సామెతలు 8వ అధ్యా., క్రీస్తుని గూర్చా? Is proverbs  8th chapter about Christ?

"సామెతలు 8వ అధ్యా., క్రీస్తుని గూర్చా"..?

నా తోటి విస్వాసులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ఈనాడు అనేకమంది క్రైస్తవ సహోదరులు “సామెతలు 8”వ అధ్యాయము క్రీస్తుని గూర్చే చెప్పబడినదని అనుకొనుచు తమస్వకీయనాశనమునకు అపార్థము చేసుకొనుచున్నారు. (2 పేతురు. 3:16)


మనుష్యుల జ్ఞానము చేత వక్రీకరించబడుతున్న
కొన్ని సంగతులు.


1)   రాజైన సోలోమోనుని ప్రవక్తగా భావిస్తూ సామెతలు 8వ అధ్యా., లో విషయములు యేసుక్రీస్తు వారి గూర్చి అని వక్రీకరించుట.

2)   సామెతలు 8వ అధ్యా., లోని 1వ వచనమును బట్టి;  “జ్ఞానము” అనే మాటకి  “క్రీస్తే” అని వక్రీకరించుట.

3)   సామెతలు 8వ అధ్యా., లోని 2 నుండి 4 వచనములను బట్టి; ఈ జ్ఞానము అనగా క్రీస్తు త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను నిలుస్తూ గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దనుఆయన నిలువబడి గట్టిగా ప్రకటన చేయుచున్నారు అని వక్రీకరించుట.

4)   సామెతలు 8వ అధ్యా., లోని 21వ వచనమును బట్టి; క్రీస్తుని ప్రేమించువారిని ఈ లోకములో ఆస్తికర్తలుగా చేయువాడని వక్రీకరించుట.

5)   సామెతలు 8వ అధ్యా., లోని 22వ వచనమును బట్టి; యెహోవా వారు పూర్వకాలమందే ప్రధమమైనదానిగా క్రీస్తుని కలుగజేసారని వక్రీకరించుట.

6)   సామెతలు 8వ అధ్యా., లోని 23 నుండి 29 వచనములను బట్టి; యెహోవా వారు క్రీస్తు ని సృష్టికి ముందే పుట్టి౦చియున్నారని వక్రీకరించుట.

7)   సామెతలు 8వ అధ్యా., లోని 30వ వచనమును బట్టి; క్రీస్తు వారు ప్రధానశిల్పియై యెహోవా సన్నిధిని ఆనందిoచుచున్నారని వక్రీకరించుట.

8)   సామెతలు 8వ అధ్యా., లోని 35వ వచనమును బట్టి; క్రీస్తుని కొనిగొనువాడు జీవమును కనుగొనాలని వక్రీకరించుట.


ఈ విధముగా అనేకమంది సత్య వాక్యమును సరిగా విభజన చేయక (2 తిమోతి. 2:15) లేఖనములను అపార్థము చేసుకొనుచు తమకు తామే శేఘ్రముగా నాశనము కలుగజేసికొనుచున్నారు (2 పేతురు. 2:1).



వక్రీకరించబడుతున్న వాటి యొక్కగ్రంధ వివరణ:



» 1)   దావీదు కుమారుడైన సోలోమోను రాజుగా నియమింపబడ్డాడు కానీ ప్రవక్త కాదు (1 రాజులు. 1:43; సామెతలు. 1:1) ఈయన తన రాజ్యములో అందరికంటే జ్ఞానవంతుడై ఉండి మూడువేల సామెతలు రచించెను (1 రాజులు. 4:32). ఈయన చేత వ్రాయబడినవి సామెతలు కాని ప్రవచనములు కాదు (సామెతలు. 1:2-4).


అంతట ఆయన - మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తలగ్రంథములలోను కీర్తనలలోను నన్నుగూర్చి    వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్దఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితోచెప్పెను. – (లూకా. 24:44).


పై వచనమును బట్టి రాజైన సోలోమోను రచించిన సామెతలు గ్రంధములో వ్రాయబడినవి ప్రవచనములు కావు .


» 2)   సామెతలు 8వ అధ్యా., లోని జ్ఞానము అనే పదము సృష్టికి సంబంధించినది. గ్రంధకర్త ఈ జ్ఞానము అనే పదమును వ్యక్తీకరనాలంకారములో చెప్పడం జరిగినది.


ఉదా:     సామెతలు 8వ అధ్యా., లోని   తన, నన్ను, నేను, నావలన

ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? (1 కోరింధి. 15:55). ఈ వచనములో మరణము అనే పదము ఒక మనిషిని గూర్చి వర్ణించుట లేదు కాని వ్యక్తీకరనాలంకారములో చెప్పబడినది.


సామెతలు 8వ అధ్యా., లోని సృష్టికి సంబంధించిన ఈ జ్ఞానమును (సామెతలు. 8:1) సిలువను గూర్చిన ఆత్మీయ జ్ఞానముతో(క్రీస్తుతో) (1 కోరింధి. 1:18-32)పోల్చి చూడడం దేవుని వాక్యమును వక్రీకరించడమే.


