సామెతలు 8వ అధ్యా., క్రీస్తుని గూర్చా? Is proverbs  8th chapter about Christ?

"సామెతలు 8వ అధ్యా., క్రీస్తుని గూర్చా"..?

నా తోటి విస్వాసులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ఈనాడు అనేకమంది క్రైస్తవ సహోదరులు “సామెతలు 8”వ అధ్యాయము క్రీస్తుని గూర్చే చెప్పబడినదని అనుకొనుచు తమస్వకీయనాశనమునకు అపార్థము చేసుకొనుచున్నారు. (2 పేతురు. 3:16)


మనుష్యుల జ్ఞానము చేత వక్రీకరించబడుతున్న
కొన్ని సంగతులు.


1)   రాజైన సోలోమోనుని ప్రవక్తగా భావిస్తూ సామెతలు 8వ అధ్యా., లో విషయములు యేసుక్రీస్తు వారి గూర్చి అని వక్రీకరించుట.

2)   సామెతలు 8వ అధ్యా., లోని 1వ వచనమును బట్టి;  “జ్ఞానము” అనే మాటకి  “క్రీస్తే” అని వక్రీకరించుట.

3)   సామెతలు 8వ అధ్యా., లోని 2 నుండి 4 వచనములను బట్టి; ఈ జ్ఞానము అనగా క్రీస్తు త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను నిలుస్తూ గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దనుఆయన నిలువబడి గట్టిగా ప్రకటన చేయుచున్నారు అని వక్రీకరించుట.

4)   సామెతలు 8వ అధ్యా., లోని 21వ వచనమును బట్టి; క్రీస్తుని ప్రేమించువారిని ఈ లోకములో ఆస్తికర్తలుగా చేయువాడని వక్రీకరించుట.

5)   సామెతలు 8వ అధ్యా., లోని 22వ వచనమును బట్టి; యెహోవా వారు పూర్వకాలమందే ప్రధమమైనదానిగా క్రీస్తుని కలుగజేసారని వక్రీకరించుట.

6)   సామెతలు 8వ అధ్యా., లోని 23 నుండి 29 వచనములను బట్టి; యెహోవా వారు క్రీస్తు ని సృష్టికి ముందే పుట్టి౦చియున్నారని వక్రీకరించుట.

7)   సామెతలు 8వ అధ్యా., లోని 30వ వచనమును బట్టి; క్రీస్తు వారు ప్రధానశిల్పియై యెహోవా సన్నిధిని ఆనందిoచుచున్నారని వక్రీకరించుట.

8)   సామెతలు 8వ అధ్యా., లోని 35వ వచనమును బట్టి; క్రీస్తుని కొనిగొనువాడు జీవమును కనుగొనాలని వక్రీకరించుట.


ఈ విధముగా అనేకమంది సత్య వాక్యమును సరిగా విభజన చేయక (2 తిమోతి. 2:15) లేఖనములను అపార్థము చేసుకొనుచు తమకు తామే శేఘ్రముగా నాశనము కలుగజేసికొనుచున్నారు (2 పేతురు. 2:1).



వక్రీకరించబడుతున్న వాటి యొక్కగ్రంధ వివరణ:



» 1)   దావీదు కుమారుడైన సోలోమోను రాజుగా నియమింపబడ్డాడు కానీ ప్రవక్త కాదు (1 రాజులు. 1:43; సామెతలు. 1:1) ఈయన తన రాజ్యములో అందరికంటే జ్ఞానవంతుడై ఉండి మూడువేల సామెతలు రచించెను (1 రాజులు. 4:32). ఈయన చేత వ్రాయబడినవి సామెతలు కాని ప్రవచనములు కాదు (సామెతలు. 1:2-4).


అంతట ఆయన - మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తలగ్రంథములలోను కీర్తనలలోను నన్నుగూర్చి    వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్దఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితోచెప్పెను. – (లూకా. 24:44).


