"అలంకరణ" (Adornment)

అలంకరణ



పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ప్రియులారా, మనలో అనేకమంది క్రైస్తవులమని చెప్పుకొనుచున్నారు కాని వారు తమ శరీరమును అలకరించుకునే విధము, భౌతిక సంబంధమైన అలంకారణ కొరకు ప్రాకులాడే విధము చూడగా  వారు క్రీస్తుని ధరించుకొన్నవారుగా అగుపడుటలేదు.

క్రైస్తవులమైన మనము ఏ విధమైన అలంకారణ కలిగియుండాలి? దేవుడు మన భౌతిక సంబంధమైన అలంకారణను కోరుకుంటున్నాడా? మనము ఈ లోకస్థులవలె జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడా?.....

నిజమైన క్రైస్తవుల అలంకారణ 

ఏలయనగా మనము పోరాడునది శరీరులతోకాదు. ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చుసర్వాంగ కవచమును ధరించుకొనుడి. – (ఎఫెసీ. 6:12-13).

◆  వడ్డాణము లేదా బెల్టు :
ఏలయనగా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని..... – (ఎఫెసీ. 6:14).

◆  వస్త్రములు :
నీతియను మైమరువు తొడుగుకొని.. – (ఎఫెసీ. 6:14).

◆ చెప్పులు లేదా  జోడు :
పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొని నిలువబడుడి. – (ఎఫెసీ. 6:15).

◆  డాలు :
ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. – (ఎఫెసీ. 6:16).

◆  శిరస్త్రాణము లేదా హెల్మెట్ :
మరియు రక్షణయను శిరస్త్రాణమును.... – (ఎఫెసీ. 6:17).

◆  ఖడ్గము లేదా కత్తి :
దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరిచుంకొనుడి. (ఎఫెసీ. 6:17).

● జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగస్వభావముమీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. (1 పేతురు. 3:3-4).

● స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రములచేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,
దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్ క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. (1 తిమోతి. 2:8-10).

పరిశుద్ధ గ్రంథము సాదువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమును అలకరించుకోవాలని, అది దేవుని దృష్టికి మిగుల విలువగలదని సెలవిస్తుంది. ఇది క్రైస్తవ స్త్రీకి ఉండవలసిన అలంకారణ.

» ప్రియులారా గ్రంధములో తగుమాత్రపు వస్త్రములు అని ఉన్నది కనుక అసభ్యకరమైన వస్రములు ధరించుకొనుచున్నారు.
తగుమాత్రపు అంటే ఇంగ్లీషు లో MODEST అని ఉంది అనగా వినయపూర్వకమైన వారిగా, అణుకువ గలవారిగా తమను తాము కనపరుచుకోవాలనే విషయము తెలియని స్థితిలో ఉండి దేవుని నామాన్ని అవమాన పరిచే వారిగా ఉన్నారు.

● అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును. – (సామెతలు. 31:30).

ప్రియ సహోదరుడా, గ్రంధములో స్త్రీ అలంకారణ గూర్చి మాత్రమే చెప్పబడినది కాని పురుషుని గూర్చి చెప్పబడలేదు కదా అనే ఆలోచన చేస్తే  నిన్ను నీవు మోసపుచ్చుకొన్నట్టే ఎందుకనగా మన పితరులు మరియు అప్పటి పురుషులకి ఎటువంటి అలంకారణ ఉండేది కాదు వారు కేవలము అంగీ వంటి వస్త్రములు ధరించుకొని తగుమాత్రము ధరించుకొన్నవారిగా ఉన్నారు. అయితే ప్రస్తుతమున్న లోకస్తులవలె చెవికి పోగులు పెట్టుకుని, చిరిగినా చొక్కాలు, ఫ్యాంట్లు వేసుకుని నిన్ను నీవు అవమాన పరుచుకోవడమే కాకుండా దేవుని నామాన్ని అవమాన పరుస్తున్నావు.

మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారానే అనేకమందిని దేవుని చెంతకు నడిపించాలని గ్రంథము చెప్తుంటే ఈనాడు క్రైస్తవులలో అనేకమంది వారి అలంకారణ ద్వారా, వారి సౌందర్యమును ప్రేమించుటలో ఎక్కువ ఆసక్తి చూపిస్తూ, దేవునికిచ్చే సమయమును సైతము పక్కన పెట్టి ఎదుటివారి మనసాక్షిని బలహీన పరిచే వారిగా ఉన్నారు.

ప్రియ సహోదరీ, సహోదరుడా, నీవు ఏ విధముగా అలంకరించుకుంటున్నావు? నీ బాహ్య సౌందర్యమును కోరుకుంటున్నావా లేక ఆత్మీయ జీవితమునా? ఆలోచన చేసి ఎదుటివారిని దేవుని చెంతకు నడిపించే విధముగా మన జీవితమూ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక మనము దేవుడు కోరుకున్నటుగా జీవించాలని నన్ను నేను హెచ్చరిక చేసుకొనుచూ మీకు  మనవి చేయు చున్నాను.

ఎందుకనగా,
★  భూమిమీద మన గుడారమైన యీ నివాసము (శరీరము) శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదము. (2 కొరింధి. 5:1). 

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"రక్షణ" (salvation)

క్రీస్తును మరియు సత్యముని అంగీకరించి, దేవుని చిత్తములో నడవాలని ఆసక్తి కలిగి క్రీస్తు సంఘములో చేర్చబడాలని ఆశిస్తున్న సహోదరీ, సహోదరులకు నా హృదయపూర్వక వందనములు.

ఈ లోకములో రక్షణ అనగా అనేక విధములైన అర్థములను మనము చూడగలము కాని నిజమైన రక్షణ మరియు సర్వ మానవాళి రక్షింపబడుటకు గల ఉన్న ఏకైక మార్గము యేసు ద్వారానే దొరుకుతుందని మొదట తెలుసుకోవాలి.

మన తండ్రియైన దేవుడు మన యెడల ప్రేమ కలిగి ఉన్నాడు తన బిడ్డలమైన మనము పాపమునకు దాసులు కాకూడదని, నిత్యజీవమును కోల్పోకూడదని, నరకమనే భయంకరమనే వేదన స్థలములోనికి మనము వెళ్లకూడదని ఎంతగానో కోరుకున్నాడు కనుక తండ్రి తనయొద్ద ఉన్న వాక్యమైయున్న దేవుడిని యేసుగా ఈ లోకమునకు పంపి, ఆ కుమారుని సిలువ మరణము ద్వారా మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగజేయుచున్నాడు.


❣️ (మత్తయి.1:21): "ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను."

❣️ (రోమా. 5:6-11): "ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను.౹ నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును.౹ అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.౹ కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా "ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము".౹ ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడు దుము.౹ అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము."

❣️ (1 యోహాను 4:10): "మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.౹"


ఇటువంటి విమోచన నీవు కోరుకుంటే, నిత్యజీవము పొందాలని ఆశపడుతున్నట్లయితే ఆయన మార్గములను తెలుసుకోవాలి.


రక్షణ పొందుకొనుటకు 5 మార్గములు : 


వినాలి


» మొదట యేసుక్రీస్తుని గూర్చిన సువార్త వినాలి.

● వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును. – (రోమా. 10:17).
క్రీస్తు ఏ ఏ సంగతులను బోధించమని ఆజ్ఞాపించాడో ఆ సంగతులన్ని మనము వినాలి.

● నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. – (మత్తయి. 28:20).

» మనకు ప్రకటింపబడిన సువార్తయందు విశ్వాసముంచి క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించాడని, మూడవ దినమున లేపబడ్డాడన్న ఉపదేశమును గట్టిగా పట్టుకొని యుండాలి.

● సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలుపుచున్నాను. మీరు దాని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశరూపకముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న పక్షమందు ఆ సువార్తవలననే మీరు రక్షణ పొందువారై యుందురు. నాకియ్యుబడిన ఉపదేశమును ముఖ్యమైనదిగా ఎంచి మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను. లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. – (1 కొరింధి. 15:1-4).

● వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్ధన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువారు లేకుండ వారెట్లు విందురు?. – (రోమా. 10:14).
కాబట్టి సహోదరీ, సహోదరుడా రక్షణ పొందాలంటే నీవు ఖచ్చితంగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గూర్చిన సువార్త వినాలి.


నమ్మాలి

» నీవు రక్షణ పొందాలంటే యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుని కుమారుడని నమ్మాలి.

● అందుకు సీమోను పేతురు - నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. – (మత్తయి. 16:16).
యేసు దేవుని కుమారుడని నమ్మితేనే మన పాపముల విషయములో చనిపోతామని తెలుసుకోవాలి.
● నేను ఆయననని మీరు విశ్వసించినయెడల మీరు మీ పాపములలోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను. – (యోహాను. 8:24).

» రక్షణ పొందాలంటే యేసు ప్రభువునందు విశ్వాసముంచాలి.

● ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి
అతనికిని అతని ఇంటనున్నవారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. – (అపొ.కార్య. 16:30-32).
● నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మనివానికి శిక్ష విధింపబడును.(మార్కు. 16:16).
కాబట్టి ప్రియులారా, రక్షణ పొందాలంటే మొదట వినాలి, అటు తరువాత  వినిన దానిని నమ్మాలి.


మారు మనస్సు పొందాలి

» మూడవదిగా నీవు విన్న విషయములను నమ్మిన తరువాత, ఇంతకుముందు నీవు చేసిన ప్రతీ పాపము విషయములో మనస్సు మార్చుకుని దేవుని యెదుట పశ్చాత్తాపడాలి.

● ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యలకు ఆజ్ఞాపించుచున్నాడు. – (అపొ.కార్య. 17:30-31).
● యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. – (లూకా. 24:47).
● దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సు కలుగజేయును. – (2 కొరింధి. 7:10).
● వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని- సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా పేతురు - మీర మారుమనస్సుపొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. – (అపొ.కార్య. 2:37-38).

కావున ప్రియ సహోదరీ, సహోదరుడా నీవు వినిన విషయములను నమ్మాలి, నీవు చేసిన పాపముల విషయములలో మారు మనస్సు పొందాలి.


ఒప్పుకోవాలి 

పైన చెప్పబడిన అన్ని విషయముల కంటే ఇది చాల కీలకమైనది ఎందుకనగా ఈనాడు క్రైస్తవులలో అనేకమంది క్రీస్తుని ఒప్పుకునే  విషయములో పొరబడుతున్నారు.

» యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి.

● అందుకు సీమోను పేతురు -నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. – (మత్తయి. 16:16).
● మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రియెదుట నేను వానిని ఒప్పుకొందును. – (మత్తయి. 10:32).

» అన్నిటికంటే ముఖ్యముగా క్రీస్తు తను ఒక  సంఘమును నిర్మించియున్నాడని, ఆ సంఘమునకు ఆయన నామమే పెట్టుకున్నాడని, ఆ సంఘము ద్వారానే నిత్యజీవము పొందుకోగలమని, ఆ సంఘము క్రీస్తు సంఘమని (Church of Christ) ఒప్పుకోవాలి.

● నీవు పేతురువు, ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దానియెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. – (మత్తయి. 16:18).
● మరి ఎవనివలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలెనుగాని, ఆకాశముక్రింద మనుష్యులలో 
ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.(అపొ.కార్య. 4:12).
● వేయబడినది తప్ప మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే. – (1 కోరింధి. 3:11).
● (ఆ సంఘము) ఆయన శరీరము అది సమస్తమైన వాటిలో ఉండి సమస్తమైన వాటిని నింపుచున్న వానితో నింపబడినదై యున్నది. – (ఎఫెసీ. 1:23).
● సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. – (కొలస్సి. 1:18).

నీవు రక్షింపబడాలంటే యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని, దేవుడు ఆయనని మృతులలో నుండి లేపాడని విశ్వసించాలి.

● యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును– (రోమా. 10:8-10).