పిలువబడినవారికే అనగా క్రీస్తు సంఘమునకు (church of Christ) క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు (1 కొరింధి. 1:24). యిట్టి క్రీస్తు  జ్ఞానమును సామెతలు 8వ అధ్యా., లో చెప్పబడిన సృష్టి జ్ఞానముతో పోల్చి చూడడం దేవుని వాక్యమును వక్రీకరించడమే.


క్రీస్తు మనకు జ్ఞానమును (సిలువను గూర్చిన జ్ఞానము)  నీతియుపరిశుద్ధతయు విమోచనమాయెను. - (1 కోరింధి 1:31).


» 3)   ప్రవక్తయైన యెషయా క్రీస్తుని గూర్చి ముందుగా ప్రవచించిన ప్రవచనమేమనగా:


ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడునా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మనుఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయముకనుపరచును.   “అతడు కేకలు వేయడు అరువడు తనకంఠస్వరము వీధిలో వినబడనియ్యడు”. (యెషయా. 42:1-2).


పై వచనమును బట్టి సామెతలు 8వ అధ్యా., 2 నుండి 4 వచనములను బట్టి క్రీస్తు కేకలు వేయడు అరువడు తనకంఠస్వరము వీధిలో వినబడనియ్యడు కనుక సామెతలు 8వ అధ్యా., లో చెప్పబడిన జ్ఞానము అనే మాట క్రీస్తుకి సంబంధించినది కాదు.


» 4)   సామెతలు 8వ అధ్యా., 21 లోని చెప్పబడిన“నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును వారినిధులను నింపుదును” ఈ మాట క్రీస్తే చెప్పియున్నాడని  అని అనుకున్నచో  నీవు వాక్యమను అపార్ధము చేసుకున్నట్టే ఎందుకనగా ధనవంతుడుపరలోకరాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభము. (మత్తయి. 19:24; మార్కు. 10:25).


         భూమి మీద మీకొరకు ధనము కూర్చుకొనవద్దు. (మత్తయి. 6:19).


పై వచనమును బట్టి చూస్తే సామెతలు 8వ అధ్యా., 21 లో ధనమును గూర్చి చెప్పబడిన  ఆ మాటను క్రీస్తు చెప్పుటలేదు.


» 5)   అతడు తండ్రిలేనివాడును తల్లిలేనివాడునువంశావళిలేనివాడును, జీవితకాలమునకు ఆదియైననుజీవనమునకు అంతమైనను లేనివాడునైయుండిదేవుని కుమారుని పోలియున్నాడు. (హెబ్రీ. 7:3)

క్రీస్తు దేవుని సృష్టి కి ఆదియునైనవాడు. (ప్రకటన. 3:14)


పై వచనమును బట్టి క్రీస్తు వారు ఆదియు అంతము లేనివాడై , ఆదియందు దేవునియెద్ద ఉన్నవాడు కనుక సామెతలు 8వ అధ్యా., లోని 22వ వచనము సృష్టి జ్ఞానము గూర్చి చెప్పబడినది కాని క్రీస్తుని గూర్చి కాదు.


6)   ఆదియందు వాక్యముండెను, వాక్యముదేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. (యోహాను. 1:1). ఆ వాక్యము శరీరధారియై,కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను. (యోహాను. 1:14).


“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తనఅద్వితీయకుమారుడుగాపుట్టిన వానియందు విశ్వాసముంచుప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయననుఅనుగ్రహించెను”. (యోహాను. 3:16).


పై వచనమును బట్టి ఆదిలో తండ్రియెద్ద ఉన్న వాక్యము (logos) అద్వితీయకుమారుడుగా మనమధ్య పుట్టెను (మత్తయి. 2:1; లూకా. 2:11; యోహాను. 7:42) కనుక సామెతలు 8వ అధ్యా., లోని 23 నుండి 29 వచనములను బట్టి యెహోవా వారు సృష్టికి ముందే క్రీస్తుని పుట్టి౦చియున్నారని చెప్పడం దేవుని వాక్యమును వక్రీకరించడమే.


» 7)   తన జ్ఞానముచేత ఆయన ఆకాశమునుకలుగజేసెను ఆయన కృప నిరంతరముండును. (కీర్తన. 136:5). యెహోవా, నీ కార్యములు ఎన్నెన్నివిధములుగా నున్నవి జ్ఞానముచేత నీవు వాటన్నిటినినిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమినిండియున్నది.(కీర్తన. 104:24). మనకు ఒకేదేవుడున్నాడు. ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను ఆయన నిమిత్తముమనమున్నాము. (1 కోరింధి. 8:6)


పై వచనమును బట్టి యెహోవా తన జ్ఞానము చేత సృష్టినంతటిని కలుగజేసెను సామెతలు 8వ అధ్యా.,  30వ వచనములో చెప్పబడిన నేను (సృష్టి జ్ఞానము) యెహోవాయెద్ద ఉన్నది.


