"యేసుక్రీస్తు దేవుడు కాదా"..? (Is Jesus Christ God.?)

అంశము: "యేసుక్రీస్తు దేవుడు కాదా"..?

(1 తిమోతికి. 6:15-16).

శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వ ముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌. 

అద్వితీయుడు  అనగా సమానము లేని వాడు 
సర్వాధిపతి అనగా అన్నిటికి యజమానుడు లేదా సర్వశక్తిమంతుడు లేదా సమస్తమును చేయగల సమర్ధుడు
ఈ మహా విశ్వములో ఒక్కరికి మాత్రమే సర్వాధిపత్యము ఉంది. 

"సర్వాధిపతి ఎవరు"..?

★ ఆయనే మన అద్వితీయ సత్యదేవుడు - యెహోవా - (యోహాను. 17:3).
● మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. - (మార్కు. 12:29)
● అల్ఫాయు ఓమెగయు నేనే వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. - (ప్రకటన. 1:8; యెషయా. 41:4). 
● సర్వాధి కారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱపిల్లయు దానికి దేవాలయమై యున్నారు. - (ప్రకటన. 21:22).
● మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. – (మార్కు. 12:29).
● “...భూతవర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని...” – (యెషయా  6:2-3; ప్రకటన. 4:8).

NOTE: పైన వచనములు అన్నియు మన దేవుడైన యెహోవాను గూర్చి చెప్పబడ్డాయి మరియు “ప్రభువు” అనే పదము బైబిల్లో పెద్ద అక్షరములతో రాయబడిన చోట అది “యెహోవాను గూర్చే” అని తెలుస్కో. 


:: సర్వాధిపతి చేత నియమింపబడినవారు ::

● దేవుని నిబంధన స్థిరపరుచుటకును మరియు ఓడ చేయుట విషయములో సర్వాధిపతి చేత నియమింపబడిన నోవాహు - (ఆది. 6 అధ్యాయము).
● దేవుని నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుచుటకును మరియు అనేక జనములకు విశ్వాసకులుకు తండ్రి అగుట విషయములో సర్వాధిపతి చేత నియమింపబడిన అబ్రాహాము. - (ఆది.17:1-7).
● దేవుని ప్రజలను ఐగుప్తులోనుండి తోడుకొని పోవుటకు మరియు ఫరోకు దేవునిగా ఉండుట విషయములో సర్వాధిపతి చేత నియమింపబడిన మోషే. - (నిర్గమ. 3:11; 7:1).
● దేవుని ప్రజలును ఏలుబడి చేయుట విషయములో సర్వాధిపతి చేత నియమింపబడిన ఇశ్రాయేలు రాజులు “సౌల్, దావీదు, సొలొమోను”. - (1సమూయేలు. 9:16-17; 16:12-13; 1రాజులు 1: 43-46; 2:2-4).
● యుగయుగములు దేవుని ప్రజులకి ప్రభువుగా ఉంటూ ఏలుబడి చేయుటకు(బౌతికమైన రాజ్యము కాదు), తన ప్రజలను వారి పాపములు నుండి రక్షించుటకును, జగత్తు పునాది వేయబడక మునుపే సర్వాధిపతి చేత నియమింపబడిన ఆయన యెద్ద ఉండే “వాక్యము” అనగా శరీరధారియై మన మధ్యకు అద్వితీయకుమారునిగా పుట్టిన “యేసుక్రీస్తు”. - (2 సమూయేలు. 7:12-16; యిర్మీయా. 23:5; లూకా. 1:32; మత్తయి. 1:21; ఎఫెసీ. 1:6; 1 పేతురు. 1:19-20; యోహాను. 1:1-2; 14; 3:16; 17:24).
ఆ సర్వాధి కారియైన దేవుడు ఎవరును ఏ విధముగా నియమింస్తారో అది వారుకి సొంతము అవుతాది.


"యేసుక్రీస్తు దేవత్వము కలిగినవాడా"..?

దేవత్వము అనగా “దేవుని యొక్క గుణలక్షణములు”.
A). ఆదిలో యేసుక్రీస్తు దేవత్వము కలిగినవాడే అనగా దేవుని వలె నిత్యత్వములో ఉన్నవాడు మరియు దేవత్వము కలిగినవాడు. 
* దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది. - (కొలస్స. 2:9).
* ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. - (యోహాను. 1:1-2).
ఆదియందు అనగా “మొట్టమొదట
వాక్యము అనగా “యేసుక్రీస్తు
దేవుడై యుండెను అనగా “దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత కలిగినవాడు” అని అర్ధము.

B). యేసుక్రీస్తు వారుకి ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. - (యెషయా. 9:6).
ఇవి ఆయనకు ఉపయోగించే బిరుదులు. ప్రతీ పేరుకు అర్థం ఉంటుంది అని మొదట మనము గమనించాలి. నిత్యుడగు తండ్రి అనేది నిత్యత్వపు తండ్రి అని బాషాంతరము.
ఆయన నరమాత్రుడు కాదు, దైవికమైన వ్యక్తి అని తెలియజెప్పుట (యెషయా. 9:1-7) వచనములు ఉద్దేశ్యమే కానీ.. ఆయన మనకి తండ్రిగా నిరూపించుటకు కాదు. పుట్టబోయే వాడు, ఏలుబడి చేయువాడు నరమాత్రుడు కాదు. (యిర్మీయా. 23:5) “దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత” గలవాడే. (కొలస్స. 2:9). “యేసుక్రీస్తు అందరికి ప్రభువు” (అపో.కార్య. 10:36). అని పరిశుద్దాత్ముడు తెలియపరచు సందేశమై ఉంది.