పై వచనమును బట్టి రాజైన సోలోమోను రచించిన సామెతలు గ్రంధములో వ్రాయబడినవి ప్రవచనములు కావు .


» 2)   సామెతలు 8వ అధ్యా., లోని జ్ఞానము అనే పదము సృష్టికి సంబంధించినది. గ్రంధకర్త ఈ జ్ఞానము అనే పదమును వ్యక్తీకరనాలంకారములో చెప్పడం జరిగినది.


ఉదా:     సామెతలు 8వ అధ్యా., లోని   తన, నన్ను, నేను, నావలన

ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? (1 కోరింధి. 15:55). ఈ వచనములో మరణము అనే పదము ఒక మనిషిని గూర్చి వర్ణించుట లేదు కాని వ్యక్తీకరనాలంకారములో చెప్పబడినది.


సామెతలు 8వ అధ్యా., లోని సృష్టికి సంబంధించిన ఈ జ్ఞానమును (సామెతలు. 8:1) సిలువను గూర్చిన ఆత్మీయ జ్ఞానముతో(క్రీస్తుతో) (1 కోరింధి. 1:18-32)పోల్చి చూడడం దేవుని వాక్యమును వక్రీకరించడమే.


పిలువబడినవారికే అనగా క్రీస్తు సంఘమునకు (church of Christ) క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు (1 కొరింధి. 1:24). యిట్టి క్రీస్తు  జ్ఞానమును సామెతలు 8వ అధ్యా., లో చెప్పబడిన సృష్టి జ్ఞానముతో పోల్చి చూడడం దేవుని వాక్యమును వక్రీకరించడమే.


క్రీస్తు మనకు జ్ఞానమును (సిలువను గూర్చిన జ్ఞానము)  నీతియుపరిశుద్ధతయు విమోచనమాయెను. - (1 కోరింధి 1:31).


» 3)   ప్రవక్తయైన యెషయా క్రీస్తుని గూర్చి ముందుగా ప్రవచించిన ప్రవచనమేమనగా:


ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడునా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మనుఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయముకనుపరచును.   “అతడు కేకలు వేయడు అరువడు తనకంఠస్వరము వీధిలో వినబడనియ్యడు”. (యెషయా. 42:1-2).


పై వచనమును బట్టి సామెతలు 8వ అధ్యా., 2 నుండి 4 వచనములను బట్టి క్రీస్తు కేకలు వేయడు అరువడు తనకంఠస్వరము వీధిలో వినబడనియ్యడు కనుక సామెతలు 8వ అధ్యా., లో చెప్పబడిన జ్ఞానము అనే మాట క్రీస్తుకి సంబంధించినది కాదు.


» 4)   సామెతలు 8వ అధ్యా., 21 లోని చెప్పబడిన“నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును వారినిధులను నింపుదును” ఈ మాట క్రీస్తే చెప్పియున్నాడని  అని అనుకున్నచో  నీవు వాక్యమను అపార్ధము చేసుకున్నట్టే ఎందుకనగా ధనవంతుడుపరలోకరాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభము. (మత్తయి. 19:24; మార్కు. 10:25).


         భూమి మీద మీకొరకు ధనము కూర్చుకొనవద్దు. (మత్తయి. 6:19).


పై వచనమును బట్టి చూస్తే సామెతలు 8వ అధ్యా., 21 లో ధనమును గూర్చి చెప్పబడిన  ఆ మాటను క్రీస్తు చెప్పుటలేదు.


» 5)   అతడు తండ్రిలేనివాడును తల్లిలేనివాడునువంశావళిలేనివాడును, జీవితకాలమునకు ఆదియైననుజీవనమునకు అంతమైనను లేనివాడునైయుండిదేవుని కుమారుని పోలియున్నాడు. (హెబ్రీ. 7:3)

క్రీస్తు దేవుని సృష్టి కి ఆదియునైనవాడు. (ప్రకటన. 3:14)


పై వచనమును బట్టి క్రీస్తు వారు ఆదియు అంతము లేనివాడై , ఆదియందు దేవునియెద్ద ఉన్నవాడు కనుక సామెతలు 8వ అధ్యా., లోని 22వ వచనము సృష్టి జ్ఞానము గూర్చి చెప్పబడినది కాని క్రీస్తుని గూర్చి కాదు.