» 8)   లేఖనములయందు మీకు నిత్యజీవము కలదనితలంచుచు వాటిని పరిశోధించుచున్నారు; అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. (యోహాను. 5:39)


క్రీస్తే నిత్యజీవమై ఉన్నాడు కనుక క్రీస్తునందున్న మనము జీవమును ప్రత్యేకముగా కనుగొన్న అవసరము లేదు . (యోహాను. 8:12; 14:6)


పై వచనమును బట్టి సామెతలు 8వ అధ్యా., 35 వచనములోని చెప్పబడినట్టుగా “నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును” అను ఈ మాట క్రీస్తుని గూర్చి చెప్పబడుటలేదు


మీ ఆత్మీయ సహోదరుడు,
( మనోహర్ బాబు గుడివాడ )©

"యెహోవా వారు యేసులా వచ్చారా"..? Is Jehovah came as like Jesus

"యెహోవా వారు యేసులా వచ్చారా"..?


నా తోటి విశ్వాసులకు మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో నా యొక్క వందనములు.

యెహోవా తన భక్తుల ద్వారా యేసుని గూర్చి తెలియపరచుట :

1)      అబ్రహామునకు తెలియజేసిన మాటలు: (ఆది. 17:7; గలతీ. 3:16).

2)      దావీదునకు తెలియజేసిన మాటలు: (2 సమూయేలు. 7:12-19).

3)      యెషయాకు తెలియజేసిన మాటలు: (యెషయా. 7:14; 9:6-7).

4)      యిర్మియాకు తెలియజేసిన మాటలు: (యిర్మియా. 31:31-33).

5)      దానియేలుకు తెలియజేసిన మాటలు: (దానియేలు. 7:13-14).

6)      మీకాకు తెలియజేసిన మాటలు: (మీకా. 5:2).

7)      జెకర్యాకు తెలియజేసిన మాటలు: (జెకర్యా. 9:9).

8)      మలాకీకు తెలియజేసిన మాటలు: (మలాకీ. 3:1).


యెహోవాయే శరీరధారియై యేసులా వచ్చారన్నది ఒక కట్టుకథ

A)     ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవునియెద్ద ఉండెను. -(యోహాను. 1:1-2)

1)      పై వచనమును బట్టి వాక్యము ఎవరు ? – యేసు (యోహాను. 1:14a).
2)      ఆ వాక్యము ఎవరియొద్ద ఉండెను ? – యెహోవా (యోహాను. 1:14b).


B)      నేను తండ్రియెద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకు వెళ్లుచున్నానని వారితో చెప్పెను . –(యోహాను. 16:28).

1)      పై వచనమును బట్టి తండ్రి ఎవరు ? – యెహోవా (ఎఫేసి 1:19).
2)      తండ్రియొద్దకు వెళ్లుచున్నవారు  ఎవరు ? – యేసు (యోహాను. 17:5).


C)      ఆకాశము తెరువబడుటయు మనుష్య కుమారుడు దేవునికుడిపార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పెను. (అపో.కార్య. 7:56).

1)      పై వచనమును బట్టి దేవుడు ఎవరు ? – యెహోవా (1 కోరింధి. 8:6).
2)      దేవుని కుడిపార్శ్వమందు నిలిచియున్నది ఎవరు ? – యేసుక్రీస్తు (మార్కు. 16:19).


D)     నేను తండ్రిని వేడుకొందును, మీయెద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకనుగ్రహించెను. (యోహాను. 14:16).

1)      పై వచనమును బట్టి తండ్రి ఎవరు ? – యెహోవా (ఎఫేసీ. 4:6).
2)      తండ్రిని వేడుకొందునని చెప్పినది ఎవరు ? – యేసు (యోహాను. 17:1-2).


E)      తండ్రిని(Father)  కుమారుని(Son) ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. (1 యోహాను. 2:22).

1)      నా తండ్రి (మత్తయి. 10:32), మీ తండ్రి (మత్తయి. 23:9), మన తండ్రి (1 కోరింధి. 8:6).
2)      అద్వితీయ కుమారుడు. – (యోహాను. 3:16).


యెహోవా వారు యేసు కాదని అనుటకు సాక్ష్యము :

a)      యెహోవా సాక్ష్యము – (నిర్గమ. 33:20).

b)      యేసుక్రీస్తు సాక్ష్యము – (యోహాను. 1:18).

c)       పరిశుద్ధాత్ముని సాక్ష్యము – (1 తిమోతి. 6:16; 1 యోహాను. 4:12).

గమనిక : ఇద్దరి మనుష్యుల సాక్ష్యము సత్యమని గ్రంథము తేటగా తెలియపరుస్తుంది. – (యోహాను. 8:17).

(మనోహర్ బాబు గుడివాడ)©

క్రీస్తు సత్య ఆరాధనకు పాత్రుడా..? Is Christ deserving of true worship..?

"క్రీస్తు సత్య ఆరాధనకు పాత్రుడా".. ?

నా తోటి పరిశుద్దులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు.

పాత నిబంధనలో ప్రధానయాజకుడి పని

1)      యెహోవాకు చెందు సకల విషయములను కనిపెట్టుటకు, రాజుల సంగతుల విషయములలో  పై వాడుగా ఉన్నాడు. – (2 దిన. 19:11).

