"రెవరెండ్"(Reverend)

💌

 అంశము: "రెవరెండ్"(Reverend)


సహోదరులకందరికిని మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

నా ప్రియులారా, సత్య వాక్యమును సరిగా విభజన చేస్తూ మీకు రాస్తున్న ప్రతి అంశమును మీరు చదివి, వాక్య పరిశీలన చేసి, ఆలోచన చేసి అంగీకరిస్తున్న దానిని బట్టి నేను మిమ్మునుబట్టి యెల్లప్పుడును మన దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయుచున్నాను.

నేడు కొందరు బోధకులు లేదా విశ్వాసుకులు జీవితములో వారు యొక్క పేరుకి ముందు "రెవరెండ్" అనే పదము పెట్టుకొని అనేక మంది చేత పిలువబడటము చూస్తున్నాము.

ఉదా:  రెవరెండ్ ఎడ్వర్డ్, రెవ. జాన్, Rev. Manohar.... etc

 ◆ వాస్తవానికి ఇది ఎంత వరకు సత్యము..? అనేది మనము నేడు పరిశుద్ధ గ్రంధమును మాత్రమే ఆధారము చేసుకొని ఆలోచన చేద్దాము.


 ◆ "రెవరెండ్" అనగా అర్ధము ఏమిటి..? ◆

❣ హీబ్రూ లో wə·nō·w·rā ( וְנוֹרָֽא).
❣ ఇంగ్లీష్ లో Terrible, Feared, Reverend, Reverence.
◆ గమనిక :- (హీబ్రూ పదము ఆధారము చేసుకొని ఇంగ్లీష్ బైబిల్లో పదాలను రాయడము జరిగింది)
❣ తెలుగులో భయంకరుడు, పూజ్యుడు, పూజింపదగినవాడు.

1) ఆయన "భయంకరుడైన" మహా దేవుడు - (ద్వితీయో 7:21; కీర్తన 89:7).
2) సమస్త దేవతలకంటె ఆయన "పూజ్యుడు". - (1 దిన 16:25).
● Holy and Reverend (పూజింపదగినది)   is his name. ●

ఆయన నామము పరిశుద్ధమైనది "పూజింపదగినది"(Reverend) -- (కీర్తన 111:9).


◆ క్రైస్తవుడు, "రెవరెండ్" అని పిలువబడవచ్చా..?. ◆

 సమాధానము: పిలువబడకూడదు

పైన వాక్యములును పరిశీలన చేశాక, రెవరెండ్ అనే పదమును తండ్రియైన దేవునికి మాత్రమే ఉపయోగించాలి అనే విశేషమైన సంగతిని మనము బాగుగా తెలుసుకోవాలి.

1) "రెవెరెండ్" అనే ఇంగ్లీష్ పదమునుకు అర్ధము " పూజింపదగినది" - (కీర్తన 111:9).
2) పూజింపదగినది ఏమిటి..? ఆయన (తండ్రి) నామము.
3) ఇంత గొప్ప నామము మరియు పరిశుద్ధ నామమును చెందవలసిన దేవునితో పాటు మనమేమో మన తోటి వారుని పిలువడము చేస్తున్నాము. ఇది ఎంత వరకు న్యాయము? అనేది మీరే వాక్య పరీక్ష చేసుకోండి.


● "యెహోవాను నేనే; ఇదే నా నామము" మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనియ్యను. - (యెషయా 48:8).A). ఆదిమ సంఘములో ఏ బోధకుడైనా లేదా దేవుని సేవకుడైనా రెవరెండ్ అని పిలువబడ్డారా..? "లేదు అని చెప్పాలి".
B). మరి నేడు ఒక బోధకుడు అనేక మంది చేత రెవరెండ్ గా పిలువబడుతున్నారంటే ఏమి అనుకోవాలి..? అది మీ ఆలోచనలకు అప్పగిస్తున్న... (2 కోరింది 4:4; 2 తిమోతి 4:3-4).

హెచ్చరిక 
 "రెవరెండ్" అనే నామము లోకములో ఏ వ్యక్తికి  పెట్టతగినది కాదు. ఇలా పిలువబడుతున్న దొంగ సేవకులు విషయములో బహు జాగ్రత్త కలిగి ఉండుము. 💌KM

కాబట్టి  సత్య అన్వేషకులారా... ఇకనైనా ఆలస్యము చేయక సత్యము ఏంటో, అసత్యము ఏంటో గ్రంధము నుండే పరిశీలన చేసి సత్యమునుకు లోబడండి. వందనములు.

Share this

Related Posts

Previous
Next Post »

1 comments:

comments
July 19, 2020 at 11:49 PM delete

Plz provide these topics in pdf to easily studying

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16