![]() |
ఆదిసంభూతుడు (firstborn) |
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు 🙏🏿
అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి, దేవుని మూలముగా పలికిన అనేక మాటలలో ఒకటి కొలొస్సయలకు వ్రాసిన పత్రిక 1:15 వచనము. ముఖ్యంగా ఈ వచనములో "సృష్టికి ఆదిసంభూతుడు" అనే పదం యొక్క అర్థం కొందరికి తెలియక తాము ఇతరులకు బోధించే విషయములో...
❌ "యేసు సృష్టింపబడిన వాడని"
❌ "యెహోవా ఆయన్ని(యేసును) కలుగజేశారని"
❌ "ఆదిలో తాను పుట్టాడని"
❌ "యేసు ఆదిలోనే దేవుని కుమారుడని"
👆 ఇలా మన పరిశుద్ధ గ్రంథము సెలవివ్వని ఇటువంటి కల్పనాకథలను శ్రోతులకు నేర్పిస్తూ తమ్ము తామే నాశనం మార్గమునకు పోవడమే కాక తమతో పాటు మరికొందరిని తీసుకొని పోతున్నారు. ఇటువంటి అబద్ధ బోధకుల బారిన పడకుండా ఉండుటకే ఈ అంశం రాయటానికి గల ముఖ్య ఉద్దేశం.
⟴ Telugu 👇🏿
(కొలొస్స 1:15): "ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.౹"
⟴ English 👇🏿
(Col 1:15): "Who is the image of the invisible God, the firstborn of every creature:"
⟴ Greek 👇🏿
(Κολοσσαί 1:15): "Ὅς ἐστιν εἰκὼν τοῦ Θεοῦ τοῦ ἀοράτου, πρωτότοκος πάσης κτίσεως,"
ఆదిసంభూతుడు = firstborn = πρωτοτόκος (Prototokos ∞ G4416)
⇶ ఆదిసంభూతుడు = Prototokos = the firstborn
⇶ సర్వ = Pas = every/over-all
⇶ సృష్టికి = Ktisis = creature
🔥"సర్వసృష్టికి ఆదిసంభూతుడు అంటే?"
సర్వసృష్టికి ఆదిసంభూతుడు(Prototokos Pas Ktisis) అనే దానికి అర్ధం నాలుగు విషయాల్లో తెలుసుకొనుటకు ప్రయత్నం చేద్దాం. ఆవేవనగా.. 👇
𒐕 సృష్టికి ముందు ఉన్నవాడని - (యోహాను. 17:1-5),
"యేసు ఈ మాటలు చెప్పి ఆకాశమువైపు కన్నులెత్తి యిట్లనెను– తండ్రీ, నా గడియ వచ్చియున్నది.౹ నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీదను ఆయనకు అధికారమిచ్చితివి.౹ అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.౹ చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని.౹ తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.౹"
𒐖 సృష్టికి ఆదియైనవాడు - (యోహాను. 1:1-3; ప్రకటన. 3:14),
"ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.౹ ఆయన ఆదియందు దేవునియొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను,౹ కలిగియున్నదేదియు ఆయనలేకుండ కలుగలేదు.౹"
ఆమేన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదియునైనవాడు చెప్పు సంగతులేవనగా౹"
𒐗 సృష్టికి ఆధారభూతుడు/ఆధారమైన వాడు - (కొలస్సీ. 1:15-18),
"ఆయన అదృశ్యదేవుని స్వరూపియై సర్వసృష్టికి ఆదిసంభూతుడై యున్నాడు.౹ ఏలయనగా ఆకాశమందున్నవియు భూమియందున్న వియు, దృశ్యమైనవిగాని, అదృశ్యమైనవిగాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను, సర్వమును ఆయనయందు సృజింప బడెను, సర్వమును ఆయనద్వారాను ఆయననుబట్టియు సృజింపబడెను.౹ ఆయన అన్నిటికంటె ముందుగా ఉన్నవాడు; ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు.౹"
𒐘 ఆది యందు అన్నింటికీ సంభవింపజేసినవాడు - (హెభ్రీ. 1:7-12; 1 కోరింది. 8:5-7).