2)      పాపములకొరకు అర్పణములను, బలులను అర్పించుటకు దేవుని విషయమైన కార్యములు జరిగించుటకై మనుష్యుల నిమిత్తము నియమి౦పబడెను. – (హెబ్రీ. 5:1; హెబ్రీ. 8:3).

3)      అతడు ఏమియు తెలియనివారి యెడలను, త్రోవతప్పిన వారి యెడలను తాలిమి చూపగలవాడై యున్నాడు. – (హెబ్రీ. 5:2).

4)      ఈ ప్రధానయాజకుడు తనది కాని రక్తము తీసుకొని సంవత్సరమునకు ఒక్కసారే పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించి ప్రజల కొరకు , తన కొరకు పాపముల నిమిత్తము అర్పణము చేయువాడు. – (హెబ్రీ. 5:3; 9:25).

5)      అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడినవాడై ఈ ఘనత పొందువాడు. – (నిర్గమ. 28:1; హెబ్రీ. 5:4).

6)      ఇట్టి ప్రధానయాజకుడు దేవుని ఆరాధన చేయువాడు. – (హెబ్రీ. 9:7-9).

NOTE: ఇట్టి ప్రధానయాజకుడి యొక్క పని మన మనస్సాక్షి విషయములో ఆరాధకునికి సంపూర్ణసిద్ధి కలుగజేయలేదు మరియు శరీరాచారములు గనుక దిద్దుబాటు చేయుటకొరకు అట్టి ఆరాధన కొట్టివేయబడినది. (హెబ్రీ. 9:10; 10:1; 8:7,13)

క్రొత్త నిబంధనలో ప్రధానయాజకుడి పని


ఆకాశమండలముగుండ వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము. (హెబ్రీ. 4:14)

1)      యేసు ఆ జనములకొరకును , ఆ జనముకొరకు మాత్రమేగాక చెదరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును , చావనైయున్నాడు. – (మత్తయి. 1:21; యోహాను. 11:52; 1 పేతురు. 2:24)

2)      పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపములలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశమండలముకంటే మిక్కిలి హెచ్చయినవాడునైన యిట్టి ప్రధానయాజకుడు మనకు సరిపోయినవాడు. – (హెబ్రీ. 7:26)

3)      మన ప్రధానయజకుడైన క్రీస్తు , తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా, మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక , తన్నుతాను అర్పించుకొన్నప్పుడు  తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించి యీ పని చేసి ముగించెను. – (హెబ్రీ. 7:28; 9:11,12,26-28)

4)       క్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చువారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవిoచుచు, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొని మన మనస్సాక్షి విషయములో నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు క్రీస్తు యొక్క రక్తము మనలను శుద్ధిచేసి, మన అపరాధములనుండి విమోచన కలుగుటకై మరణము పొందినందున, పిలువబడినవారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్ధానము పొందుటకు, క్రీస్తు క్రొత్త నిబంధనకు మధ్యవర్తియై యున్నాడు   – (హెబ్రీ. 7:2; 9:14,15)

5)      క్రీస్తు సంపూర్ణసిద్ధి పొందినవాడై, మెల్కీసేదేకు యొక్క క్రమములో చేరిన ప్రధాయాజకుడని దేవునిచేత పిలువబడి, తనకు విధేయులైన వారికందరికిని నిత్య రక్షణకు కారకుడాయెను. – (హెబ్రీ. 5:9,10; 6:20 7:16,17,20).

6)      పరిశుద్ధ గ్రంధములో ఉన్న ప్రధానయాజకులందరు దేవుని ఆరాధించిన వారుగానే ఉన్నారు కానీ ఆరాధనకు పాత్రులుగా లేరు అలాగే మనకు దేవుని చేత యేర్పరచబడిన  ప్రధానయాజకుడైన క్రీస్తు తన జీవితములో మన తండ్రిని ఆరాధించారు మరియు సత్య ఆరాధన లేదా యదార్ధమైన ఆరాధనయందు వారికి ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధించాలని , అట్టి ఆరాధికులను తండ్రి వెదుకుచున్నాడని మన ప్రభువైన యేసు తెలియజేసెను. – (యోహాను. 4:21-24; లూకా. 2:41-42)

NOTE:  ఇట్టి ప్రధానయాజకుడి యొక్క పని మన మనస్సాక్షి విషయములో నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని (తండ్రిని) సత్య ఆరాధన చేయుటకు సంపూర్ణసిద్ధి కలుగజేసినది.


(హెబ్రీయులకు 8:1-2)

మేము వివరించుచున్న సంగతులలో సారాంశమేదనగా,మనకు అట్టి ప్రధానయాజకుడు ఒకడున్నాడు. ఆయనపరిశుద్ధాలయమునకు  అనగా మనుష్యుడుకాక ప్రభువేస్థాపించిన నిజమైన గుడారమునకుపరిచారకుడైయుండి, పరలోకమందుమహామహునిసింహాసనమునకు కుడిపార్శ్వమునఆసీనుడాయెను.

