ఎఫెసీ. 5:19, కొలస్సీ. 3:16 |
అపోస్తులుల బోధ అనే ఈ సైట్ ని చూస్తూ అనేక విషయములను తెలుసుకుంటూ
దేవుని చిత్తములో నడిపింపబడాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువైన
యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.
ప్రియ సహోదరీ, సహోదరులారా, మునుపు వ్రాసిన పాత నిబంధనలో వాయిద్యములు,
కొత్త నిబంధనలో వాయిద్యములు అనే అంశముల ద్వారా నేటి క్రైస్తవులమైన మనము వాయిద్యములు
ఉపయోగించవచ్చా లేదా అని తెలుసుకున్నాము.
పరిశుద్ధ గ్రంథములో తెలుపబడిన లేఖనములను బట్టి నేటి క్రైస్తవులు వాయిద్యములు
వాడకూడదని తెలిసినా, కొంతమంది వాక్యమును వక్రీకరణ చేస్తూ ఎఫెసీయులకు. 5:19
మరియు కొలస్సీయులు. 3:16 లో ఉన్న వచనములను ఆధారముగా చేసుకొని నేటి క్రైస్తవులు
వాయిద్యములు వాయించవచ్చని సొంత బోధలు చేస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు.
» ఒకనినొకడు కీర్తనలతోను
సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు,.. – (ఎఫెసీ. 5:19).
» సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన
పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధిచెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవునిగూర్చి
గానముచేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో
క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి, – (కొలస్సి. 3:16).
పైన చూపబడిన రెండు వచనములలో “సంగీతము” అనే పదమును చూపి గ్రంథములో
సంగీతము అని ఉంది కాబట్టి ఆరాధనలో వాయిద్యములు వాడవచ్చని భావిస్తున్నారు.
ప్రియులారా, సంగీతము అనగా ఒక వస్తువు నుండి వెలువడే “శబ్దము”. అంతే
కాకుండా సంగీతము అనే పదము యొక్క అర్థము మనము తెలుగు నిఘంటువులో చూసిన యెడల “గానము”, “శబ్దము”
అని తెలుస్తుంది. ఇంకా వివరణగా చెప్పాలంటే, “స్వరపేటిక” లేక “శబ్దపేటిక” అని చెప్పవచ్చును.
పరిశుద్ధ గ్రంథములో సంగీతము అని ఉన్నది కనుక ఆది వాయిద్య సంగీతము అని
భావించి వాయిద్యములు ఉపయోగిస్తున్నారు. కాని
సంగీతముకు మరియు వాయిద్య సంగీతమునకు చాలా వ్యత్యాసమున్నదని మనము గ్రహించాలి.
సంగీతము రెండు రకాలు :
★ గాత్ర సంగీతము (Vocal Music).
★ వాయిద్య (లేదా) జంత్ర సంగీతము (Instrumental Music).
గాత్ర సంగీతము : సప్త స్వరములు అనగా “స రి గ మ ప ధ ని స” లతో
స్వరపేటిక తో శబ్దము కలుగజేయు విధానమునే గాత్ర
సంగీతము అంటారు.
వాయిద్య సంగీతము : సప్త స్వరములు అనగా “స రి గ మ ప ధ ని స” లతో స్వరపేటిక మరియు
నిర్జీవ వస్తువులను (సితార, హార్మోని, గిటార్,....) ఉపయోగించి శబ్దమును కలుగజేయు
విధానమును వాయిద్య సంగీతము అంటారు.
తెలుగు భాషలో ముద్రించబడిన పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీ మరియు కొలస్సి
పత్రికలలో “సంగీతము” అని ఉన్నచోట గాత్ర సంగీతము గూర్చి తెలియజేసారని అనడానికి మరొక
ఆధారము చూసినట్లయితే..
» Speaking to yourselves in psalms and hymns and spiritual
songs, singing and making melody in your heart to the Lord,.. – (Eph. 5:19).
» Let the word of Christ dwell in you richly in all wisdom; teaching and
admonishing one another in psalms and hymns and
spiritual songs, singing with grace in your hearts to the Lord,.. – (Col. 3:16).
★ ఆత్మసంబంధమైన
పాటల “తోను” - “ᾠδαῖς” (ōdais)spiritual
songs –ఆత్మీయమైన గీతములు, పద్యములు.
కాబట్టి సహోదరులారా, గ్రంథమును చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి సొంత
జ్ఞానముతో కాక దేవుని జ్ఞానముతో ముందుకు వెళ్ళాలని మనవి చేయుచున్నాను.
1) ఎఫెసీ. 5:19 మరియు కొలస్సీ. 3:16. ఈ రెండు వచనములలో “మీ
హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు, దేవుని గూర్చి గానము చేయుచు” అని వ్రాయబడుట
చూడగలము.
హృదయములో నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది కనుక ప్రతి ఒక్కరు
తమ హృదయములలో నుండి పాడుతూ లేదా గానము చేయుచు దేవుని మహిమపరచాలని తెలుసుకోవాలి.
★ హృదయమందు నిండియుండుదానినిబట్టి
యొకని నోరు మాటలాడును. – (లూకా. 6:45).
మన హృదయములలో నిండినది
మన నోటితో లేక స్వరపేటికతో బయటకి గానము చేసే ప్రక్రియను సంగీతము లేదా గాత్ర
సంగీతము అంటారని తెలుసుకోవాలి.