బాప్తీస్మము పొందాలి

ప్రియ సహోదరీ, సహోదరుడా యేసుక్రీస్తు సువార్తను వినిన నీవు ఆయన మాటలను నమ్మాలి, నీ పాపముల విషయములో మారుమనస్సు పొందాలి, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని అయితే ఇవన్ని చేసిన నీవు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆ ఒక్క  సంఘములో అనగా క్రీస్తు సంఘములో (Church of Christ) చేర్చబడాలంటే ఖచ్చితంగా బాప్తీస్మము తీసుకోవాలి.

● ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. – (మార్కు. 16:16).
● పేతురు - మీర మారుమనస్సుపొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. – (అపొ.కార్య. 2:38).
● క్రీస్తు యేసులోకి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోకి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో (పాలుపొందుటకై ) ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి. – (రోమా. 6:3-4).
● మీరును బాప్తిస్మమందు ఆయనతోకూడ పాతి పెట్టబడినవారై ఆయనయందు సున్నతి పొందితిరి ఆ సున్నతి చేతులతో చేయబడునది కాదుగాని శరీరేచ్ఛాయుక్తమైన స్వభావమును విసర్జించుటయను క్రీస్తుకు (అనుకూలమైన) సున్నతియే. ఆయనను మృతులలోనుండి లేపిన దేవుడు కనుపరచిన ప్రభావమందు విశ్వాసముంచుటచేత ఆ బాప్తిస్మమువలన ఆయనతో కూడ లేచితిరి.(కొలస్సి. 2:12).
● సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది; అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదుగాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవునివిషయమై నిర్మలమైన మనస్సాక్షి కలిగియుండుటకు పూనుకొనుటయే. – (1 పేతురు. 3:21).


గమనిక : ఈ విషయముపై పూర్తి అవగాహనకు బాప్తీస్మము అంటే ఏమిటి? బాప్తీస్మము ఎలా తీసుకోవాలి? బాప్తీస్మము ఎందుకు తీసుకోవాలి? బాప్తీస్మము ఏ నామములో తీసుకోవాలి? అనే అంశములను చూడండి.


» » ఎవరైతే ఈ అయిదు విషయములను గ్రహిస్తారో వారు దేవుని కుమారుడు స్థాపించిన క్రీస్తు సంఘములో (Church of Christ) చేర్చబడతారు.

● మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటరొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము చేర్చుచుండెను. – (అపొ.కార్య. 2:46-47).
● కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. – (2 కొరింధి. 5:17).

కాబట్టి ప్రియులారా, నీవు క్రీస్తు సంఘములో (Church of Christ)  చేర్చబడ్డావా, నిత్యజీవము పొందుకొనుటకు సిద్ధముగా ఉన్నావా? ఆలోచన చేయు. రక్షణ పొందుకో.

★ ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణదినము.(2 కొరింధి. 6:2).

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"ఇల్లు" (The House)

ఇల్లు


పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ఇల్లు అనగా మనకు రెండు విషయములు గుర్తుకువస్తాయి ఒకటి భౌతిక సంబంధమైనది రెండు ఆత్మ సంబంధమైనది. అయితే ఆత్మ సంబంధమైన ఇల్లు అనగా సంఘము (1 కొరింధి 3:9; గలతీ. 6:10) గూర్చి ఇంతకుముందు వ్రాసిన అంశము ద్వారా తెలుసుకున్నాము. ఇప్పుడు భౌతిక సంబంధమైన ఇంటిని గూర్చి తెలుసుకుందాము.

క్రైస్తవులమైన మనము పరిశుద్ధ గ్రంథము చెప్పిన విధముగా మంచి  కుటుంబముగా లేక దేవుని ఇంటిగా కట్టబడుతున్నామా?  దేవునికి యిష్టానుసారముగా మన కుటుంబములను మన ఇంటిని ముందుకు నడిపిస్తున్నామా? ఒక క్రైస్తవుని కుటుంబము ఎలా ఉండాలో గ్రంధమును పరిశీలన చేస్తున్నామా?

ఈ విషయాలను ఆలోచన చేసి మన కుటుంబము లేక ఇల్లు ఏ విధముగా ఉండాలని దేవుడు ఆశ పడుతున్నాడో గ్రంధము ఆధారముగా వచనములను చూసి మార్పు చెందుదాము.