(మనోహర్ బాబు గుడివాడ)©

"ఆరాధన అనగా నేమి"..? CLICK HERE

“క్రైస్తవులకు యేసు ఏమైయున్నారు” (What was Jesus to Christians.?)

www.cockm.blogspot.in
క్రైస్తవులకు యేసు ఏమైయున్నారు”.?

తండ్రియైన దేవునినుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు సమాధానమును విశ్వాసముతో కూడిన ప్రేమయును సహోదరులకు కలుగును గాక.

(అపొకార్యములు. 10:36)
యేసుక్రీస్తు అందరికి ప్రభువు”."He is Lord of all"

దేవుని చేత ప్రభువుగా నియమింపబడిన యేసు

* మనము పాపమునుండి విమోచింపబడినీతివిషయమై జీవించునట్లుయేసు తానే తన శరీరమందు మనమందరి పాపములు విషయమై (రోమా. 6:181 పేతురు. 2:24యెషయా 53:4-512). మరణించిసమాధి చేయబడిమూడవ దినము తిరిగి లేచిన పిమ్మట (1 కొరింది. 15:3-4). తన వారుకి కనబడి నలభై దినములు వారికి బోధించిసజీవునిగా కనపరుచుకొని (అపొ.కార్య. 1:4). అటు పిమ్మటపరలోకమునకు ఆరోహణమయ్యి. (అపొ.కార్య. 1:9). మహా దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడెను. (అపొ.కార్య. 2:33).

* తండ్రి ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించి (హెబ్రీ. 1:2). పాపముల విషయములో శుద్ధీకరణము చేసిన తన కుమారుని ఆనందతైలముతో అభిషేకించెను. (హెబ్రీ. 1:39).

* అటు పిమ్మటదావీదు సింహాసనమును తన కుమారునికిచ్చిఆ కుమారునియందు విశ్వాసముంచు వారిని ఏలుబడి చేయుటకు "ప్రభువుగానుక్రీస్తుగాను" నియమించెను. - (లూకా. 1:32యోహాను. 3:36అపో.కార్య. 2:32-36).

మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు "ప్రభువుగాను" క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశ మంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను. - (అపొ. కార్య. 2:36).

యేసును ఏలాగునా ఒప్పుకోవాలి”..?

1). యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొనిదేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడలనీవు రక్షింపబడుదువు. (రోమీయులకు. 10:9).
2). పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను. (కొరింథీయులకు. 12:3). 
3). పరలోకముందున్నవారిలో గానిభూమిమీద ఉన్నవారిలో గానిభూమిక్రింద ఉన్నవారిలో గానిప్రతివాని మోకాలును యేసు నామమునవంగునట్లునుప్రతివాని నాలుకయు తండ్రియైన దేవుని మహిమార్ధమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లునుదేవుడు ఆయనను అధికముగా హెచ్చించిప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. (ఫిలిప్పీ. 2:9-11).



క్రైస్తవులకు ప్రభువు ఒక్కడే

1). మనకు ప్రభువు ఒక్కడేఆయన యేసుక్రీస్తు. - (1 కొరింథీ. 8:6).
2). ప్రభువు ఒక్కడే. - (ఎఫెసీ. 4:5).
3). పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని ప్రభువు ఒక్కడే. - (1 కొరింథీ. 12:5).
4). బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారునేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. - (యోహాను. 13:13).
5) "తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను. - (రోమీయులకు 14:9).


"హెచ్చరిక"

ప్రభువాప్రభువాఅని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయువాడే ప్రవేశించును - (మత్తయి. 7:21). 
నేను చెప్పు మాటలప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువాఅని నన్ను పిలుచుట ఎందుకు..? - (లూకా. 6:46)

మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు గుడివాడ©

“ప్రభువు ఒక్కడే” (ONE LORD)

“ప్రభువు ఒక్కడే”


* ప్రభువు అనగా అర్ధము “యజమానుడు, అధిపతి”.
* రాజు అనగా అర్ధము “దేశాన్ని పరిపాలన చేయువాడు లేదా అత్యున్నతమైన స్థానము కలిగిన వాడు”.


“ప్రభువు లేదా రాజు ఒక్కటేనా”..?



 LORD అనే పదము ఉన్న చోట పాత నిబంధనలో ప్రభువు, యెహోవా, దేవుడు.
 KING అనే పదము పాత నిబంధనలో భూరాజులుకు మరియు యెహోవాను ఉద్దేశించి వ్రాయబడింది.


● వారు ప్రభువా(LORD), దేవా, సర్వాధికారీ, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి; యుగములకు రాజా(KING), నీ మార్గములు న్యాయములును సత్యములునై యున్నవి. - (ప్రకటన. 15:3).
● యెహోవాయే(LORD) నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు, సదాకాలము ఆయనే రాజు(KING), ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. - (యిర్మియా 10:10).
● మహిమగల యీ రాజు(KING) ఎవడు? బలశౌర్యములుగల యెహోవా(LORD) యుద్ధశూరుడైన యెహోవా. మహిమగల యీ రాజు(KING) ఎవడు? సైన్యములకధిపతియగు యెహోవాయే(LORD). ఆయనే యీ మహిమగల రాజు(KING). - (కీర్తనలు 24:8;10).
● యోనాతాను అదోనీయాతో ఇట్లనెనునిజముగా మన యేలినవాడును రాజునగు దావీదు సొలొమోనును రాజుగా(KING) నియమించియున్నాడు. - (1 రాజులు 1:43).