6)   ఆదియందు వాక్యముండెను, వాక్యముదేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. (యోహాను. 1:1). ఆ వాక్యము శరీరధారియై,కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను. (యోహాను. 1:14).


“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తనఅద్వితీయకుమారుడుగాపుట్టిన వానియందు విశ్వాసముంచుప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయననుఅనుగ్రహించెను”. (యోహాను. 3:16).


పై వచనమును బట్టి ఆదిలో తండ్రియెద్ద ఉన్న వాక్యము (logos) అద్వితీయకుమారుడుగా మనమధ్య పుట్టెను (మత్తయి. 2:1; లూకా. 2:11; యోహాను. 7:42) కనుక సామెతలు 8వ అధ్యా., లోని 23 నుండి 29 వచనములను బట్టి యెహోవా వారు సృష్టికి ముందే క్రీస్తుని పుట్టి౦చియున్నారని చెప్పడం దేవుని వాక్యమును వక్రీకరించడమే.


» 7)   తన జ్ఞానముచేత ఆయన ఆకాశమునుకలుగజేసెను ఆయన కృప నిరంతరముండును. (కీర్తన. 136:5). యెహోవా, నీ కార్యములు ఎన్నెన్నివిధములుగా నున్నవి జ్ఞానముచేత నీవు వాటన్నిటినినిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమినిండియున్నది.(కీర్తన. 104:24). మనకు ఒకేదేవుడున్నాడు. ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను ఆయన నిమిత్తముమనమున్నాము. (1 కోరింధి. 8:6)


పై వచనమును బట్టి యెహోవా తన జ్ఞానము చేత సృష్టినంతటిని కలుగజేసెను సామెతలు 8వ అధ్యా.,  30వ వచనములో చెప్పబడిన నేను (సృష్టి జ్ఞానము) యెహోవాయెద్ద ఉన్నది.


» 8)   లేఖనములయందు మీకు నిత్యజీవము కలదనితలంచుచు వాటిని పరిశోధించుచున్నారు; అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. (యోహాను. 5:39)


క్రీస్తే నిత్యజీవమై ఉన్నాడు కనుక క్రీస్తునందున్న మనము జీవమును ప్రత్యేకముగా కనుగొన్న అవసరము లేదు . (యోహాను. 8:12; 14:6)


పై వచనమును బట్టి సామెతలు 8వ అధ్యా., 35 వచనములోని చెప్పబడినట్టుగా “నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును” అను ఈ మాట క్రీస్తుని గూర్చి చెప్పబడుటలేదు


మీ ఆత్మీయ సహోదరుడు,
( మనోహర్ బాబు గుడివాడ )©

Share this

Related Posts

Previous
Next Post »

21 comments

comments
Ravi
June 28, 2017 at 11:04 PM delete

Good Work brother KM

Reply
avatar
తిమోతి
June 28, 2017 at 11:52 PM delete

వందనములు తమ్ముడు

చాల చక్కగా రాసావు మీ సేవకుడు పేరు ఏంటి..? ఏ స్థానిక క్రీస్తుసంఘమునకు చెందిన వారు? మీ ఫోన్ నెంబర్ కావాలి.. దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానము బట్టి మిమ్మలి క్రీస్తు నందు అభినందన తెలుపుతున్న...

Bro. తిమోతి

Reply
avatar
Gowri
June 29, 2017 at 12:21 AM delete

Good Explanation Brother KM

Reply
avatar
ఉదయ్ కుమార్
June 29, 2017 at 12:26 AM delete

కీర్తనలు 8 లో జ్ఞానమును వ్యక్తీ అలంకరణముగా వర్ణిస్తూ రాసారు ఎలా చెప్పుతున్నావు బ్రదర్.

