![]() |
డిబేట్ |
నా తోటి సహోదరులకు మన ప్రభువైన యేసు
క్రీస్తు నామములో నా హృదయ పూర్వక వందనములు.
నేటి క్రైస్తవ్యములో మనము ఈ డిబేట్
(Debate) లను ఎక్కువుగా చూస్తున్నాము. అయితే అసలు డిబేట్ అంటే ఏమిటి? వీటి వలన
ఉపయోగములు ఉన్నాయా? క్రైస్తవులమైన మనము వీటికి పూనుకోవడము ఎంత వరకు సమంజసము?
గ్రంథము వీటి గూర్చి ఏమి తెలియజేస్తుంది?అనే విషయాలను పరిశీలన చేద్దాము.
డిబేట్ అంటే ఏమిటి ? (What is Debate?)
డిబేట్ అను ఇంగ్లీష్ పదమునకు అర్థము,
కలహము లేదా జగడము లేదా
వివాదము లేదా వ్యాజ్యము. ఈ పదము యొక్క అర్థము క్రియా రూపకముగా చూస్తే ఆలోచించుట
లేదా చర్చించుట లేదా వాదించుట అనే అర్థములు వస్తాయి.
ఈ డిబేట్ లు ఒకప్పుడు ఉద్యోగాలలోనూ,
కళాశాలలోను, రాజకీయాలలోను మరియు ఇహలోక సంబంధిత విషయములలోనూ
చూసేవారము కాని ఈ మధ్య కాలములో నేటి క్రైస్తవులలో ఎక్కువుగా చూస్తున్నాము.
డిబేట్ అను ఇంగ్లీష్ పదమునకు వివిధమైన
అర్థములు మనము చూసాము మరి క్రైస్తవులమైన మనము ఇటువంటి కలహములు లేదా జగడములు లేదా వివాదములు
లేదా వ్యాజ్యముల లో పాల్గొనడం లేదా వీటిని ప్రోత్సాహించడము మనకు తగునా?
ఇటువంటి వివాదాస్పదమైన వాటి గూర్చి
గ్రంథము ఏమి తెలియజేస్తుంది ?
కలహము
★ అబ్రాము కాపరులు – లోతు కాపరులు.
అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు
పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో
కాపురముండిరి. – (ఆది. 13:7).
★ యెఫ్తా – అమ్మోనీయులు.
యెఫ్తా - నాకును నా జనులకును అమ్మోనీయులతో
గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మును పిలిచితిని గాని మీరు వారి చేతులలోనుండి
నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి. – (న్యాయా. 12:2).
★ పరిసయ్యులు – సద్దూకయ్యులు.
అతడాలాగు చెప్పినప్పుడు పరిసయ్యులకును
సద్దూకయ్యులకును కలహము పుట్టినందున.... – (అపొ.కార్య. 23:7).
● కలహము
వలన నష్టము :
● కలహము
ఎవరు పుట్టించును:
మూర్ఖుడు కలహము పుట్టించును. – (సామెతలు.
16:28).
కోపోద్రేకియగువాడు కలహము రేపును. - (సామెతలు.
15:18).
బుద్ధిహీనులు– (సామెతలు. 18:6).
కోపిష్ఠుడు. – (సామెతలు. 29:22).
● క్రైస్తవునికి
కలహము తగునా? :
మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర
సంబంధులై మనుష్యరీతిగా నడచుకొనువారుకారా? – (1 కొరింధి. 3:3).
కాబట్టి సహోదరులారా ఇట్టి కార్యములను
అనుసరించువారు మరణమునకు తగినవారు (రోమా. 1:32) కనుక క్రైస్తవులమైన మనము
కలహములకు దూరముగా ఉండాలి (తీతుకు. 3:9).
జగడము
★ గేరారు కాపరులు – ఇస్సాకు కాపరులు.
అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో
జగడమాడిఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఏశెకు
అను పేరు పెట్టెను. వారు మరియొక బావి త్రవ్వినప్పుడు దానికొరకును
జగడమాడిరి గనుక దానికి శిత్నా అను పేరు పెట్టెను. – (ఆది.
26:20-21).
★ గర్వము – జ్ఞానము.
గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన
వినువానికి జ్ఞానము కలుగును. – (సామెతలు. 13:10).
● జగడము
వలన నష్టము :
కీడు కలుగును. – (సామెతలు. 6:14).
అజ్ఞానము. – (సామెతలు. 13:10).