ఇంటిని గూర్చి గ్రంథ వివరణ 


A). క్రైస్తవులమైన మనము, మన ఇల్లు దేవునికి సంబంధించిన ఒక వ్యవస్థ అని, దానికి ఆయన అధికారియై యున్నాడని మొదట గ్రహించుకోవాలి. ఎందుకనగా ఆదాముని నిర్మించిన దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని యెంచి హవ్వని నిర్మించి వారిని ఒక కుటుంబముగా, ఒక యింటిగా కట్టెను.

 ● దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి,.. – (ఆది. 2:7).
 ● అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను. – (ఆది. 2:21-22).


B). ఇల్లు కుటుంబ సభ్యులతో కూడిన ఒక విభాగము. దానికి అధికారి పురుషుడు లేక భర్త.

 ● ఆదాము (భర్త), హవ్వ (భార్య), కయీను, హేబెలు (కుమారులు), etc... -  (ఆది. 2:24; 4:1-2).


C). ప్రతి ఇంటిలోనూ భర్త మాత్రమే నాయకుడుగా ఉండాలి మరియు తన భార్యను, పిల్లలను  సరియైన పద్ధతిలో నడిపించే వాడుగా ఉండి దేవుని నామాన్ని మహిమపరచాలి.

 ● క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై యున్నాడు. – (ఎఫెసీ. 5:23).
 ● ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను. – (1 కొరింధి. 11:3).
 ● సంపూర్ణమాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగ ఏలువాడునైయుండవలెను. – (1 తిమోతి. 3:4).


D). ప్రతి ఇంటిలోనూ భర్త తన కుటుంబమును పోషించేవాడిగా ఉండాలి. ఎందుకనగా మొదటి నుండి పురుషులే పని చేసి తమ కుటుంబములను పోషించేవారిగా ఉన్నారని గ్రంథము తెలియజేస్తుంది.

 ● మరియు దేవుడైన యెహోవా నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. – (ఆది. 2:15).
 ● ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపకపోయినయెడల వాడు విశ్వాస త్యాగము చేసినవాడై అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును – (1 తిమోతి. 5:8).


E). ప్రతి ఇంటిలోనూ భర్త భార్యను ప్రేమించేవానిగా ఉండాలి. క్రీస్తు ఎలాగైతే సంఘమును ప్రేమించి తన శరీరమును అర్పించాడో అలాగే భర్త కూడా తన భార్యను ప్రేమించాలి.

 ● పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దాని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత దాని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను. – (ఎఫెసీ. 5:25).
 ● అటువలెనే పురుషులుకూడ తమ స్వశరీలములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. – (ఎఫెసీ. 5:28).


F). ప్రతి ఇంటిలోనూ భార్య గృహనిర్వాహకురాలై యుండి ఇంటనుండి పని చేసుకునేదానిగా ఉండాలి.

 ● కాబట్టి యౌవనస్త్రీలు వివాహము చేసికొని, పిల్లలు కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను. – (1 తిమోతి. 5:14).
 ● ఆలాగుననే వృద్ధస్త్రీలు కొండెకత్తెలును, మిగుల మద్యపానాసక్తులునైయుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు; దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు, యౌవనస్త్రీలు తమ భర్తలకు లోబడుచు, పతిప్రియులును శిశుప్రియులును స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని. – (తీతుకు. 2:5).


G). ప్రతి ఇంటిలోనూ భార్య తన భర్తకు లోబడి విధేయత చూపడమే తనకు అలంకారముగా ఎంచుకుని కుటుంబము విషయములో జాగ్రత్త కలిగి భర్తను గౌరవించాలి.

 ● స్త్రీలారా, ప్రభువునకువలె మీ స్వపురుషులకు లోబడియుండుడి. – (ఎఫెసీ. 5:22).
 ● భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది. – (కొలస్సి. 3:18).
 ● అటువలె పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు, ఏ భయమునకు బెదరకయున్నయెడల ఆమెకు పిల్లలగుదురు – (1 పేతురు. 3:5-6).
 ● భార్యయైతే తన భర్తయందు భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను. (ఎఫెసీ. 5:33).


