"బాప్తీస్మము ఎలా తీసుకోవాలి"..? How can we baptized


💌 అంశము : "బాప్తీస్మము ఎలా తీసుకోవాలి"..?

ప్రియమైన నా సహోదరీ,సహోదరులారా!!
మీకందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు తెలియజేయుచున్నాను.

రక్షణ పొందుటకు నమూనా


❣ ముందుగా - క్రీస్తును గూర్చిన మాటలు (వాక్యము) "వినాలి". - (యోహాను. 5:24; అపో.కార్య. 8:5-6; రోమా 10:17; ప్రకటన. 1:3).
❣ వినిన వాక్యమునందు(మాట) "విశ్వాసముంచాలి". - (యోహాను. 8:24; అపో.కార్య. 16:31;  రోమా. 10:17; హెబ్రీ. 11:6).
❣ పాపక్షమాపణ నిమిత్తమై "మారుమనస్సు" పొందాలి. - (లూకా. 13:3; అపొ.కా. 2:38; 17:30).
❣ యేసుక్రీస్తు దేవునికుమారుడని, ప్రభువని "ఒప్పుకోవాలి" - (మత్తయి. 10:32-33; యోహాను. 20:31; రోమా. 10:10).
❣ రక్షింపబడుటకు "బాప్తీస్మము" పొందాలి. - (మార్కు. 16:16; అపో.కార్య. 2:38; 22:16; 1 పేతురు. 3:21).
❣ ప్రభువు చేత "క్రీస్తు సంఘముగా చేర్చబడాలి". - (అపో.కార్య. 2:47).



A). క్రీస్తులోనికి బాప్తీస్మము వాక్యానుసారముగా తీసుకోవాలనుకొనేవారు - యేసుక్రీస్తును ప్రభువని ఒప్పుకోవాలి.

రోమీయులకు 10:9
అదేమనగాయేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయ మందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. 

1పేతురు 3:15
నిర్మలమైన మనస్సాక్షి కలిగినవారై, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతివానికిని సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడు సిద్ధముగా ఉండి,మీ "హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి"; 


B). క్రీస్తులోనికి బాప్తీస్మము వాక్యానుసారము తీసుకోవాలనుకొనేవారు- యేసుక్రీస్తును దేవుని కుమారుడని ఒప్పుకోవాలి.

యోహాను సువార్త 20:31
యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను.

అపొస్తలుల కార్యములు 8:37 
ఫిలిప్పు-నీవు పూర్ణహృదయముతో విశ్వసించిన యెడల పొందవచ్చునని చెప్పెను.అతడు-"యేసు క్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని యుత్తరమిచ్చెను".


C). ఒకనిని నీటితో(నీటిలో) పాతిపెట్టుటకు అవసరమైన నీళ్ళు ఉండాలి.

యోహాను సువార్త 1:28
యోహాను బాప్తిస్మమిచ్చుచున్న "యొర్దానునదికి" ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగెను. 

యోహాను సువార్త 3:23
సలీము దగ్గర నున్న ఐనోనను స్థలమున "నీళ్లు విస్తారముగా" ఉండెను గనుక యోహాను కూడ అక్కడ బాప్తిస్మమిచ్చుచు ఉండెను; జనులు వచ్చి బాప్తిస్మముపొందిరి. 

నీరు సమృద్ధిగా ఉన్నచోట యోహాను బాప్తీస్మమమిచ్చినట్లుగా చూస్తున్నాము.



D). బాప్తీస్మము తీసుకునేవారు అలాగే ఇచ్చేవారు కూడా ఇద్దరు *నీటిలోనికి* దిగాలి.

మత్తయి సువార్త 3:16
యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తనమీదికి వచ్చుట చూచెను. 

అపొస్తలుల కార్యములు 8:37,38
ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మ మిచ్చెను. 


E). తండ్రి(యెహోవా),కుమారుని (యేసుక్రీస్తు), పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తీస్మము ఇవ్వాలి.

మత్తయి సువార్త 28:19
కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు


F). ఈ లోకంలో ఒక మనిషిని ఏవిధంగానైతే మట్టిలో పాతిపెడతారో అదే విధంగా బాప్తీస్మము పొందాలనుకునే వారిని నీటిలో(నీటితో) పాతిపెట్టబడి తిరిగి లేపబడాలి.

రోమీయులకు 6:4
కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము "బాప్తిస్మము వలన" మరణములో పాలు పొందుటకై "ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి".
కొలొస్సయులకు 2:12
మీరు "బాప్తిస్మమందు" ఆయనతో కూడ "పాతిపెట్టబడినవారై" ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుట ద్వారా "ఆయనతో కూడ లేచితిరి".


G). బాప్తిస్మము పొందుగోరువారు మునుపు క్రీస్తు మరణము "లోనికి" పాలు పొంది, క్రీస్తు సంఘముగా చేర్చబడిన వారు చేతనే నీటిలో సమాధి చేయబడాలి. 

అపో.కార్యములు 2: 41
కాబట్టి అతని వాక్యము అంగీకరించినవారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు మూడువేల మంది చేర్చబడిరి.

అపో.కార్యములు 18: 8
ఆ సమాజమందిరపు అధికారియైన క్రిస్పు తన యింటివారందరితోకూడ ప్రభువునందు విశ్వాసముంచెను. మరియు కొరింథీయులలో అనేకులువిని విశ్వసించి బాప్తిస్మము పొందిరి.