● జగడము
ఎవరు పుట్టించును? :
అతి మూర్ఖ స్వభావము కలవారికి. – (సామెతలు.
6:14).
గర్విష్టులకు. – (సామెతలు. 13:10).
● క్రైస్తవులకు
జగడము తగునా? :
నేర్పు లేని మూఢుల వితర్కములు జగడములు
పుట్టించునని యెరిగి అట్టి వాటిని విసర్జించుము. – (2 తిమోతి. 2:23).
ఒకడు మరియొకనితో వాదించినను ప్రయోజనము
లేదు; ఒకని గద్దించినను కార్యము
కాకపోవును; నీ జనులు యాజకునితో జగడమాడువారిని పోలియున్నారు (హోషయ.
4:4) కనుక మనము వీటికి దూరముగా ఉండాలి.
వివాదము
★ యోహాను శిష్యులు – యూదుడు.
శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను
శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను. – (యోహాను. 3:25).
★ పౌలు, బర్నబా – యూదులు.
పౌలునకును బర్నబాకును వారితో విశేష
వివాదమును తర్కమును కలిగినప్పుడు, ఈ అంశము విషయమై పౌలును
బర్నబాయు, తమలో మరికొందరును యెరూషలేములో అపొస్తలుల యొద్దకును,
పెద్దల యొద్దకును వెళ్ళవలెనని సహోదరులు నిశ్చయించిరి. – (అపొకార్య.
15:2).
● వివాదము
ఎవరు పుట్టించును? :
కోపోద్రేకియగువాడు. – (సామెతలు.
15:18).
ఎగతాళి చేయువారు. – (యోబు. 17:2).
సత్యహీనులు. – (1 తిమోతి. 6:5).
● వివాదము
వలన నష్టము :
అసూయ మరియు అతిశయము. – (గలతీ. 5:26).
నిష్ప్రయోజనము మరియు వ్యర్థము. – (తీతుకు.
3:9).
● క్రైస్తవులకు
వివాదము తగునా? :
విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక
వివాదములతోనే సంబంధము కలిగియున్నవి కనుక వాటిని లక్ష్యపెట్టవద్దనియు,.. – (1
తిమోతి. 1:4).
అయితే శరీరములో వివాదము లేక అవయవములు
ఒకదాని నొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలుగజేసి
శరీరమును అమర్చియున్నాడు. – (1 కొరింధి. 12:25).
వివాదములకు దూరముగా ఉండమని గ్రంథము
తెలియజేస్తుంది కనుక ఇటువంటి వివ్వాదములను ప్రోత్సాహించకూడదు.
వ్యాజ్యము
వ్యాజ్యము కొరకు పాత నిబంధనలో అనేక
విషయములు కలవు కాని క్రైస్తవులకు ఇవ్వబడిన క్రొత్త నిబంధన మాత్రము వ్యాజ్యమునకు
దూరముగా ఉండమని సెలవిస్తున్నది.
» మీలో ఒకనికి మరియొకని మీద వ్యాజ్యెమున్నప్పుడు, వాడు పరిశుద్ధుల యెదుట గాక అనీతిమంతుల యెదుట
వ్యాజ్యేమాడుటకు తెగించుచున్నాడా?. – (1
కొరింధి. 6:1).
» కాబట్టి, ఈ జీవన సంబంధమైన వ్యాజ్యెములు మీకు కలిగినయెడల వాటిని తీర్చుటకు సంఘములో
తృణీకరింపబడిన వారిని కూర్చుండ బెట్టుదురా?. – (1
కొరింధి. 6:4).
» అయితే సహోదరుడు సహోదరుని మీద వ్యాజ్యె
మాడుచున్నాడు. మరి అవిశ్వాసుల యెదుటనే వ్యాజ్యెమాడుచున్నాడు. ఒకని మీద ఒకడు
వ్యాజ్యెమాడుట మీలో యిప్పటికే కేవలము లోపము. అంత కంటె అన్యాయము సహించుట మేలు కాదా? దాని కంటే మీ సొత్తుల నపహరింపబడనిచ్చుట మేలు కాదా?. – (1 కొరింధి. 6:6-7).
» క్రైస్తవులమైన మనము ఒక విషయమును
గ్రహించాలి వ్యర్థ సంభాషణకు దూరముగా ఉండాలి. వ్యర్థ సంభాషణచేత వ్యాజ్యెమాడ దగునా?నిష్ ప్రయోజనమైన మాటలచేత వాదింప దగునా? (యోబు. 15:3).