H). గర్భ ఫలము దేవుడిచ్చు బహుమానము కనుక ప్రతి ఇంటిలోనూ తల్లితండ్రులు తమ పిల్లలను దేవుని జ్ఞానములో పెంచేవారిగా ఉండి వారికి కోపము రేపక వారికి అన్నిటిని సమకూర్చే వారిగా ఉండాలి.

 ● కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే. – (కీర్తన. 127:3).
 ● నీ పూర్ణహృదయముతోను నీ పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.
నేడు నేను నీకాజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను. – (ద్వితియో. 6:5-7).
 ● తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. – (ఎఫెసీ. 6:4).


I). ప్రతి యింటిలోను పిల్లలు అన్ని విషయములలోను  తమ తల్లి తండ్రుల మాటలు విని వారికి విధేయులై ఉండాలి.

 ● పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే. – (ఎఫెసీ. 6:1).
 ● పిల్లలారా, అన్నివిషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనదగినది. – (కొలస్సి. 3:20).


కాబట్టి ప్రియులారా, క్రైస్తవులమైన మన ఇల్లు ఏ విధముగా ఉన్నది? గ్రంథములో చెప్పిన విధముగా పురుషుడు కుటుంబమును పోషిస్తున్నాడా? నీ ఇంటిలో పురుషుడే అధికారము చేయుచున్నాడా? నీ భార్య ఇంటి బాధ్యతలు నెరవేర్చి భర్తకు లోబడుతున్నదా? నీ పిల్లలని దేవుని శిక్షలోను, జ్ఞానములోను పెంచుతున్నావా?. ఆలోచన చేయు గ్రంధములో చెప్పబడిన మాటలను పరిశీలన చేసి నీ కుటుంబము దేవుని విరోధముగా నడుచుకుంటున్నట్లయితే ఈ క్షణమే నీ మనస్సు మార్చుకుని నీ కుటుంబమును సరియైన దారిలో నడిపించి దేవుని నామాన్ని మహిమ పరిచి ఆయన యిచ్చే ప్రతి ఆశీర్వాదమును పొందుకో.

మీ ఆత్మీయ సహోదరుడు,
» మనోహర్ బాబు. ©

"యేసయ్య అనవచ్చా?" (yesayya)

యేసయ్య అనవచ్చా?

ప్రియమైన సహోదరీ, సహోదరులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

నేటి క్రైస్తవ్యములో అనేకమంది క్రీస్తును యేసయ్య అనే పేరుతో పిలుస్తున్నారు కాని గ్రంధములో ఆయనను యేసయ్య అనే పేరుతో ఎవరైనా సంభోదించారా లేదా అనే విషయమును గ్రహించలేని స్థితిలో ఉండి ఆయన నామమమును వ్యర్థముగా ఉచ్చరిస్తున్నారు.

★ యేసు అనగా :

» గ్రీక్ లో Ἰησοῦς ” (Iēsous).
» ఇంగ్లీషు లో “ Jesus ”.

◆ యేసు అను శబ్దమునకు అర్థము “రక్షకుడు”.

» ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. – (మత్తయి. 1:21).

★ క్రీస్తు అనగా :

» గ్రీక్ లో  Χριστὸς ” (Christos).
» ఇంగ్లీషు లో “ Christ “.

◆ క్రీస్తు అను శబ్దమునకు అర్థము “అభిషక్తుడు”.

» దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. – (లూకా. 2:11).
» ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. – (మత్తయి. 1:16).

యేసుని అయ్యా అని సంభోదించినవారు 


● సమరయ స్త్రీ : (యోహాను. 4:11, 15, 19).
● వ్యాధిగ్రస్తుడు : (యోహాను. 5:7).
● మరియ : (యోహాను. 20:15).

★ అయ్యా అనగా :

» గ్రీక్ లో Κύριε ” (Kyrie).
» ఇంగ్లీషు లో “ Sir , Lord, Master “.

