"నిజమైన బాప్తీస్మము vs తప్పుడు బాప్తీస్మము" True Baptism vs False Baptism

"నిజమైన బాప్తీస్మము"
vs 
"తప్పుడు బాప్తీస్మము"


సహోదరులకందరికిని మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.


నిజమైన బాప్తీస్మము


● "బాప్తీస్మమిచ్చు వ్యక్తి విశ్వసించిన వ్యక్తిని నీటిలో పూర్తిగా సమాధి చేయాలి". - (మత్తయి. 3:16; అపో.కార్య. 8:38-39).

● "నమ్మి + బాప్తీస్మము = రక్షణ" - (మార్కు. 16:16).

● క్రీస్తు సువార్త ద్వారానే మనము పిలువబడి నమ్మి బాప్తీస్మము పొందవలెను. - (మార్కు. 16:16; అపో.కార్య. 18:12-13; 2 థెస్స. 2: 14).

● "బాప్తీస్మము యిచ్చువారు" "తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి" బాప్తీస్మము యివ్వవలెను. - (మత్తయి. 28:18-20).

* (ముగ్గురు వేరు వేరు వ్యక్తులు అని నమ్మవలెను). - (మత్తయి. 3:16-17; యోహాను. 15:26).

● "బాప్తీస్మము పొందువారు" యేసుక్రీస్తు నామమున అనగా ఆయన అధికారమున మరియు ఆయన ఆజ్ఞ చొప్పున  పొందుచున్నాని గ్రహించవలెను. - (అపో.కార్య. 2:38).

* (తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను నమ్మవలెను) *

●  "ఒక్కటే శరీరమైన క్రీస్తు సంఘము లోకి క్రీస్తు చేత చేర్చబడెదరు" - (ఎఫెసీ. 1:23; 4:4-6; కొలస్స. 1:18; 1 కొరింథీ. 12:13; అపొ.కార్య. 2:47; రోమా. 16:16). తప్పుడు బాప్తీస్మము


● చిలకరింపు, కుమ్మరింపు, జెండా, విశ్వసించిన వాడు తనకి తానుగా నీటిలో దిగి రావడము....etc ఇవి వాక్యానుసారమైన బాప్తీస్మము కాదు.

● "నమ్మి + రక్షణ = బాప్తీస్మము" - వాక్యము లేదు.

● దేవుడు కనబడి స్వరము, దర్శనములోని చెపితేనే బాప్తీస్మము తీసుకునే కార్యక్రమము తప్పుడు బాప్తీస్మము.

● నేటి మత శాఖలలో "బాప్తీస్మము యిచ్చువారు" "తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి"(మత్తయి. 28:18-20).
ఈ యేసుక్రీస్తు ఆజ్ఞను కొట్టివేసి, క్రీస్తు బోధ యందు లక్ష్యము ఉంచక, ముగ్గురు వేరు వేరు అని నమ్మటము లేదు.

● ఇక్కడ మత శాఖలతో "బాప్తీస్మము పొందువారు" వారి కల్పనా బోధలకు చెవి యొగ్గి, యేసుక్రీస్తు నామమునే పొందాలి (అపో.కార్య. 2:38) అని నమ్మి పొందినది తప్పుడు బాప్తీస్మము. 

(తండ్రి లేడు, కుమారుడు లేడు, ఆత్మ లేడు. అంతా యేసుక్రీస్తు నామమే అనేవారి బోధ సరియైనదికాదు).

●  క్రీస్తు బోధను, ఆయన శరీరమును విభజన చేసి వారు ఏర్పాటు చేసుకొనిన శాఖలలోనికి  వారి చేత చేర్చబడెదరు.


హెచ్చరిక ★ 


నా ఆత్మీయ సహోదరులారా, ఈ దినమే మీరు ఏ బోధ చేత, ఏ విధముగా బాప్తీస్మము పొందియున్నారో మీకు మీరు  వ్యక్తిగతముగా పరీక్ష చేసుకోమని మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో మిమ్మలి కోరుతున్నా.. 

మీ ఆత్మీయ సహోదరుడు, 
మనోహర్ (KM).

Share this

Related Posts

Previous
Next Post »

5 comments

comments
Anonymous
April 28, 2017 at 4:46 PM delete

Good post Brother KM

Reply
avatar
Anonymous
April 28, 2017 at 7:01 PM delete

అన్నా మీకు Facebook or whats app ఉందా.? మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నా.. నా పేరు సురేష్. రంగారెడ్డి జిల్లా.. వందనములు అన్నా...

Reply
avatar
Anil
June 15, 2017 at 10:26 PM delete

Thanks anna vandanamulu

Reply
avatar
David
June 15, 2017 at 10:27 PM delete

Praise The Lord Bro. manohar
Good post

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16