"ఏలయనగా –నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కని యున్నాను అనియు, ఇదియుగాక –నేను ఆయనకు తండ్రినైయుందును, ఆయన నాకు కుమారుడైయుండును అనియు ఆ దూతలలో ఎవనితో నైన ఎప్పుడైనను చెప్పెనా? మరియు ఆయన భూలోకమునకు ఆదిసంభూతుని మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరు ఆయనకు నమస్కారము చేయవలెనని చెప్పుచున్నాడు. —తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసికొనువాడు అని తన దూతలనుగూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారునిగూర్చియైతే –దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది; నీ రాజదండము న్యాయార్థమయినది. నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను. మరియు – ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే అవి నశించును గాని నీవు నిలిచియుందువు అవన్నియు వస్త్రమువలె పాతగిలును ఉత్తరీయమువలె వాటిని మడిచివేతువు అవి వస్త్రమువలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే యున్నావు నీ సంవత్సరములు తరుగవు అని చెప్పుచున్నాడు. అయితే –నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయువరకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దూతలలో ఎవనినిగూర్చియైన యెప్పుడైనను చెప్పెనా?౹"
"దేవతలన బడినవారును ప్రభువులనబడినవారును అనేకులున్నారు.౹ ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.౹"
⟴ Note : ఆదిసంభూతుడు(Prototokos) అనే పదం క్రొత్త నిబంధన యందు తొమ్మిది సారులు ప్రస్తావించబడింది. 👉 G4416
⟴ Prototokos అనే మూలం Protos(G4413) నుండి ఉద్భవించింది. Protos అనగా కాలం ప్రారంభం కాకమునుపు ప్రథముడని.(first in time or place)
🔥"క్రీస్తు సృజింపబడిన వాడు!?"
(సామెతలు. 8:22-23) : "పూర్వకాలమందు తన సృష్ట్యారంభమున తన కార్య ములలో ప్రథమమైనదానిగా యెహోవా నన్ను కలుగజేసెను. అనాదికాలము మొదలుకొని మొదటినుండి భూమి ఉత్పత్తియైన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని."
➦ సామెతలు 8వ అధ్యాయము పట్టుకొని క్రీస్తు సృజింపబడినవాడు అనేవారు వాక్య అజ్ఞానులే. ఈ అధ్యాయం యొక్క పూర్తి వివరణ ఈ క్రింది 👇 అంశాన్ని క్లిక్ చేసి పూర్తిగా చదవగలరు
సామెతలు 8వ అధ్యాయము వివరణ
➪ క్రీస్తు సృజింపబడినవాడు కాడు; సృష్టికర్తయే!
➪ క్రీస్తు, తన తండ్రియైన దేవునివలె మొదటివాడను, కడపటివాడునైయున్నాడు.
యెహోవా దేవుని గూర్చి (యె షయా 44:6; 48:12)
- "ఇశ్రాయేలీయుల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మొదటివాడను కడపటివాడను నేను తప్ప ఏ దేవుడును లేడు."
- "యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నాకు చెవి యొగ్గి వినుము. నేనే ఆయనను నేను మొదటివాడను కడపటివాడను"
క్రీస్తు ప్రభువుని గూర్చి (ప్రకటన. 1:18; 2:8; 22 :13)
- "నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను; మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై యున్నాను.
- మొదటివాడును కడపటివాడునైయుండి, మృతుడై మరల బ్రదికినవాడు
- "నేనే అల్ఫాయు ఓమెగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై యున్నాను.౹"
6 comments
commentsThank-you Anna
ReplyVandhanalu thammudu
Replyఒరే ఏ పూ నీకు ఏమి తెలుసు గ్రంథములో విషయాలు. క్రీస్తు సృజించబడిన వాడు రా.... నీకు ఎవడు నేర్పించాడు రా. నీ ఏరియా చెప్పు వస్తాను.
ReplyGood Topic Sir Praise the Lord
Replyనేను ఒక బోధ విన్నాను అన్న క్రీస్తు కేవలం అధిలో తండ్రి ఆలోచనలో ఉన్నారు కానీ అక్కడ లేరు అని దీని గూర్చి కూడా చెప్పు అన్న
Replyఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.
ReplyThanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com