అపో.కార్యములు 19: 4-5
అందుకు పౌలుయోహాను తన వెనుక వచ్చువానియందు, అనగా యేసునందు విశ్వాస ముంచవలెనని ప్రజలతో చెప్పుచు, మారు మనస్సు విషయమైన బాప్తిస్మమిచ్చెనని చెప్పెను.
వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి.

◆ గమనిక ◆ 


1) చనిపోయిన వారిని నిలువబెట్టి పాతిపెట్టరు.

2) చనిపోయినవారిని కూర్చోబెట్టి పాతిబెట్టరు.

3) చనిపోయినవారిని బోర్ల పడుకోబెట్టి పాతిపెట్టరు.

4) చనిపోయిన వారిని పొడినేలమీద ఉంచి గుప్పెడు మట్టి చల్లి దీనిని పాతిపెట్టేసినట్టే అని అనరు.

★ "చనిపోయినవారిని వెనుకాతలా పడుకోబెట్టి దేహము కనబడకుండా మట్టితో పాతిపెడతారు".

అలాగే పాపముల నిమిత్తం ఈ లోకంలో చనిపోయి ఆత్మసంబంధముగా జీవించాలని నీటి ద్వారా బాప్తీస్మము పొందాలనుకునేవారు కూడా నీటిలో వెనకాతలా పడుకోబెట్టి దేహము కనబడకుండా నీటితో(నీటిలో)పాతిపెట్టబడి తిరిగి లేపబడాలి.

* బాప్తీస్మము ఒక్కటే అని (ఎఫెసీ 4:5) లో గ్రంథము తెలిజేస్తుంది *

వాక్యానుసారము తీసుకుంటే అది మన జీవితానికి ఒక్కసారే.

వాక్యము చెప్పినట్టు కాకుండా మీరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా తీసుకున్నా అది మీ దృష్టిలో బాప్తీస్మము అవుతుందేమో కాని దేవుని దృష్టిలో అది బాప్తీస్మము కాదని గమనించాలి.

◆ హెచ్చరిక ◆


» మీరు పొందిన బాప్తీస్మము వాక్యానుసారముగా తెలియజేసినట్టు పాతిపెట్టబడ్డారా..??

ఇది ఆత్మసంబంధమైనది గనుక బాప్తీస్మము తీసుకునే విషయములో అజాగ్రత్తగా ఉండకండి.

Share this

Related Posts

Previous
Next Post »

14 comments

comments
Anonymous
Apr 26, 2017, 11:32:00 AM delete

Good post Brother

Reply
avatar
Apr 26, 2017, 11:32:00 AM delete

wnderful message very good explanation and naku "gamanika" lo rasinavi chala baga nachayi keep it up km garu all the best thanku for this message

Reply
avatar
Anonymous
Apr 26, 2017, 11:36:00 AM delete

Wonderful Brother KM vandhanalu

Reply
avatar
Anonymous
Apr 26, 2017, 11:37:00 AM delete

Anna nevu super :D praise the Lord

Reply
avatar
Anonymous
Apr 26, 2017, 11:41:00 AM delete

Annaya next topic Neti? Sister priya. Vandhanalu annaya

Reply
avatar
Anonymous
Apr 26, 2017, 1:04:00 PM delete

Miru ichina explanation chala baguntadi brother. Thank you

Bro. Chinna vandanamulu

Reply
avatar
Anonymous
Apr 26, 2017, 11:30:00 PM delete

బ్రదర్ km గారు బాప్తిస్మము ఏ నామములో తీసుకోవాలి అనే అంశము కూడా పెడితే అనేక మందికి సహాయము చేసే వారు అవుతారు.

కొందఱు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామము అంటారు. మరి కొందరు యేసు నామము మాత్రమే అని అంటున్నారు. ఇలాంటి విభజన చెందిన బోధకు మీరు మాత్రమే సత్యము ఏంటో తెలియజేయగలరు అని మిమ్మలి అడుగుచున్నా...

వందనములు బ్రదర్ km
బ్రదర్ అనిల్ కుమార్ (HYD)

Reply
avatar
Apr 26, 2017, 11:32:00 PM delete

థాంక్స్ వందనములు

Reply
avatar
Apr 26, 2017, 11:35:00 PM delete

వందనములు సిస్టర్ ప్రియా గారు... పైన సైట్ లో నా తదుపరి అంశము అని వస్తది అది ఘమనిచగలరు. :)

Reply
avatar
Apr 26, 2017, 11:36:00 PM delete

వందనములు బ్రదర్ చిన్నా

Reply
avatar
Apr 26, 2017, 11:39:00 PM delete

వందనములు బ్రదర్ అనిల్
చాల రోజులకి ఇలా నిన్ను కలిశాను. నీవు దేవుని మహా కృపను బట్టి బాగున్నావు అని నమ్ముతున్నా.... సరే బ్రదర్ "ఏ నామములో బాప్తిస్మాము తీసుకోవాలో క్లుప్తముగా రాసి ఇస్తాను" అవును, అనేక మందికి ఏ నామములో తీసుకోవాలో, ఏ నామములో ఇవ్వాలో తెలియక పొరపాటు పడుచున్నారు. అది నేను వివరంగా రాసి పోస్ట్ పెడతా...

వందనములు బ్రదర్... :)

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16