"యెహోవా ప్రభువు"

1). ఇశ్రాయేలూ వినుము. మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. - (ద్వితియో. 6:4).
2). ఓ ఇశ్రాయేలూ వినుము
; మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. - (మార్కు. 12:29).
3). యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతలకంటె గొప్పవాడనియు నేనెరుగుదును. - (కీర్తనలు 135:5).
4). యేసు నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. - (ద్వితియో. 6:13; లూకా. 4:8; మత్తయి. 4:7).
5). “ఆలకించుడి ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా...” - (యెషయా 3:1).
6). శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు. - (1 తిమోతికి 6:15; ప్రకటన. 1:8; 4:8; 21:22).

పైన వచనములు అన్నియు మన దేవుడైన యెహోవాను గూర్చి చెప్పబడ్డాయి మరియు “ప్రభువు” అనే పదము బైబిల్లో పెద్ద అక్షరములతో రాయబడిన చోట అది “యెహోవాను గూర్చే” అని తెలుస్కో. 


NOTE: పాత నిబంధన కాలములో ఇశ్రాయేలు ప్రజలుకి “యెహోవా అద్వితీయుడునగు ప్రభువుగా” అనగా యజమానుడు, అధిపతిగా వ్యవహరించారు మరియు ఒక ప్రభువుగా ఆయన తన ఆలోచనలును తన చిత్తమును భూరాజులు ద్వారా తన ప్రజలును ఏలుబడి చేశారు.


::యేసుక్రీస్తు ప్రభువు::

1). ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను; మీరు వెదకుచున్న ప్రభువు, అనగా మీరు కోరు నిబంధన దూత, తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును; ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చు చున్నాడు. - (మలాకీ 3.1).
2). నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువునా ప్రభువుతో చెప్పెను అని దావీదు ఆయనను ప్రభువని ఆత్మవలన ఏల చెప్పు చున్నాడు
? - (మత్తయి 22:44; కీర్తన.110:1; మార్కు. 12:36; లూకా. 20:43; అపో.కార్య. 2:34-35).
3). మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు. - (1 కొరింథీ. 8:6; ఎఫెసీ. 4:5; 1 కొరింథీ. 12:5).
4). బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు; నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. - (యోహాను. 13:13).
5). యేసుక్రీస్తు అందరికి ప్రభువు. - (అపో.కార్య. 10:36).
6). యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని
, దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. - (రోమా. 10:9).

NOTE:
అద్వితీయుడునగు ఆ ప్రభువు “తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును మన
 పాపములు నిమిత్తము ఈ లోకమునకు పంపి, మన అపరాధముల విషయములో సిలువలో బలియాగము చేసి, మూడో దినమున తిరిగి లేపెను. మృత్యుంజయుడైన ఆ యేసును దేవుని రాజ్యమును (Church of Christ) ఏలుబడి చేయుటకు  యేసును ప్రభువుగాను నియమించెను”.
(యెషయా. 9:6; 53:3-10; మత్తయి. 1:21; 1 పేతురు. 2:24; రోమా; 6:6; 1 కొరింథీ. 15:3-4; 15:25-28; లూకా. 1:33; రోమా. 16:16; ప్రకటన. 5:10; 11:15; అపో.కార్య. 2:36).


(అపొ. కార్యములు. 2:36).
మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను.
(
1 కొరింథీయులకు. 12:3).
పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను.

మీ ఆత్మీయ సహోదరుడు, 
⃕మనోహర్.


"యేసుక్రీస్తు దేవుడు కాదా"..? (Is Jesus Christ God.?)

అంశము: "యేసుక్రీస్తు దేవుడు కాదా"..?

(1 తిమోతికి. 6:15-16).

శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలములయందు ఆ ప్రత్యక్షతను కనుపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై యున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వ ముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌. 

అద్వితీయుడు  అనగా సమానము లేని వాడు 
సర్వాధిపతి అనగా అన్నిటికి యజమానుడు లేదా సర్వశక్తిమంతుడు లేదా సమస్తమును చేయగల సమర్ధుడు
ఈ మహా విశ్వములో ఒక్కరికి మాత్రమే సర్వాధిపత్యము ఉంది. 

"సర్వాధిపతి ఎవరు"..?

★ ఆయనే మన అద్వితీయ సత్యదేవుడు - యెహోవా - (యోహాను. 17:3).
● మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. - (మార్కు. 12:29)
● అల్ఫాయు ఓమెగయు నేనే వర్తమాన భూత భవిష్యత్కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధి కారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. - (ప్రకటన. 1:8; యెషయా. 41:4). 
● సర్వాధి కారియైన దేవుడగు ప్రభువును గొఱ్ఱపిల్లయు దానికి దేవాలయమై యున్నారు. - (ప్రకటన. 21:22).
● మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. – (మార్కు. 12:29).
● “...భూతవర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని...” – (యెషయా  6:2-3; ప్రకటన. 4:8).

