"దేవుడు ఒక్కడే" (ONE GOD)

అంశము: దేవుడు ఒక్కడే

తండ్రియైన దేవునినుండియు మన రక్షకుడైన క్రీస్తుయేసు నుండియు కృపయు కనికరమును సమాధానమును నీకు కలుగును గాక.

(1 కొరింథీయులకు 8:6)
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.


● దేవుడొక్కడే - (1 తిమోతి. 2:5).
● యెహోవా ఒక్కడే - (జెకర్యా 14:9).
● మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా - (ద్వితియో. 6:4).
● యెహోవాయే మన దేవుడు - (యెహోషువ. 24:17; కీర్తనలు 118:27; యెషయా. 45:18).

 మనకందరికి తండ్రియొక్కడే కాడా? ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా? - (మలాకీ. 2:10).
● లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. - (1 కోరింథీ. 8:4).
● ఒక్కడే మీ తండ్రి. - (మత్తయి. 23:9).
 
అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. - (1 కోరింథీ. 12:6).
 
అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు. (ఎఫెసీ. 4:6).● అద్వితీయ సత్యదేవుడు ఒక్కడే. - (యోహాను. 17:3)."దేవుడొక్కడే అనుటకు సాక్ష్యము"

A). "పరిశుద్ధాత్మడు సాక్ష్యము"

యేసుక్రీస్తు వారుకి దేవుడున్నాడని  పరిశుద్ధాత్మడు యొక్క సాక్ష్యము.


◆ “మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క దేవుడైన మహిమ స్వరూపియగు తండ్రి...” - (ఎఫెసీ. 1:19).


B). "యేసుక్రీస్తు సాక్ష్యము"

యేసుక్రీస్తు వారుకి దేవుడున్నాడని  యేసుక్రీస్తు యొక్క సాక్ష్యము.

◆ నా దేవా నా దేవా”, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు? - (కీర్తనలు. 22:1)
◆ ఇంచుమించు మూడు గంటలప్పుడు యేసు “ఏలీ, ఏలీ, లామా సబక్తానీ” అని బిగ్గరగా కేకవేసెను. ఆ మాటకు “నా దేవా, నా దేవా” నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. - (మత్తయి. 27:46).
◆ మూడు గంటలకు యేసు “ఎలోయీ, ఎలోయీ, లామా సబక్తానీ” అని బిగ్గరగా కేక వేసెను; అ మాటలకు “నా దేవా, నా దేవా,” నన్ను ఎందుకు చెయ్యివిడిచితివని అర్థము. - (మార్కు. 15:34).
◆ యేసు ఆమెతో నేను ఇంకను తండ్రియొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు; అయితే నా సహోదరులయొద్దకు వెళ్లినా “తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడునైన” వాని యొద్దకు ఎక్కిపోవు చున్నానని వారితో చెప్పుమనెను. - (యోహాను. 20:17).


C). "తండ్రి సాక్ష్యము

యేసుక్రీస్తు వారుకి నేనే దేవుడని తండ్రి యొక్క సాక్ష్యము.

◆ నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున “దేవుడు నీ దేవుడే” చెలికాండ్రకంటె హెచ్చ గునట్లుగా నిన్ను ఆనందతైలముతో అభిషేకించి యున్నాడు. - (కీర్తనలు.  45:7)
నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత “దేవుడు  నీ దేవుడు” నీతోడివారికంటె నిన్ను హెచ్చించునట్లుగా ఆనందతైలముతో అభిషేకించెను. - (హెబ్రీయులకు. 1: 9)


D). "దెయ్యములు సాక్ష్యము"

◆ దేవుడొక్కడే అని నీవు నమ్ముచున్నావు. ఆలాగునమ్ముట మంచిదే; “దయ్యములును నమ్మి వణకుచున్నవి”. (యాకోబు. 2:19).


గమనిక :- “ఇద్దరు మనుష్యులు సాక్ష్యము సత్యమని” గ్రంథము తేటగా తెలియపరుస్తుంది. - (యోహాను. 8:17).


హెచ్చరిక 
* యేసుక్రీస్తుకి ఎవరైతే దేవుడో.. ఆయనే నాకు దేవుడు.
* నీకు అనేకమంది దేవుళ్ళు ఉండవచ్చు కానీ నాకు దేవుడు ఒక్కడే ఆయనే మనకు తండ్రి.


మీ ఆత్మీయ సహోదరుడు,
Bro. మనోహర్ నవీన©

Share this

Related Posts

Previous
Next Post »

8 comments

comments
Anonymous
June 9, 2017 at 3:07 PM delete

Meru rase posts prathidhi lekhanamula adharanga unnai annitiki reference chupistunnaru chala baga rastunaru devudu mimmunu aseervadhinchunugaka
Vandanamulu brother km

Naveena r Beulah

Reply
avatar
Joseph
June 9, 2017 at 5:20 PM delete

క్రీస్తు దేవుడు కాదా? అనే టాపిక్ కోసము వెయిట్ చేస్తున్నా. బ్రదర్ KM దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నా మరి యేసు కూడా దేవుడే కదా యోహాను 1:1-2 ప్రకారంగా ... ఆలోచన చేస్తున్నా బ్రదర్.

Reply
avatar
June 10, 2017 at 8:58 AM delete

ఈ రోజు ఆ అంశమును రాయడానికి ప్రయత్నమూ చేస్తాను బ్రదర్ వందనములు

Reply
avatar
July 12, 2017 at 8:33 PM delete

Very good job brother.Rom 16:16

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16