సూర్యుని క్రింద నూతనము🌞 vs దేవుని కృపలో నూతనము📖



మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿 


ఒక సంవత్సరం ముగిసింది.

మరొక సంవత్సరం ప్రారంభమైంది.

ప్రపంచం అంతటా ఒకే మాట వినిపిస్తుంది —

“హ్యాపీ న్యూ ఇయర్… కొత్త ఆరంభం… కొత్త జీవితం, క్రొత్త సంవత్సరం …”


ప్రపంచం “నూతనము” అని పిలిచేదాన్ని దేవుని వాక్యం అంగీకరిస్తుందా? క్యాలెండర్ మారితే, సంవత్సరం మారితే, ఆలోచనలు మారితే, నిర్ణయాలు మారితే — నిజంగా మనిషికి నూతనత్వం వస్తుందా?, — ఇవి నిజంగా మనిషిని నూతనుడిగా చేస్తున్నాయా? కాలం మారితే జీవితం మారుతుందన్న భావన మనుష్యులలో బలంగా ఉంది. దేవుడు మానవ చరిత్ర మొత్తాన్ని పరిశీలించి ఇచ్చిన తీర్పు ఇది : “సూర్యుని క్రింద నూతనమైనది ఏదైనా ఉందా? లేదు” (ప్రసంగి 1:9). కాలం మారుతుంది గాని మనిషిలో నూతన హృదయ మార్పు లేదు; పరిస్థితులు మారుతాయి గాని దైవ(నూతన) స్వభావంలో పాలివాడు కావడం లేదు. 

అయితే దేవుడు దినాలను, నెలలను, సంవత్సరాలను ఎందుకు ఇస్తున్నారు? ఆకాశంలోని జ్యోతులు, కాలములను సూచించుటకై సృష్టించబడ్డాయి (ఆది 1:14).   ఈ కాలముల మార్పు సంవత్సరాలను ఇవ్వడానికి మాత్రమే కాదు; ప్రతి మనుష్యుడు మారుమనస్సు పొందుటకు ఇవ్వబడే కృపాకాలం. అందుకే బైబిల్ ఒక వైపు “సూర్యుని క్రింద నూతనము లేదు”(ప్రసంగి. 1:9) అని ప్రకటిస్తూనే, మరో వైపు “దేవుని కృపలు ప్రతి ఉదయము నూతనములు” (విలాపవాక్యములు 3:22–23) అని చెబుతుంది.

ఈ అంశంలో, సూర్యుని క్రింద నూతనము అనే లోకపు బాహ్య మార్పు ఏమిటో, దేవుని కృపలో నూతనము అనే ఆత్మీయ అంతర్గత మార్పు ఏమిటో  పరిశుద్ధ గ్రంథమును దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా పరిశీలన చేద్దాం.


1️⃣. సూర్యుని క్రింద నూతనము?

సూర్యుని క్రింద అనగా పతనమైన లోకవ్యవస్థ, దేవుని అధికారానికి వెలుపల జీవితం, శరీర సంబంధమైన స్వభావం, కాలానికి మరియు మరణానికి లోబడిన స్థితి, భూ సంబంధమైన మనస్సు, దేవుని నీతి మీద తిరుగుబాటు గలిగిన జీవితం.

ఆదాము పాపం చేసిన వెంటనే ఈ స్థితి మొదలైంది (ఆది.కాం. 3వ అధ్యాయం). "నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.౹" (ఆది 3:19)


అప్పటి నుండి…

— జననం

— గమనం

— మరణం

ఈ చక్రం మారలేదు.


"మునుపు ఉండినదే ఇక ఉండబోవు నది;మునుపు జరిగినదే ఇక జరుగబోవునది; సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు.” (ప్రసంగి 1:9)

👉 రాజ్యాలు మారాయి

👉 పాలకులు మారారు

👉 నాగరికతలు మారాయి


అందుకే

❌ నూతన సంవత్సరం = నూతన జీవితం కాదు

❌ కాల మార్పు = ఆత్మీయ మార్పు కాదు

✅ సూర్యుని క్రింద నూతనత్వం అసాధ్యం.


2️⃣. కాలం మారుతుంది – కానీ మనిషి ఎందుకు మారడు?

సంవత్సరం మారినా…

👉 లోభం అలాగే ఉంది

👉 అహంకారం అలాగే ఉంది

👉 కోపం ఉంది

👉 మారుమనస్సు లేదు

👉 పాపపు ఆకాంక్షలు అలాగే ఉన్నాయి


📖 బైబిల్ స్పష్టంగా చెబుతుంది:

“మనుష్యుల హృదయముల ఆలోచనలు అంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డవే.” (ఆది.కాం. 6:5)

“హృదయం అన్నిటికంటే మోసపూరితమైనది.” (యిర్మియా 17:9)

“అందరూ పాపము చేసిరి.” (రోమా 3:23)


కాలం మారడం అనేది…

👉 క్యాలెండర్ మార్పు 

👉 హృదయ మార్పు కాదు


3️⃣. దేవుడు కాలాన్ని ఎందుకు ఇచ్చాడు?