దేవుడు ఎందుకు
హృదయములలో నుండి వచ్చు గానమునే కోరుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే నిర్జీవ
వస్తువులు (సితార,
హార్మోని, గిటార్,....) మనకు బోధ చేయవు, మనలను హెచ్చరించవు కనుక.
» హృదయములలో నుండి
గానము ద్వారా కలుగు శబ్దము మనకు “హెచ్చరిక” కలుగజేయును.
» హృదయములలో నుండి
గానము ద్వారా కలుగు శబ్దము మనకు “బోధ” చేయును.
» హృదయములలో నుండి
గానము ద్వారా కలుగు శబ్దము మనకు “బుద్ధి” చెప్పును.
2) ఎఫెసీ 5:19; కొలస్సీ 3:16 లో చెప్పబడిన "సంగీతము" అంటే వాయిద్య
సంగీతము కాదు అనుటకు ఋజువులు.
వాయిద్యములు వాటంతట
అవే మ్రోగలేవు కనుక వాటిని వాయించుటకు ఒకరి
సహాయము అవసరము కనుక నిర్జీవ వస్తువులు వలన కలుగూ శబ్దము దేవునికి
అంగీకారయోగ్యమైనది కాదు.
» నిర్జీవ వస్తువులు
ద్వార కలుగు శబ్దము మనకి “హెచ్చరిక” కలుగజేయవు.
» నిర్జీవ వస్తువులు
ద్వార కలుగు శబ్దము మనకి “బోధ” చేయదు.
» నిర్జీవ వస్తువులు
ద్వార కలుగు శబ్దము మనకి “బుద్ధి” చెప్పదు.
పాత నిబంధనలో
వాయిద్యములు ఏ ఏ సందర్భములలో ఉపయోగించారు వాటిని దేవుడు ఎందుకు మాన్పివేసాడో మునుపు
వ్రాసిన అంశము “పాత నిబంధనలో వాయిద్యములు” లో వివరణ చూసాము అలగే క్రొత్త నిబంధనలో వాయిద్యములు ఎందుకు లేవు
దేవుడు ఎటువంటి ఆరాధన కోరుకుంటున్నాడో “క్రొత్త నిబంధనలో వాయిద్యములు” అంశములో గ్రంథమును
పరిశీలన చేసి తెలుకోగలిగాము.
ఎఫెసీ. 5:19 మరియు కొలస్సీ.
3:16 వచనములలో పరిశుద్ధాత్ముడు వ్రాయించిన సంగీతము అనే పదమునకు అర్థము, దేవుడు
ఎందుకు గాత్ర సంగీతమునే కోరుకుంటున్నాడో గ్రంథము ద్వారా గ్రహించాలి.
★ పిల్లనగ్రోవి గాని వీణె
గాని, నిర్జీవ వస్తువులు నాదమిచ్చునప్పుడు, స్వరములలో భేదము కలుగజేయనియెడల, ఊదినదేమి మీటినదేమి యని యేలాగు తెలియును?. – (1 కొరింధి. 14:7).
ప్రియమైన సహోదరీ,
సహోదరులారా నిర్జీవ వస్తువులు అనగా జీవములేని వస్తువులతో దేవుని ఆరాధన చేయుటకు
నీవు ఇష్టపడుతున్నావు కాని, మనలను తన రూపములో చేసుకుని, మనకు జీవమును,ఊపిరిని
దయచేసిన (అపొ.కార్య. 17:25) మన దేవుడు మన హృదయముల ద్వారా గానము చేయుచు ఎల్లప్పుడూ
స్తుతియాగము చేయుచు (హెబ్రీ. 13:15) ఆయనను మహిమ పరచాలని, తనని మాత్రమే ఆరాధించాలని
కోరుకుంటున్నాడు అటువంటి వారిని వెదకుచున్నాడని (యోహాను. 4:23-24) కానీ నిర్జీవ
వస్తువులతో వ్యర్థముగా ఆరాధించాలని దేవుడు ఎంతమాత్రమును మనల నుండి కోరుకొనుటలేదు.
★ కావున, హృదయములను త్వరపడనియ్యక
పవిత్ర పరచుకొని (ప్రసంగి. 5:1-2), తండ్రియైన దేవుని ఆత్మతోను, సత్యముతోను
యదార్ధముగా ఆరాధించాలని నన్ను నేను హెచ్చరిక చేసికొనుచు మీకు మనవి చేయుచున్నాను.
మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.
నవీన మనోహర్.
4 comments
commentsఅపొస్తలుల బోధ అపొస్తలుల బాధతో పాటు మీ బోధను కూడా కలిపోయినట్టు ఉంది సోదరుడు ఆరాధించడం పాడడం ముఖ్యం అది ఎలా పాడాలి ఆత్మతో, మరియాద పూర్వకంగా అల్లరి లేకుండా దేవునికి మహిమ కరంగా వాయిద్యాలు ఉపయోగించడం తప్పుకాదు
Replyమీ అభిప్రాయం వద్దు . వాక్యమును ఉన్నదీఉన్నట్టుగా చుడండి @jani గారు
Replyబ్రదర్ ఒక ప్రశ్న?
Reply2 కొరింథీ 3:14 లో పతనిబందన కొట్టివేయబడింది అన్నారు అయితే దాన్ని బోధించడం ఎందుకు?
మరి మత్తయి 5:17 లో ధర్మ శాస్త్రములొ యే వచనమునైనా కొట్టివేయడానికి వీలు లేదు అన్నారు.
కొద్దిగా క్లారిటీ ఇస్తారా?ప్లీజ్.
Thank you for information brother
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com