గ్రీక్ భాషలో వ్రాయబడిన పరిశుద్ధ గ్రంథములో  “ Κύριε ” (Kyrie) అనే పదము ఉన్నచోట ప్రభువని, అయ్యా అని తెలుగు భాషలోనికి తర్జూమా చేయబడినది.

తెలుగు భాషలోనికి తర్జూమా  చేయబడిన పరిశుద్ధ గ్రంథములో యేసుని అయ్యా అని సంభోదించుట చూస్తున్నాము కాని యేసయ్యా అనే పదము వాడబడలేదు. యేసు అను శబ్దమునకు అర్థము “రక్షకుడు” (మత్తయి. 1:21). మరి యేసయ్యా అని పిలుస్తున్న నీవు ఆ పదము ఏ మూల భాష నుండి తర్జూమా చేయబడినదో, దాని అర్థము ఏమిటో అని నిన్ను నీవు ప్రశ్నించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది.


దేవుని కుమారుని సంబోధించిన విధానము 


» అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. - (మత్తయి. 1:1; మార్క 1:1).
» అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము. - (యోహాను. 17:3).
» యేసుక్రీస్తు అందరికి ప్రభువు. - (అపో.కార్య. 10:36).
» యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడియున్నారు. - (రోమా. 1:7).
» మొదటి శతాబ్దాపు కాలములో యేసుక్రీస్తు నామములో మాత్రమే స్వస్థతలు - (అపో.కార్య. 4:10; 16:18).
» బర్నబా గారు మరియు పౌలు గారు యేసుక్రీస్తు నామము కొరకు తమ్మును తాము అప్పగించుకున్నారు. - (అపో.కార్య. 15:25).
» మనకి ప్రభువు ఒక్కడే; ఆయనే యేసుక్రీస్తు - (1 కొరింధి. 8:6).
» ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైయుండును గాక. - (1 కొరింధి. 16:23).
» యేసుక్రీస్తు ద్వారా తనకు (తండ్రికి) కుమారులనుగా స్వీకరించుటకై... - (ఎఫెసీ. 1:5).
» ఆయన ఆజ్ఞ యేదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని... - (1యోహాను. 3:22).

ఇంకా అనేక వచనములు కలవు వాటన్నిటిలోనూ దేవుని కుమారుని సిలువ వేయబడిన యేసుక్రీస్తు అని సంబోధించారు కాని ఎక్కడా కూడా యేసయ్యా అని సభోదించలేదు.


యేసయ్యా అని పిలువకూడదా? 


ఈనాడు క్రైస్తవ్యములో అనేకమంది వాక్యమును తమకు అనుగుణంగా మార్చుకుని  యేసుని  “యేసయ్య” అని గౌరవ ప్రధముగా సంభోదిస్తున్నాము అనే ఆలోచన కలిగియున్నారు. ఇటువంటి ఆలోచన వలన పరిశుద్ధాత్ముని ప్రేరణతో వ్రాయబడిన గ్రంథములోని మాటలను కలిపి చెరిపే వారుగా ఉన్నారు.

★ మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీ కాజ్ఞాపించుచున్నాను. వాటిని గైకొనుటయందు నేను మీ కాజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయ కూడదు.- (ద్వితియో. 4:2; 12:32).

★ ఆయన మాటలతో ఏమియు చేర్చకుము ఆయన నిన్ను గద్దించునేమో అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు.- (సామెతలు. 30:6).

హెచ్చరిక :


★ ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా-ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును. – (ప్రకటన. 22:18).

 కావున ప్రియ సహోదరుడా, సహోదరీ పరిశుద్ధ గ్రంధమును వ్రాయించిన పరిశుద్ధాత్ముడే దేవుని కుమారుని యేసయ్యా అని సంభోదించనప్పుడు నీవు నేను ఎందుకు సంభోధించాలి? పరిశుద్దాత్మకు విరోధముగా మాట్లాడి పాపము చేయుదువా? ఆలోచన చేయు ఎందుకనగా....


◆ మనుష్యకుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు. – (మత్తయి. 12:32).

◆ విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము. - (రోమా. 14:23).

మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు.
The churches of Christ greet you - Roma 16:16