C). యేసుక్రీస్తు సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. - (రోమీ. 9:5).
దేవత్వము విషయములో “సర్వాధికారియైన దేవుడు” అనే బిరుదు పొందినవాడు. 

NOTE: "నేను యేసుక్రీస్తు దేవత్వమును గూర్చి తప్పు పట్టడము లేదు". 

D). అద్వితీయుడునగు సర్వాధిపతి యేసుక్రీస్తును "దేవా" అని సంభోదిచారు. (హెబ్రీ. 1:8). కానీ “నా దేవా” అని సంభోదిచలేదు.

E). మన అద్వితీయుడునగు సర్వాధిపతి తనతో దేవత్వాని, నిత్యత్వాని, మహిమను అనుభవించు యేసుక్రీస్తును మనకి దేవుడుగా నియమించలేదు. 
EX: ఫరోకు దేవునిగా ఉండుట విషయములో సర్వాధిపతి చేత నియమింపబడిన మోషే. – (నిర్గమ. 7:1). మోషే  ఇశ్రాయేలు ప్రజులుకి దేవుడుగా నియమింపబడలేదు.

NOTE:-  యేసు లో “దేవుని యొక్క గుణలక్షణములు” పరిపూర్ణముగా ఉన్నప్పటికీ ఆయనను మనకి దేవుడుగా నియమించక “ప్రభువుగాను” "క్రీస్తుగాను" నియమించెను.
(అపొ. కార్యములు 2 :36)
మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను.

హెచ్చరిక 

* "యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని", దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. - (రోమీ. 10:9).
* "తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను. - (రోమీయులకు 14:9).

* పరిశుద్ధ గ్రంథం తెలియ జేసిన సమాచార ప్రకారం జీవిస్తావో లేక మీ సొంత ఉద్థేశ్యాల ప్రకారం జీవిస్తావో మీ ఇష్టం మిత్రులారా!!

మీ ఆత్మీయ సహోదరుడు,
Bro. మనోహర్ నవీన ©

Share this

Related Posts

Previous
Next Post »

10 comments

comments
ఉదయ్ కుమార్
June 10, 2017 at 8:08 PM delete

Good Post Brother

Reply
avatar
September 16, 2017 at 10:25 PM delete

అద్వితీయుడు అను పదానికి భాషయొక్క మూల అర్ధము ఏమిటో తెలిస్తే యేసుక్రీస్తు దేవుడా కాదా అనేది తెలుస్తుంది

Reply
avatar
September 16, 2017 at 11:35 PM delete

యేసుక్రీస్తు నాకు దేవుడుగా నియమింపబడలేదు. అయన నాకు దేవుడు కాదు. ఆయనకి ఎవరు దేవుడో ఆయనే నాకు దేవుడు.

Reply
avatar
April 1, 2018 at 5:09 AM delete

Bro.. యేసుక్రీస్తుకి ప్రార్థన చేయటం correct ఆ కాదా?? ఇది నా doubt మాత్రమే... నేను ఒక 2 examples Bible నుండి చూపిస్తా... దాన్ని base చేసుకుని చెప్పండి plz..
అపో.కార్యములు 7: 59
ప్రభువును గూర్చి మొరపెట్టుకున్న యేసుప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి..

1)అపో.కార్యములు 7: 60
అతడు మోకాళ్లూని ప్రభువా, వారిమీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను; ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను.
2)2కోరింథీయులకు 12: 8
అది నా యొద్ద నుండి తొలగిపోవలెనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని.
2కోరింథీయులకు 12: 9
అందుకునా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము(లేక,నన్ను కప్పునిమిత్తము) , విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.

ఈ 2 incidents లో.. వాళ్లు యేసును వేడుకున్నారని Bible chepthundi... మనం కూడా దీన్ని బట్టి యేసును ప్రార్థన చేయవచ్చు..?? Plz explain me...

Reply
avatar
April 2, 2018 at 11:34 PM delete

త్వరలోనే అంశము రాస్తాను. అప్పటి వరకు ఈ వెబ్సైట్ చూస్తూ ఉండండి. వందనములు!!

Reply
avatar
December 8, 2018 at 12:17 PM delete

యోహాను 1:1-14 ప్రకారం యేసు దేవుడు అని. సూటిగా అర్థం అవుతుంది. కదా బ్రో...వివరించండి...

Reply
avatar
December 14, 2018 at 7:55 PM delete

యోహాను. 1:1 లో వాక్యము దేవుడైయుండెను. అని ఉంది. యేసు అని లేదు. యేసు అను నామము ఆయనకి ఈ భూమి మీదకు వచ్చిన పిమ్మటనే పెట్టడం జరిగింది. మత్తయి 1:21 చూడుము.

Reply
avatar
January 17, 2021 at 1:09 PM delete

దేవుడు కాని వారి నామమున మనం కూడుకోము.
ఏదైనా ఒక నామమున మనం కూడుకుంటున్నాము అంటే ఆయన దేవుడై ఉండాలి....
అలా కూడుకున్న వారి "మద్య" దేవుడు
కా ని వా డు "ఉం డ డు"...
.దేవుడైన వాడు మాత్రమే వారి మద్య ఉంటాడు......మత్తయి18:20

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16