"–కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకొని యున్నాడు; వాటిని తెలిసికొనుట మీ పనికాదు.౹" (అపో.కార్య. 1:7)

"ఆయన కాలములను సమయములను మార్చువాడైయుండి,..." (దానియేలు. 2:21)


దేవుడు కాలాన్ని…,

❌ వినోదానికి

❌ నిర్లక్ష్యానికి

❌ పాపముతో స్వేచ్ఛగా జీవించడానికి ఇవ్వలేదు.

❌ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకోవడానికి

❌ కేకులు కట్ చేయడానికి

❌ సంతోషముతో గంతులు వేయడానికి

దేవుడు కాలాన్ని ఇవ్వబోవటం లేదు. 

👉 కేవలం మారుమనస్సు పొందుటకు ఇచ్చాడు.


"దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.౹" "మరణమునొందువాడు మరణము నొందుటనుబట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనస్సుత్రిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రదుకుదురు; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు." (యెహెజ్కేలు 18:23,32)


"లేదా, దేవుని అనుగ్రహము మారుమనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని యెరుగక, ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా?౹" (రోమా 2:4)


"కొందరు ఆలస్యమని యెంచుకొనునట్లు ప్రభువు తన వాగ్దానమునుగూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని యెవడును నశింపవలెనని యిచ్ఛయింపక, అందరు మారుమనస్సు పొందవలెనని కోరుచు, మీ యెడల దీర్ఘశాంతముగలవాడై యున్నాడు.౹" (2పేతురు. 3:9)


"ఆయన, మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలెనని యిచ్ఛయించుచున్నాడు.౹" (1 తిమోతి. 2:4)


"మారుమనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చితినిగాని..." (ప్రకటన. 2:21)


ప్రతి సమయం ☑

ప్రతి దినం 

ప్రతి నెల 

ప్రతి సంవత్సరం అనేది  

👉 పరమదేవుడు మనకు ఇస్తున్న ఒక కృపాకాలం, ఒక అవకాశం 🙏🏿


4️⃣. నూతనమైనది కాలంలో లేదు – దేవుని కృపలో ఉంది

కాలం మనిషిని వృద్ధుడిని చేస్తుంది అలాగే మరణానికి దగ్గర చేస్తుంది కానీ దేవుని కృప మనిషి స్వభావమును నూతనుడిగా చేస్తుంది, దేవునికి దగ్గర చేస్తుంది, పాతాళలోకము నుండి తప్పిస్తుంది, నిత్య జీవం అనుగ్రహిస్తుంది.

దేవుని కృప అంటే మనిషి అర్హత పై కాదు దేవుని స్వభావం 
పై ఆధారపడినది. పరలోకము నుండే వచ్చినది. దేవుని కృపములో నూతనము ఎలా అనేది క్రింది 6️⃣ & 7️⃣ పాయింట్స్ ద్వారా చూడగలం. 

 

“యెహోవా కృపలు అంతములేనివి… అవి ప్రతి ఉదయము నూతనములు.” (విలాపవాక్యములు 3:22–23).

❌ ఇది సంవత్సర మార్పు కాదు
❌  మత మార్పు కాదు

  అలవాటు మార్పు కాదు

✅ స్వభావ మార్పు 

✅ హృదయ అనుభవం


👎🏿 కాలం బయట మార్పు చూపిస్తుంది

👍🏿 దేవుని కృప లోపల(హృదయములో) మార్పు చేస్తుంది.


5️⃣. క్రీస్తునందు మాత్రమే నూతన జీవితం

📖 పాత నిబంధనలో వాగ్దానం:

"మునుపటివాటిని జ్ఞాపకము చేసికొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతనక్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దాని నాలోచింపరా? నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను ఎడారిలో నదులు పారజేయుచున్నాను." (యెషయా. 43:18-19)

"నూతన హృదయము మీ కిచ్చెదను, నూతన స్వభావము మీకు కలుగజేసెదను, రాతిగుండె మీలోనుండి తీసివేసి మాంసపు గుండెను మీకిచ్చెదను.౹" (యెహెజ్కేలు 36:26)


📖 క్రొత్త నిబంధనలో నెరవేర్చబడింది:

"కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;౹" (2 కొరింథీ 5:17)

"క్రొత్తసృష్టి పొందుటయే గాని సున్నతి పొందుటయందేమియు లేదు, పొందకపోవుట యందేమియు లేదు.౹" (గలతి. 6:15) 


❌ నూతన సంవత్సరం కాదు

✅ క్రీస్తు నందే నూతనత్వం/నూతన సృష్టి/నూతన హృదయం/నూతన జీవితం


6️⃣. క్రీస్తు రక్తము – ఆత్మీయ నూతన ఆరంభానికి పునాది

బైబిల్ ప్రకారం నిజమైన నూతన ఆరంభం కాల మార్పుతో కాదు, మనిషి ప్రయత్నంతో కాదు, వేడుకలతో కాదు, ఒకరినొకరు శుభాకాంక్షలతో కాదు సుమీ.