ప్రియ సహోదరులారా డిబేట్ అను ఇంగ్లీష్
పదమునకు తెలుగులో వివిధ అర్థములనిచ్చు
వాటిని గూర్చి గ్రంధములో చెప్పబడిన అనేక సంగతులను
పరిశీలన చేసాము అయితే డిబేట్ అనగా ఆలోచించుట లేదా చర్చించుట అని కూడా
తెలియుచున్నది అయితే క్రైస్తవుడైన నీవు ఏ విధముగా
పోరాటము చేయుచున్నావు? ఎటువంటి విధానముతో చర్చను కొనసాగిస్తున్నావు? నీ
ఆలోచన ఎలా ఉంది? నీ చర్చ ద్వారా అవతల వ్యక్తి మార్పు చెందాడా? డిబేట్ పేరు చెప్పి
దూషణ మాటలాడుతూ ఒకరినొకరు ఎగతాళి చేసికొనుచూ దేవుని నామాన్ని అవమాన పరుస్తున్నావా?
ఆలోచన చేయు.
నీవు ఎవరితోనైనా చర్చించినప్పుడు లేదా
సత్యమును ఆలోచన చేసినప్పుడు అవతల వ్యక్తి కూడా సత్యమును అంగీకరించేవాడిగా ఉండాలి.
: ఉదాహరణ : నపుంసకుడు మరియు ఫిలిప్పు మధ్య సంభాషణ (అపొ.కార్య.
8:26-40)
● మొదటగా నపుంసకుడు
గూర్చి ఆలోచన చేస్తే ఈయన ఐతియోపీయుల రాణి క్రింద మంత్రిగా ఉన్నాడు.
ధర్మశాస్త్రమును ఆచరించేవాడు, దేవుని యెడల భయభక్తులు కలవాడు కాని క్రీస్తుని
గూర్చిన సత్య సువార్త మరియు సత్య ఆరాధన
తెలియని వాడు.
● రెండవదిగా ఫిలిప్పు గూర్చి ఆలోచన చేస్తే
ఇతడు క్రీస్తుని ఎరిగిన వాడు, క్రీస్తు సువార్తకు లోబడి దానిని ప్రకటన చేయువాడు
మరియు అపోస్తలుల ద్వారా ఎన్నుకోబడిన ఏడుగురులో ఒక పరిచారకుడు(అపో. 6:5; 7:2; 8:1;5). ఒక సామాన్య వ్యక్తి.
» నపుంసకుడు ధర్మశాస్త్రానుసారముగా యెరూషలేములో
దేవునిని ఆరాధించి తిరిగి ప్రయాణమై వెళ్ళుచు ప్రవక్తయైన యెషయా గ్రంథము
చదువుచుండగా, తాను చదువుతున్న సంగతి అర్థము కాని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు
తనకున్న ఆసక్తిని బట్టి పరిశుద్ధాత్ముని ద్వారా ఫిలిప్పుని ప్రేరేపించి నపుంసకుని రధము
యొద్దకు పంపబడెను.
» నపుంసకుడు తనకున్న సందేహమును ఫిలిప్పునకు
తెలియజేయగా ఆయన యెషయా గ్రంథములో చెప్పబడిన సంగతులను అనుసరించి అతనికి సిలువ వేయబడిన
యేసును గూర్చిన సత్య సువార్తను ప్రకటించెను.
» ఫిలిప్పు చెప్పిన ఆయా సంగతులను అన్నిటిని అంగీకరించుటలో మంత్రి పదవిలో
ఉన్న నపుంసకుడు తన్ను తాను హెచ్చించుకొనలేదు, తన అధికారత్వమును చూపలేదు, భయభక్తులు
కలవాడిని, ధర్మశాస్త్రము ఎరిగిన వాడిని కదా అనే గర్వమును ఎంత మాత్రము కనపరచలేదు,
సమస్తము తెలియును కదా అనే ముసుగులో ఉండకుండా ఫిలిప్పు చెప్పిన సంగతులను
పసిపిల్లవాని వలె అంగీకరించి, తనను తాను తగ్గించుకుని, వాక్యమును పరిశీలన చేసి,
క్రీస్తుని అంగీకరించి బాప్తీస్మము పొందుటకు సిద్ధపడెను.
