా :
» ఇంగ్లీషు లో “ Sir , Lord, Master “.
గ్రీక్ భాషలో వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథములో “ Κύριε ” (Kyrie) అనే పదము ఉన్నచోట ప్రభువని, అయ్యా అని తెలుగు
భాషలోనికి తర్జూమా చేయబడినది.
తెలుగు భాషలోనికి తర్జూమా
చేయబడిన పరిశుద్ధ గ్రంథములో యేసుని అయ్యా అని సంభోదించుట చూస్తున్నాము కాని
యేసయ్యా అనే పదము వాడబడలేదు. యేసు అను శబ్దమునకు అర్థము “రక్షకుడు” (మత్తయి.
1:21). మరి యేసయ్యా అని పిలుస్తున్న నీవు ఆ పదము ఏ మూల భాష నుండి తర్జూమా
చేయబడినదో, దాని అర్థము ఏమిటో అని నిన్ను నీవు ప్రశ్నించుకోవలసిన అవసరత ఎంతైనా
ఉంది.
దేవుని కుమారుని సంబోధించిన విధానము
» అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. -
(మత్తయి. 1:1; మార్క 1:1).
» అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును
ఎరుగుటయే నిత్యజీవము. - (యోహాను. 17:3).
» యేసుక్రీస్తు అందరికి ప్రభువు. - (అపో.కార్య.
10:36).
» యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడియున్నారు. - (రోమా.
1:7).
» మొదటి శతాబ్దాపు కాలములో యేసుక్రీస్తు నామములో మాత్రమే
స్వస్థతలు - (అపో.కార్య. 4:10; 16:18).
» బర్నబా గారు మరియు పౌలు గారు యేసుక్రీస్తు నామము కొరకు తమ్మును
తాము అప్పగించుకున్నారు. - (అపో.కార్య. 15:25).
» ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. - (1
కొరింధి. 16:23).
» యేసుక్రీస్తు ద్వారా తనకు (తండ్రికి) కుమారులనుగా
స్వీకరించుటకై... - (ఎఫెసీ. 1:5).
» ఆయన ఆజ్ఞ యేదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును
నమ్ముకొని... - (1యోహాను. 3:22).
ఇంకా అనేక వచనములు కలవు వాటన్నిటిలోనూ దేవుని కుమారుని సిలువ వేయబడిన
యేసుక్రీస్తు అని సంబోధించారు కాని ఎక్కడా కూడా యేసయ్యా అని సభోదించలేదు.
యేసయ్యా అని పిలువకూడదా?
ఈనాడు క్రైస్తవ్యములో అనేకమంది వాక్యమును తమకు అనుగుణంగా మార్చుకుని యేసుని
“యేసయ్య” అని గౌరవ ప్రధముగా సంభోదిస్తున్నాము అనే ఆలోచన కలిగియున్నారు.
ఇటువంటి ఆలోచన వలన పరిశుద్ధాత్ముని ప్రేరణతో వ్రాయబడిన గ్రంథములోని మాటలను కలిపి
చెరిపే వారుగా ఉన్నారు.
★ మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని
గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు.- (ద్వితియో.
4:2; 12:32).
★ ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు
అబద్ధికుడవగుదువు.- (సామెతలు. 30:6).
హెచ్చరిక :
★ ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతివానికి నేను
సాక్ష్యమిచ్చునది ఏమనగా-ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి
కలుగజేయును. – (ప్రకటన. 22:18).
కావున ప్రియ సహోదరుడా, సహోదరీ
పరిశుద్ధ గ్రంధమును వ్రాయించిన పరిశుద్ధాత్ముడే దేవుని కుమారుని యేసయ్యా అని
సంభోదించనప్పుడు నీవు నేను ఎందుకు సంభోధించాలి? పరిశుద్దాత్మకు విరోధముగా మాట్లాడి
పాపము చేయుదువా? ఆలోచన చేయు ఎందుకనగా....
◆ మనుష్యకుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని
పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను
పాపక్షమాపణ లేదు. – (మత్తయి. 12:32).
◆ విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము. - (రోమా. 14:23).
మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు.
10 comments
commentsMari emi ani pilavali brother
ReplyJesus Christ ani pilavali
ReplyGreat job brother
ReplyGreat job brother
ReplyJesus Christ ani pilavali
Replyయేసుక్రీస్తు (మత్తయి. 1:1; 1:21; మార్కు. 1:1; లూకా 2:11).
Replyవందనములు :D
Replyవందనములు బ్రదర్
Replyసర్ lord అంటే కూడా అయ్యా అని అంటున్నారు కదా
Replyసర్ అయ్యా అంటే Lord అని కూడా చెప్పారు కదా అర్థం కాలేదు
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com