Showing posts with label జ్ఞానము. Show all posts
Showing posts with label జ్ఞానము. Show all posts

సామెతలు 8వ అధ్యా., క్రీస్తుని గూర్చా? Is proverbs  8th chapter about Christ?

"సామెతలు 8వ అధ్యా., క్రీస్తుని గూర్చా"..?

నా తోటి విస్వాసులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ఈనాడు అనేకమంది క్రైస్తవ సహోదరులు “సామెతలు 8”వ అధ్యాయము క్రీస్తుని గూర్చే చెప్పబడినదని అనుకొనుచు తమస్వకీయనాశనమునకు అపార్థము చేసుకొనుచున్నారు. (2 పేతురు. 3:16)


మనుష్యుల జ్ఞానము చేత వక్రీకరించబడుతున్న
కొన్ని సంగతులు.


1)   రాజైన సోలోమోనుని ప్రవక్తగా భావిస్తూ సామెతలు 8వ అధ్యా., లో విషయములు యేసుక్రీస్తు వారి గూర్చి అని వక్రీకరించుట.

2)   సామెతలు 8వ అధ్యా., లోని 1వ వచనమును బట్టి;  “జ్ఞానము” అనే మాటకి  “క్రీస్తే” అని వక్రీకరించుట.

3)   సామెతలు 8వ అధ్యా., లోని 2 నుండి 4 వచనములను బట్టి; ఈ జ్ఞానము అనగా క్రీస్తు త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను నిలుస్తూ గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దనుఆయన నిలువబడి గట్టిగా ప్రకటన చేయుచున్నారు అని వక్రీకరించుట.

4)   సామెతలు 8వ అధ్యా., లోని 21వ వచనమును బట్టి; క్రీస్తుని ప్రేమించువారిని ఈ లోకములో ఆస్తికర్తలుగా చేయువాడని వక్రీకరించుట.

5)   సామెతలు 8వ అధ్యా., లోని 22వ వచనమును బట్టి; యెహోవా వారు పూర్వకాలమందే ప్రధమమైనదానిగా క్రీస్తుని కలుగజేసారని వక్రీకరించుట.

6)   సామెతలు 8వ అధ్యా., లోని 23 నుండి 29 వచనములను బట్టి; యెహోవా వారు క్రీస్తు ని సృష్టికి ముందే పుట్టి౦చియున్నారని వక్రీకరించుట.

7)   సామెతలు 8వ అధ్యా., లోని 30వ వచనమును బట్టి; క్రీస్తు వారు ప్రధానశిల్పియై యెహోవా సన్నిధిని ఆనందిoచుచున్నారని వక్రీకరించుట.

8)   సామెతలు 8వ అధ్యా., లోని 35వ వచనమును బట్టి; క్రీస్తుని కొనిగొనువాడు జీవమును కనుగొనాలని వక్రీకరించుట.


ఈ విధముగా అనేకమంది సత్య వాక్యమును సరిగా విభజన చేయక (2 తిమోతి. 2:15) లేఖనములను అపార్థము చేసుకొనుచు తమకు తామే శేఘ్రముగా నాశనము కలుగజేసికొనుచున్నారు (2 పేతురు. 2:1).



వక్రీకరించబడుతున్న వాటి యొక్కగ్రంధ వివరణ:



» 1)   దావీదు కుమారుడైన సోలోమోను రాజుగా నియమింపబడ్డాడు కానీ ప్రవక్త కాదు (1 రాజులు. 1:43; సామెతలు. 1:1) ఈయన తన రాజ్యములో అందరికంటే జ్ఞానవంతుడై ఉండి మూడువేల సామెతలు రచించెను (1 రాజులు. 4:32). ఈయన చేత వ్రాయబడినవి సామెతలు కాని ప్రవచనములు కాదు (సామెతలు. 1:2-4).


అంతట ఆయన - మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తలగ్రంథములలోను కీర్తనలలోను నన్నుగూర్చి    వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్దఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితోచెప్పెను. – (లూకా. 24:44).


పై వచనమును బట్టి రాజైన సోలోమోను రచించిన సామెతలు గ్రంధములో వ్రాయబడినవి ప్రవచనములు కావు .


» 2)   సామెతలు 8వ అధ్యా., లోని జ్ఞానము అనే పదము సృష్టికి సంబంధించినది. గ్రంధకర్త ఈ జ్ఞానము అనే పదమును వ్యక్తీకరనాలంకారములో చెప్పడం జరిగినది.


ఉదా:     సామెతలు 8వ అధ్యా., లోని   తన, నన్ను, నేను, నావలన

ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? (1 కోరింధి. 15:55). ఈ వచనములో మరణము అనే పదము ఒక మనిషిని గూర్చి వర్ణించుట లేదు కాని వ్యక్తీకరనాలంకారములో చెప్పబడినది.


సామెతలు 8వ అధ్యా., లోని సృష్టికి సంబంధించిన ఈ జ్ఞానమును (సామెతలు. 8:1) సిలువను గూర్చిన ఆత్మీయ జ్ఞానముతో(క్రీస్తుతో) (1 కోరింధి. 1:18-32)పోల్చి చూడడం దేవుని వాక్యమును వక్రీకరించడమే.


పిలువబడినవారికే అనగా క్రీస్తు సంఘమునకు (church of Christ) క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు (1 కొరింధి. 1:24). యిట్టి క్రీస్తు  జ్ఞానమును సామెతలు 8వ అధ్యా., లో చెప్పబడిన సృష్టి జ్ఞానముతో పోల్చి చూడడం దేవుని వాక్యమును వక్రీకరించడమే.