NOTE: పైన వచనములు అన్నియు మన దేవుడైన యెహోవాను గూర్చి చెప్పబడ్డాయి మరియు “ప్రభువు” అనే పదము బైబిల్లో పెద్ద అక్షరములతో రాయబడిన చోట అది “యెహోవాను గూర్చే” అని తెలుస్కో. 


:: సర్వాధిపతి చేత నియమింపబడినవారు ::

● దేవుని నిబంధన స్థిరపరుచుటకును మరియు ఓడ చేయుట విషయములో సర్వాధిపతి చేత నియమింపబడిన నోవాహు - (ఆది. 6 అధ్యాయము).
● దేవుని నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరుచుటకును మరియు అనేక జనములకు విశ్వాసకులుకు తండ్రి అగుట విషయములో సర్వాధిపతి చేత నియమింపబడిన అబ్రాహాము. - (ఆది.17:1-7).
● దేవుని ప్రజలను ఐగుప్తులోనుండి తోడుకొని పోవుటకు మరియు ఫరోకు దేవునిగా ఉండుట విషయములో సర్వాధిపతి చేత నియమింపబడిన మోషే. - (నిర్గమ. 3:11; 7:1).
● దేవుని ప్రజలును ఏలుబడి చేయుట విషయములో సర్వాధిపతి చేత నియమింపబడిన ఇశ్రాయేలు రాజులు “సౌల్, దావీదు, సొలొమోను”. - (1సమూయేలు. 9:16-17; 16:12-13; 1రాజులు 1: 43-46; 2:2-4).
● యుగయుగములు దేవుని ప్రజులకి ప్రభువుగా ఉంటూ ఏలుబడి చేయుటకు(బౌతికమైన రాజ్యము కాదు), తన ప్రజలను వారి పాపములు నుండి రక్షించుటకును, జగత్తు పునాది వేయబడక మునుపే సర్వాధిపతి చేత నియమింపబడిన ఆయన యెద్ద ఉండే “వాక్యము” అనగా శరీరధారియై మన మధ్యకు అద్వితీయకుమారునిగా పుట్టిన “యేసుక్రీస్తు”. - (2 సమూయేలు. 7:12-16; యిర్మీయా. 23:5; లూకా. 1:32; మత్తయి. 1:21; ఎఫెసీ. 1:6; 1 పేతురు. 1:19-20; యోహాను. 1:1-2; 14; 3:16; 17:24).
ఆ సర్వాధి కారియైన దేవుడు ఎవరును ఏ విధముగా నియమింస్తారో అది వారుకి సొంతము అవుతాది.


"యేసుక్రీస్తు దేవత్వము కలిగినవాడా"..?

దేవత్వము అనగా “దేవుని యొక్క గుణలక్షణములు”.
A). ఆదిలో యేసుక్రీస్తు దేవత్వము కలిగినవాడే అనగా దేవుని వలె నిత్యత్వములో ఉన్నవాడు మరియు దేవత్వము కలిగినవాడు. 
* దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది. - (కొలస్స. 2:9).
* ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. ఆయన ఆది యందు దేవునియొద్ద ఉండెను. - (యోహాను. 1:1-2).
ఆదియందు అనగా “మొట్టమొదట
వాక్యము అనగా “యేసుక్రీస్తు
దేవుడై యుండెను అనగా “దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత కలిగినవాడు” అని అర్ధము.

B). యేసుక్రీస్తు వారుకి ఆశ్చర్యకరుడు, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. - (యెషయా. 9:6).
ఇవి ఆయనకు ఉపయోగించే బిరుదులు. ప్రతీ పేరుకు అర్థం ఉంటుంది అని మొదట మనము గమనించాలి. నిత్యుడగు తండ్రి అనేది నిత్యత్వపు తండ్రి అని బాషాంతరము.
ఆయన నరమాత్రుడు కాదు, దైవికమైన వ్యక్తి అని తెలియజెప్పుట (యెషయా. 9:1-7) వచనములు ఉద్దేశ్యమే కానీ.. ఆయన మనకి తండ్రిగా నిరూపించుటకు కాదు. పుట్టబోయే వాడు, ఏలుబడి చేయువాడు నరమాత్రుడు కాదు. (యిర్మీయా. 23:5) “దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత” గలవాడే. (కొలస్స. 2:9). “యేసుక్రీస్తు అందరికి ప్రభువు” (అపో.కార్య. 10:36). అని పరిశుద్దాత్ముడు తెలియపరచు సందేశమై ఉంది.

C). యేసుక్రీస్తు సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. - (రోమీ. 9:5).
దేవత్వము విషయములో “సర్వాధికారియైన దేవుడు” అనే బిరుదు పొందినవాడు. 

NOTE: "నేను యేసుక్రీస్తు దేవత్వమును గూర్చి తప్పు పట్టడము లేదు". 