అది క్రీస్తు రక్తము ద్వారానే కలుగుతుంది. పాత నిబంధనలో పాపానికి పరిష్కారం రక్తంతో సంబంధం కలిగి ఉంది. “రక్తము లేకుండా క్షమాపణ లేదు.” (హెబ్రీ 9:22) కాని ఆ పాత నిబంధన బలులు పాపాన్ని కప్పాయి కానీ తొలగించలేదు. "ఎద్దుల, మేకల, కోడెల రక్తము పాపాలను తొలగించలేకపోయెను.” (హెబ్రీ 10:4). అందుకే అవి ఆనాడు ప్రతి సంవత్సరం తిరిగి తిరిగి చేయబడేవి — అవి నూతన ఆరంభాన్ని ఇవ్వలేకపోయాయి.


క్రీస్తు శరీరధారియే వచ్చి తన స్వంత రక్తాన్ని సిలువలో అర్పించినప్పుడు, పాపానికి ఒక పూర్తి, శాశ్వత పరిష్కారం కలిగింది. “తన స్వంత రక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించి నిత్య విమోచనము సంపాదించెను.” (హెబ్రీ 9:12) 


❌ ఇది కాలానికి లోబడిన కార్యం కాదు.

✅ ఇది నిత్య విమోచనము.


క్రీస్తు రక్తము పాపాన్ని కప్పదు – పూర్తిగా శుద్ధి చేస్తుంది(1యోహాను. 1:7); దోషభావాన్ని తొలగిస్తుంది(హెబ్రీ. 9:14); దేవునితో సమాధానం(కొలొస్సయులు. 1:20); క్రొత్త నిబంధనకు పునాది (లూకా 22:20)… Etc. 


క్రీస్తు రక్తము ఎందుకు నూతన ఆరంభానికి పునాది? ఎందుకంటే — పాపం తొలగించబడితేనే నూతన జీవితం మొదలవుతుంది, దోషం తొలగించబడితేనే స్వేచ్ఛ ఉంటుంది, దేవునితో సంబంధం పునరుద్ధరించబడితేనే నూతనత్వం వస్తుంది ఇవి అన్నీ క్రీస్తు రక్తము ద్వారానే సాధ్యమయ్యాయి. 


❌ నూతన సంవత్సరం నూతన ఆరంభం ఇవ్వలేదు

❌ మానవ నిర్ణయాలు హృదయాన్ని మార్చలేవు

✅ క్రీస్తు రక్తము మాత్రమే నిజమైన నూతన ఆరంభానికి పునాది. 


7️⃣. పరిశుద్ధాత్ముడు ఇచ్చు నూతన స్వభావం

బైబిల్ ప్రకారం నిజమైన నూతనత్వం బాహ్య మార్పు కాదు, అంతర్గక మార్పు. ఆ అంతర్గక మార్పుకు మూలకారుడు పరిశుద్ధాత్ముడే. కాలం మారితే మన అలవాట్లు కొంత మారవచ్చు, కాని స్వభావం మారదుగా... మరి స్వభావం మారాలంటే పరిశుద్ధాత్ముడే అట్టి కార్యం మనలో చేయాలి. 


👤 యేసు స్పష్టంగా చెప్పాడు : 

"అందుకు యేసు అతనితో —ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు చున్నాననెను.౹ … యేసు ఇట్లనెను– ఒకడు నీటిమూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.౹" (యోహాను. 3:3,5)


❌ ఇది శరీర జననం కాదు;

✅ ఆత్మీయ పునర్జన్మ.


👤 పౌలు ఇదే సత్యాన్ని ఇలా వివరించాడు:

"మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను.౹" (తీతుకు. 3:5)


📝 నీటిమూలముగాను =  పునర్జన్మసంబంధమైన స్నానము ద్వారా

📝 ఆత్మ మూలముగాను = పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారా

📖 నీటిమూలముగాను + ఆత్మ మూలముగాను = రక్షణ 

📖 పునర్జన్మ పొందినవాడిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తాడు. "మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలో నున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు,౹" (1 కోరింది. 6:19) పరిశుద్ధాత్ముడు నివాసం ఉన్నచోట... నూతన స్వభావ మార్పు తప్పనిసరిగా ఉండును కదా!! 