క్రీస్తు మనకు జ్ఞానమును (సిలువను గూర్చిన జ్ఞానము)  నీతియుపరిశుద్ధతయు విమోచనమాయెను. - (1 కోరింధి 1:31).


» 3)   ప్రవక్తయైన యెషయా క్రీస్తుని గూర్చి ముందుగా ప్రవచించిన ప్రవచనమేమనగా:


ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడునా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మనుఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయముకనుపరచును.   “అతడు కేకలు వేయడు అరువడు తనకంఠస్వరము వీధిలో వినబడనియ్యడు”. (యెషయా. 42:1-2).


పై వచనమును బట్టి సామెతలు 8వ అధ్యా., 2 నుండి 4 వచనములను బట్టి క్రీస్తు కేకలు వేయడు అరువడు తనకంఠస్వరము వీధిలో వినబడనియ్యడు కనుక సామెతలు 8వ అధ్యా., లో చెప్పబడిన జ్ఞానము అనే మాట క్రీస్తుకి సంబంధించినది కాదు.


» 4)   సామెతలు 8వ అధ్యా., 21 లోని చెప్పబడిన“నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును వారినిధులను నింపుదును” ఈ మాట క్రీస్తే చెప్పియున్నాడని  అని అనుకున్నచో  నీవు వాక్యమను అపార్ధము చేసుకున్నట్టే ఎందుకనగా ధనవంతుడుపరలోకరాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభము. (మత్తయి. 19:24; మార్కు. 10:25).


         భూమి మీద మీకొరకు ధనము కూర్చుకొనవద్దు. (మత్తయి. 6:19).


పై వచనమును బట్టి చూస్తే సామెతలు 8వ అధ్యా., 21 లో ధనమును గూర్చి చెప్పబడిన  ఆ మాటను క్రీస్తు చెప్పుటలేదు.


» 5)   అతడు తండ్రిలేనివాడును తల్లిలేనివాడునువంశావళిలేనివాడును, జీవితకాలమునకు ఆదియైననుజీవనమునకు అంతమైనను లేనివాడునైయుండిదేవుని కుమారుని పోలియున్నాడు. (హెబ్రీ. 7:3)

క్రీస్తు దేవుని సృష్టి కి ఆదియునైనవాడు. (ప్రకటన. 3:14)


పై వచనమును బట్టి క్రీస్తు వారు ఆదియు అంతము లేనివాడై , ఆదియందు దేవునియెద్ద ఉన్నవాడు కనుక సామెతలు 8వ అధ్యా., లోని 22వ వచనము సృష్టి జ్ఞానము గూర్చి చెప్పబడినది కాని క్రీస్తుని గూర్చి కాదు.


6)   ఆదియందు వాక్యముండెను, వాక్యముదేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. (యోహాను. 1:1). ఆ వాక్యము శరీరధారియై,కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను. (యోహాను. 1:14).


“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తనఅద్వితీయకుమారుడుగాపుట్టిన వానియందు విశ్వాసముంచుప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయననుఅనుగ్రహించెను”. (యోహాను. 3:16).


పై వచనమును బట్టి ఆదిలో తండ్రియెద్ద ఉన్న వాక్యము (logos) అద్వితీయకుమారుడుగా మనమధ్య పుట్టెను (మత్తయి. 2:1; లూకా. 2:11; యోహాను. 7:42) కనుక సామెతలు 8వ అధ్యా., లోని 23 నుండి 29 వచనములను బట్టి యెహోవా వారు సృష్టికి ముందే క్రీస్తుని పుట్టి౦చియున్నారని చెప్పడం దేవుని వాక్యమును వక్రీకరించడమే.


» 7)   తన జ్ఞానముచేత ఆయన ఆకాశమునుకలుగజేసెను ఆయన కృప నిరంతరముండును. (కీర్తన. 136:5). యెహోవా, నీ కార్యములు ఎన్నెన్నివిధములుగా నున్నవి జ్ఞానముచేత నీవు వాటన్నిటినినిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమినిండియున్నది.(కీర్తన. 104:24). మనకు ఒకేదేవుడున్నాడు. ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను ఆయన నిమిత్తముమనమున్నాము. (1 కోరింధి. 8:6)


పై వచనమును బట్టి యెహోవా తన జ్ఞానము చేత సృష్టినంతటిని కలుగజేసెను సామెతలు 8వ అధ్యా.,  30వ వచనములో చెప్పబడిన నేను (సృష్టి జ్ఞానము) యెహోవాయెద్ద ఉన్నది.


» 8)   లేఖనములయందు మీకు నిత్యజీవము కలదనితలంచుచు వాటిని పరిశోధించుచున్నారు; అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. (యోహాను. 5:39)


క్రీస్తే నిత్యజీవమై ఉన్నాడు కనుక క్రీస్తునందున్న మనము జీవమును ప్రత్యేకముగా కనుగొన్న అవసరము లేదు . (యోహాను. 8:12; 14:6)


పై వచనమును బట్టి సామెతలు 8వ అధ్యా., 35 వచనములోని చెప్పబడినట్టుగా “నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును” అను ఈ మాట క్రీస్తుని గూర్చి చెప్పబడుటలేదు


మీ ఆత్మీయ సహోదరుడు,
( మనోహర్ బాబు గుడివాడ )©

The churches of Christ greet you - Roma 16:16