D). అద్వితీయుడునగు సర్వాధిపతి యేసుక్రీస్తును "దేవా" అని సంభోదిచారు. (హెబ్రీ. 1:8). కానీ “నా దేవా” అని సంభోదిచలేదు.

E). మన అద్వితీయుడునగు సర్వాధిపతి తనతో దేవత్వాని, నిత్యత్వాని, మహిమను అనుభవించు యేసుక్రీస్తును మనకి దేవుడుగా నియమించలేదు. 
EX: ఫరోకు దేవునిగా ఉండుట విషయములో సర్వాధిపతి చేత నియమింపబడిన మోషే. – (నిర్గమ. 7:1). మోషే  ఇశ్రాయేలు ప్రజులుకి దేవుడుగా నియమింపబడలేదు.

NOTE:-  యేసు లో “దేవుని యొక్క గుణలక్షణములు” పరిపూర్ణముగా ఉన్నప్పటికీ ఆయనను మనకి దేవుడుగా నియమించక “ప్రభువుగాను” "క్రీస్తుగాను" నియమించెను.
(అపొ. కార్యములు 2 :36)
మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను.

హెచ్చరిక 

* "యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని", దేవుడు మృతులలోనుండి ఆయ నను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. - (రోమీ. 10:9).
* "తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి మరల బ్రదికెను. - (రోమీయులకు 14:9).

* పరిశుద్ధ గ్రంథం తెలియ జేసిన సమాచార ప్రకారం జీవిస్తావో లేక మీ సొంత ఉద్థేశ్యాల ప్రకారం జీవిస్తావో మీ ఇష్టం మిత్రులారా!!

మీ ఆత్మీయ సహోదరుడు,
Bro. మనోహర్ నవీన ©

"దేవుడు ఒక్కడే" (ONE GOD)

అంశము: దేవుడు ఒక్కడే

తండ్రియైన దేవునినుండియు మన రక్షకుడైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక.

(1 కొరింథీయులకు 8:6)
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.


● దేవుడొక్కడే - (1 తిమోతి. 2:5).
● యెహోవా ఒక్కడే - (జెకర్యా 14:9).
● మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా - (ద్వితియో. 6:4).
● యెహోవాయే మన దేవుడు - (యెహోషువ. 24:17; కీర్తనలు 118:27; యెషయా. 45:18).

 మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా? - (మలాకీ. 2:10).
● లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. - (1 కోరింథీ. 8:4).
● ఒక్కడే మీ తండ్రి. - (మత్తయి. 23:9).
 
అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. - (1 కోరింథీ. 12:6).
 
అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు. (ఎఫెసీ. 4:6).● అద్వితీయ సత్యదేవుడు ఒక్కడే. - (యోహాను. 17:3).



"దేవుడొక్కడే అనుటకు సాక్ష్యము"

A). "పరిశుద్ధాత్మడు సాక్ష్యము"

యేసుక్రీస్తు వారుకి దేవుడున్నాడని  పరిశుద్ధాత్మడు యొక్క సాక్ష్యము.


◆ “మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి...” - (ఎఫెసీ. 1:19).


B). "యేసుక్రీస్తు సాక్ష్యము"

యేసుక్రీస్తు వారుకి దేవుడున్నాడని  యేసుక్రీస్తు యొక్క సాక్ష్యము.

◆ నా దేవా నా దేవా”, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు? - (కీర్తనలు. 22:1)
◆ ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ” అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు “నా దేవా, నా దేవా” నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. - (మత్తయి. 27:46).
◆ మూడు గంటలకు యేసు “ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ” అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు “నా దేవా, నా దేవా,” నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము. - (మార్కు. 15:34).
◆ యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా “తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన” వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను. - (యోహాను. 20:17).


C). "తండ్రి సాక్ష్యము

యేసుక్రీస్తు వారుకి నేనే దేవుడని తండ్రి యొక్క సాక్ష్యము.

◆ నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున “దేవుడు నీ దేవుడే” చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించి యున్నాడు. - (కీర్తనలు.  45:7)
నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత “దేవుడు  నీ దేవుడు” నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను. - (హెబ్రీయులకు. 1: 9)


D). "దెయ్యములు సాక్ష్యము"

◆ దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగునమ్ముట మంచిదే; “దయ్యములును నమ్మి వణకుచున్నవి”. (యాకోబు. 2:19).


గమనిక :- “ఇద్దరు మనుష్యులు సాక్ష్యము సత్యమని” గ్రంథము తేటగా తెలియపరుస్తుంది. - (యోహాను. 8:17).


హెచ్చరిక 
* యేసుక్రీస్తుకి ఎవరైతే దేవుడో.. ఆయనే నాకు దేవుడు.
* నీకు అనేకమంది దేవుళ్ళు ఉండవచ్చు కానీ నాకు దేవుడు ఒక్కడే ఆయనే మనకు తండ్రి.


మీ ఆత్మీయ సహోదరుడు,
Bro. మనోహర్ నవీన©
The churches of Christ greet you - Roma 16:16