పైన చెప్పబడిన వీరిద్దరి సంభాషణలో కలహము లేదా
జగడము లేదా వివాదము లేదా వ్యాజ్యము లేదా చూడలేము కాని ఒకరు సత్యమును తెలియజేయగా
మరియొకరు అంగీకరించిన వారుగా ఉన్నారు. మరి నేటి క్రైస్తావ్యములో సంభాషణలు ఈ
విధముగా జరుగుతున్నాయా? లేదనే చెప్పాలి ఎందుకనగా నేడు జరుగుతున్న అనేక సంభాషణలు (డిబేట్)
చూడగా ఒకరితో ఒకరు కలహాము, వాదన, వ్యాజ్యములు పెట్టుకొనుచున్నారు కాని వారి
ప్రవర్తనలో క్రీస్తుని చూపించలేక పోతున్నారు.
సహోదరులారా, మన ప్రవర్తనే ఎదుటి వారికి
మాదిరిగా ఉండాలి కాని ప్రజలను క్రీస్తుకి మరింత దూరము చేసే రీతిలో ఈ సంభాషణలు
జరుగకూడదు.
సత్యమును తెలుసుకోవాలి అని ఆసక్తి కలిగిన
వారికి చెప్పిన యెడల విందురు కాని అసత్యమును గెలిపించాలి అనే భావన కలిగిన వారికి
సత్యమును ఎన్ని మార్లు తెలియజేసిన గ్రహించలేరు.
◆ ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు
అభిలాష గల వారందరును శిక్షా విధి పొందుటకై, అబద్ధమును
నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. – (2 ధేస్సలోనిక.
2:11-12).
అయితే మూర్ఖుల నోరు మూయించుట దేవుని
చిత్తమే కాని యుక్త ప్రవర్తన కలిగి తెలియజేయాలి, వారు విననొల్లనిచో దేవునికి విడిచిపెట్టాలి కాని క్రైస్తవులైన
మీరు విపరీత వాదనకు దిగి దేవుని నామాన్ని అవమాన పరచకూడదు.
◆ ఓ తిమోతీ, నీకు అప్పగింపబడిన దానిని కాపాడి, అపవిత్రమైన వట్టి
మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. – (1
తిమోతి. 6:20).
◆ ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై, అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని
చిత్తము. – (1 పేతురు. 2:15).
◆ పరిశుద్ధ మైనది కుక్కలకు పెట్టకుడి, మీ ముత్యములను పందుల యెదుట వేయకుడి; వేసిన యెడల అవి ఒకవేళ వాటిని కాళ్ళతో త్రొక్కి, మీ
మీద పడి మిమ్మును చీల్చివేయును. – (మత్తయి. 7:6).
★ ఎన్నిసారులు గద్దించినను
లోబడనివాడు మరి తిరుగులేకుండ హఠాత్తుగా నాశనమగును. – (సామెతలు. 29:1).
మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్_నవీన
15 comments
commentsWell done bro. 😊👌👍
Replyడిబేట్ మీద ఆధారపడుతున్నా వారందరికీ సరేనా అంశము వ్రాసి ఇచ్చిన మీకు నా వందనములు.
Replyఈ సమయము చాల సంతోషముగా ఉన్నాను. థాంక్స్ బ్రదర్.
మన దేవునికే మహిమ కీర్తి కలుగునుగాక.. ఆమెన్
Good message KM
ReplyHai annya
ReplyMi post chala baagundhi. Thank you.
Good explanation KM :D
Replyబ్రదర్ KM మరి నేడు కొందఱు క్రైస్తవులు డిబేట్ చేస్తున్నారు అది అంతా తప్పు అంటారా..?
ReplyGood message brother
ReplyBrother yessayya ani anavachha
ReplyBrother yessayya ani anavachha
Replyడిబేట్ మీద నాకూడా సదా అభిప్రాయం లేదు
Replyదేవుని నడిపింపు ద్వారా మంచి సందేశం ఇచ్చారు చాలా వందనాలు
యేసయ్య ఎవరో నాకు తెలియదు. ఆ పదము యొక్క అర్ధము కూడా మన పరిశుద్ధ గ్రంధము సెలవు ఇవ్వలేదు.
Replyఒక్కసారి "యేసయ్య అనవచ్చా" ? అనే అంశము వ్రాసాను చుడండి.
వందనములు.
💯 తప్పు
Replyవందనములు సిస్టర్
Replyవందనములు :D
Replyవందనములు బ్రదర్
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com