📖 పరిశుద్ధాత్ముని లక్ష్యం మనలను “మంచివాళ్ళుగా” చేయడం కాదు, క్రీస్తు స్వభావముతో కూడినవారిగా చేయడం. “క్రీస్తు స్వరూపమునకు సమానముగా చేయబడుటకై.” (రోమా 8:29) ఇదే నిజమైన నూతన స్వభావం.


👣 “ఆత్మయందు నడుచుకొనుడి.” (గలతీయులు 5:16)


8️⃣. ప్రతి దినం ఒక హెచ్చరిక – ఒక పిలుపు

“క్షణకాలమే కనిపించి మాయమయ్యే ఆవిరి వంటిది మన జీవితం.” (యాకోబు  4:14)

“మనుష్యుని దినములు గడ్డివలె ఉన్నాయి… పువ్వు వాడిపోవును.” (కీర్తనల. 103:15–16)

“మన దినములు భూమిమీద నీడలవలె ఉన్నాయి.” (యోబు. 8:9)

“మనుష్యుని ఆయుష్షు ఊపిరివంటిది.” (కీర్తనల. 144:4)


దావీదు ఇలా ప్రార్థించాడు:

“మా దినములను లెక్కించుట మాకు బోధించుము.” (కీర్తనలు 90:12)

🔎 సంవత్సరం మారింది అంటే అర్ధం మన జీవితం నుండి ఒక సంవత్సరం తగ్గిపోయింది


నూతన సంవత్సరం మనకు ఇచ్చే సందేశం ఇది:

👉 సమయం పోతుంది

👉 ఆయుష్షు కరిగిపోతుంది

👉 మరణం దగ్గర పడుతుంది

👉 మరణాంతరం తీర్పు ఉండనుంది

👉 కావున ఇప్పుడే మారుమనస్సు అవసరం. 


📖 "–అనుకూల సమయమందు నీ మొర నాలకించితిని; రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు గదా! ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము.౹" (2కోరింది. 6:2)


9️⃣. నీ కాలం ముగుస్తుంది – కృపాకాలం కూడా ముగుస్తుంది

మనిషి యొక్క భూనివాస జీవితం నిరంతరం కొనసాగేదిగా కాదు; దేవుడు నిర్ణయించిన ఒక పరిమితి ఉంది. అలాగే దేవుడు ఇచ్చే కృపాకాలం కూడా శాశ్వతం కాదు. బైబిల్ ఈ సత్యాన్ని ఎక్కడా మృదువుగా చెప్పలేదు —


📖 బైబిల్ హెచ్చరిస్తుంది:

“మనుష్యులకు ఒక్కసారి మరణమును, ఆ తరువాత తీర్పును నియమించబడెను.” (హెబ్రీ 9:27)


“ఇదిగో, ఇప్పుడే అనుకూలమైన కాలము.” (2 కొరింథీ 6:2) బైబిల్ “రేపు” అని చెప్పదు.(మత్తయి.6:34; యాకోబు. 4:13-14) “ఇప్పుడే/ఈరోజే” అంటుంది.


“ఈ దినమే వినినయెడల, మీ హృదయములను కఠినపరచుకొనకుడి.” (హెబ్రీ 3:15)


కృపాకాలం ముగిసిన తర్వాత తీర్పే మిగులుతుంది. " తలుపు మూసివేయబడిన తరువాత… మీకు తెలియదు.” (మత్తయి 25:10–12).


❌  కాలం ఎప్పటికీ ఉండదు

❌ కృపాకాలం శాశ్వతం కాదు జాగ్రత్త.


🔟. ముగింపు

❌ సూర్యుని క్రింద – నూతనము లేదు

❌ కాల మార్పులో – రక్షణ లేదు

✅ దేవుని కృపలో – నూతన జీవితం ఉంది

✅ క్రీస్తునందు – నూతన సృష్టి ఉంది.


కాలం ప్రకారం మరొక్క సంవత్సరం అంటే

👉 మరొక అవకాశం

👉 మరొక హెచ్చరిక

👉 మరొక కృప పిలుపు


వేడుకలు ❌

ఆడంబరాలు ❌

శుభాకాంక్షలు ❌

వినోదం ❌

నృత్యాలు ❌

కేక్ కటింగ్ ❌


“ఇదిగో, నేను సమస్తమును నూతనము చేస్తున్నాను.” (ప్రకటన 21:5)

మీ ఆత్మీయులు 👪

WhatsApp Channel Join Now
Telegram Group Join Now
Instagram Page Follow page

Questions and Comments here!

Share this

Related Posts

Latest
Previous
Next Post »

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16