మీరు రాసిన కొన్నింటికి నేను అంగీకరిస్తున్నా కాస్త దీనికి మీరు సమాధానము ఇవ్వవలసిందిగా ప్రభువు నందు కోరుతున్నా బ్రదర్.

వందనములు బ్రదర్. థాంక్యూ

Reply
avatar
James
June 29, 2017 at 12:38 AM delete

Nice Post Bro. KM

1 Kings 1: 43
And Jonathan answered and said to Adonijah, Verily our lord king David hath made Solomon king.


He is NOT a Prophet.

Thankq

Reply
avatar
James
June 29, 2017 at 12:42 AM delete

Jesus said "Luke 24: 44
And he said unto them, These are the words which I spake unto you, while I was yet with you, that all things must be fulfilled, which were written in the law of Moses, and in the prophets, and in the psalms, concerning me."

Reply
avatar
Anil
June 29, 2017 at 6:07 AM delete

Good Morning Anna

I For God valu okala miru okala cheputhunnaru. Endhuku ala ?

Okkati matrame naku baga ardham ayindhi prophet matrame prophecy cheppagalaru ani...

Solomon prophet kaadhu. Ayana israel King.

Annaya naku second point marala okkasari explain cheyandi .

Vandhanamulu anna

Reply
avatar
Sagar
June 29, 2017 at 6:54 AM delete

Good Post annaya (y)

Reply
avatar
Vijay kumar
June 29, 2017 at 7:10 AM delete

Bro. KM మీరు ఒక దొంగ బోధకులు అని తెలుసు . దయచేసి ఇలాంటి పోస్టులు తో మరింతగా క్రైస్తవ్యమును కించ పరచకండి. మీ వలన మాకు కీడు తప్ప మేలు లేదు. కాస్త మంచి అంశములు రాయండి ఇలా దేవుని సేవకులను విమర్శా చేస్తూ పోస్ట్లు పెట్టకండి
అసలు మీకు ఏమి తెలుసు? అన్నియు విపరీత వాదనాయే కనిపిస్తున్నాయి. మొదట మీరు వాక్యము నేర్చుకోండి. అప్పుడు మాకు చెప్పుదురు.

ఇంకో సారి ఇలాంటి వ్రాయద్దు రాస్తే బాగోదు.

ప్రైస్ ది లార్డ్

Reply
avatar
Prasad
June 29, 2017 at 7:44 AM delete

Vandhanamulu Thammudu

Good Morning

Chala baga rasavu evaru emi anina asalu pattinchukoku... Sathyamee cheputhunav...

Chala chinna vishyamunu kuda alochana cheyaka Proverbs oka prophecy book anukovadam vala ajnaname. Solomon oka king matrame kaani prophet kaadhu. Miru iche vivarana kuda chala bagundhi.

Naku entho chala use avutundi miru rastunna topics anniyu.. devuniki mahima kirthi kalugunugaaka amen.

Reply
avatar
Nagesh
June 29, 2017 at 2:55 PM delete

ఒరే దుర్బోధకుడా ఎందుకు రా నీవు మాకు ఇలా.... నీవు క్రైస్తవ్యమునకు పట్టిన చీడ పురుగువి రా.... ఛి దరిద్రుడా.. సామెతలు 8 లో జ్ఞానము అంటే క్రీస్తురా చూడు

కొలస్సీయులకు 2: 3
బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయనయందే గుప్తములైయున్నవి.

