యేసుక్రీస్తు రక్తము (The Blood Of Jesus Christ)

 

యేసుక్రీస్తు రక్తము (The Blood Of Jesus Christ)

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు.🙌

  జగత్తు పునాది వేయబడక మునుపు సర్వోన్నతుడగు దేవుడు మన నిమిత్తము సంకల్పించిన ప్రభువైన యేసుక్రీస్తు రక్తము🩸 యొక్క విలువ యెట్టిదో, ఆ రక్తము మన జీవితాలలో ఎలా పనిచేస్తుందో ఎరుగని వారు అనేకమంది ఉన్నారు. 

చాలామంది యేసుక్రీస్తు  కార్చిన రక్తమును గూర్చియూ సిలువలో ఆయన చేసిన త్యాగమును గూర్చియూ సరియైన అవగాహన లేక వారికి తెలిసీ తెలియని జ్ఞానముతో మాట్లాడుతూ, దుర్భాషలాడుతూ తమకు తామే ఉగ్రతను కొని తెచ్చుకుంటున్నారు. 

వాస్తవానికి నేడు క్రైస్తవులుగా పిలువబడుతున్న అనేకమందికి ఈ విషయముపై అవగాహన లేకపోవడం చాలా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

ప్రభువైన యేసు రెండువేల సంవత్సరాల క్రితం తండ్రి చేత ఈ లోకానికి పంపబడ్డాడు.(యోహాను. 6:46; 6:57; 7:19; 8:42; 13:3; 16:27-28 cf).  కానీ ఈ సృష్టిని సృజించక మునుపు జగత్తుకు పునాది వేయబడక మునుపే దేవుడు యేసుక్రీస్తు రక్తమును🩸మన కొరకు సంకల్పించుకున్నాడు. (1 పేతురు. 1:19; అపో.కార్య. 2:23 cf).

నీ జీవితంలో యేసుక్రీస్తు రక్తము ఏమి చేస్తుంది?

The churches of Christ greet you - Roma 16:16