క్రీస్తు కాదు అని అనడానికి నీవు ఎవడివి? నీ ఆలోచనలు బైబిల్ కి కలపకు అందరు విస్వశము పాడుచెయ్యకు. నీకు సిగ్గు కలుగుతే దయచేసి బైబిల్ విరుద్ధముగాఇలాంటి పోస్టులు పెట్టకు

Reply
avatar
Vijay kumar
June 29, 2017 at 3:03 PM delete

Bro. Nagesh వీడికి సరిగ్గా ఇచ్చావు.. వీడి లాంటి వారు వలెనే దొంగ బోధ ఎక్కువగా ప్రచారం అవుతుంది. ముందు కామెంట్ పెట్టా ఇంకా చూసి రిప్లై ఇవ్వలేదు. ఏమైనా అడుగుతే link చూడు అంటాడు మరల నన్ను బ్లాక్ చేసాడు. చేతకాని దద్దమ్మ ఛీ ఛీ వీడు వీడి బ్రతుకు.. వీడి సంఘము ఎక్కడ అనేది తెలుస్తే బాగుణ్ణు వెళ్లి మరి గట్టిగ ఇచ్చేవాడిని...

Reply
avatar
యాకోబు
June 29, 2017 at 5:56 PM delete

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు నా వందనములు బ్రదర్ మనోహర్

మీరు రాసిన ప్రతి అంశము చూసాను. చాల బాగున్నాయి. సత్యము ఏంటో నాకు అర్ధము అగుచున్నది. మొదట మీ ఓపికకు, అసక్తిని మెచ్చుకోవాలి. చాల ధన్యవాదములు

మీరు రాసిన ప్రతీది యొక్క మహిమ కీర్తి మన తండ్రికి చెల్లునుగాకా.. బ్రదర్ కొందఱు సహోదరులు మిమ్మలి దూషణ చేయడము చూసాను. అది తట్టుకోలేక నేను ఇలా కామెంట్ చేస్తున్నా.. వారు మాటలు పట్టికించుకోవద్దు. దేవుని పనిలో ముందుకు సాగిపోండి. మన దేవుడు మీకు సహాయము చేయుగాక ఆమెన్.

Reply
avatar
Goutham
June 29, 2017 at 11:31 PM delete

God Bless You Bro. KM

Reply
avatar
December 12, 2017 at 9:11 AM delete

Neevu kraistavidiva? Saati sahodarudini hecharinche padhati idena? Sahodarudini hecharinche padhati Bible ni adagandi! Me sonta aalochanalatho hecharinchadam meeku(if you are Christian)tagadu

Reply
avatar
December 12, 2017 at 9:30 AM delete

Prabhuvu nandu sahodaruniki naa vandanamulu,
Elanti postlu petti mammunu aatmiyamga balaparustunnanduku santhoshitunnamu.
II Thimoti 1:7-10;2:15;3:1-5,23,24;4:2-5
E lekhanalanu batti meru aadarinchabadalani korutunnanu,prabhuvunandu nee sahodarudu.
Anil kumar,church of Christ.

Reply
avatar
December 12, 2017 at 9:48 AM delete

Chala baaundi, neevu kristu (anagaa prabhuvu sangham)lo avayavamu va?nee saati avayavanni hecharinche padhati idena? Neevu support chesina vyakti oka reference cheppaadu colassians 2:3 meerru apaardham chesukunnaru!budhi gnanamula sarva sampadalu aayanayamde guptamulai unnavi Ani undi! Deeni ardham aayanalo unnayi Ani anthe kaani aayane Avi Ani kaadu! Idi meeru telusukovalani prematho korutunnanu.
J.Anil Kumar
Member,
Church of Christ
Diwancheruvu
Rajahmundry

Reply
avatar
February 8, 2019 at 7:52 AM delete

వందనములు మీరు వ్రాసినవి బాగున్నాయ్ విమరర్శలను పట్టంచుకోవద్దు సహో బాలాజి వందనములు 7661097590

Reply
avatar
February 8, 2019 at 7:53 AM delete

వందనములు మీరు వ్రాసినవి బాగున్నాయ్ విమరర్శలను పట్టంచుకోవద్దు సహో బాలాజి వందనములు 7661097590

Reply
avatar
October 26, 2019 at 12:02 PM delete

సొలొమాను రాసిన సామెతలు,పరమగీతాలు,
ప్రసంగి అనే chapters లలో క్రీస్తు సంబంధించిన ప్రవచనాలు ఉండవు.ఎందుకంటే సొలొమాను ప్రవక్త కాదు.

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16