దేవుడు (God)

అంశము: దేవుడు

మన తండ్రియైన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగును గాక
ప్రపంచములో ఎక్కువమంది దేవుడున్నాడని నమ్ముచున్నారు. అయితే "దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు"(1 కొరింథీ. 15:34) అని బైబిలు బోధిస్తుంది. ప్రజలను గమనిస్తుంటే యిది నిజమని రూఢి అవుతుంది. సృష్టికర్తకు బదులు సృష్టమును పూజిస్తూ, వీధికొక దేవుడు, గ్రామమునకొక దేవుడు. రాష్టానికొక దేవుడు, కోట్ల సంఖ్యలో ప్రజలు దేవుళ్ళను, దేవతలను పూజిస్తూ, కొలుస్తూ సృష్టికర్తను మరచిపోయారు. బైబిలు పట్టుకొన్న వారిలో కూడ దేవుని గూర్చిన సరైన జ్ఞానం లేదనడం వాస్తవ విరుద్ధం కాదు.


దేవుడుఅనే మాటకు అర్ధము – “స్వయంభవుడుఅనగా తనకు తానుగా ఉన్నవాడు. 

అందుకు దేవుడు నేను ఉన్నవాడను అను వాడనైయున్నానని మోషేతో చెప్పెను. మరియు ఆయన ఉండునను వాడు మీయొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పవలెననెను. – (నిర్గామకాండము 3:14)



"దేవుడు ఉన్నాడా"..?

పరలోకమందున్న మన దేవుడు “అక్షయుడు + అదృశ్యుడు + అద్వితీయడు” (1 తిమోతి 1:17).


» అక్షయుడు అనగా క్షయము కానివాడు.
» అదృశ్యుడు అనగా కనబడనివాఁడు.
» అద్వితీయుడు అనగా తనకు సాటియైన/సమానమైన వాడు ఎవరు లేరు.
అదృశ్యుడుఅనగా కంటికి అగోచరుడు. (నిర్గమ. 33:20). 


అయన స్వరూపము బట్టి అయన అదృశ్యుడైన వాడు. “జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన” (రోమా. 1:20) దేవుడు ఉన్నాడని అవి సెలవు ఇస్తున్నాయి. ఇలాంటి  అదృశ్యుడైన దేవుడును తెలుసుకోవలసిన అవసరత ఎంతో ఉంది. 


  “ఆదియందు దేవుడు...” - (ఆది. 1:1). దేవుడు ఉన్నాడనే మాటతోనే పరిశుద్ధ గ్రంథము ప్రారంభమైనది.
  దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయ ములో అనుకొందురు. - (కీర్తన. 14:1; 53:1).


   దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడను కొందురు దేవుడు లేడని వారెల్లప్పుడు యోచించుదురు. (కీర్తన. 10:4).


  ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుటవలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై యున్నారు. - (రోమా. 1:20)


  మృగములను విచారించుము అవి నీకు బోధించును ఆకాశపక్షులను విచారించుము అవి నీకు తెలియజేయును. భూమినిగూర్చి ధ్యానించినయెడల అది నీకు భోధించునుసముద్రములోని చేపలును నీకు దాని వివరించును. వీటి అన్నిటినిబట్టి యోచించుకొనినయెడల యెహోవా హస్తము వీటిని కలుగజేసెనని తెలిసికొనలేనివాడెవడు? - (యోబు. 12:7-9).


  ఆకాశములకెగురు సంకుబుడి కొంగయైనను తన కాలము నెరుగును, తెల్ల గువ్వయు మంగల కత్తి పిట్టయు ఓదెకొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు. (యిర్మియా. 8:7).


  కన్నులుండియు చూడకయు చెవులుండియు వినకయు నున్న వివేకములేని మూఢులారా, ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండునట్లును, దాని తరంగము లెంత పొర్లినను అవి ప్రబలలేకయు, ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లును నిత్య నిర్ణయముచేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయ పడరా? నా సన్నిధిని వణకరా? ఇదే యెహోవా వాక్కు. - (యిర్మియా. 8:21-22).


 ఆయన ఆజ్ఞ నియ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును, భూమ్యంత భాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క జేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనా గారములలోనుండి గాలిని రావించును. - (యిర్మియా. 10:13). 


ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది. (కీర్తనలు. 19:1; 8:1).



"దేవుడెవరు"..?

దేవునిగూర్చిన జ్ఞానము కొందరికి లేదు. మీకుసిగ్గు కలుగుటకై యిట్లు చెప్పుచున్నాను. - (1 కొరింథీ. 15:34).


 యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవముగల దేవుడు. - (యిర్మియా. 10:10).


 యెహోవాయే దేవుడని తెలిసికొనుడి. - (కీర్తనలు. 100:3).


 యెహోవాయే మన దేవుడు. - (యెహోషువ. 24:17; కీర్తనలు 118:27; యెషయా. 45:18).


 పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమియందును యెహోవాయే దేవుడనియు, మరియొక దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకము నకు తెచ్చుకొనుము.- (ద్వితియో. 4:39; 1 కోరింథీ. 8:4).


 దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు. - (యెహోషువ. 22:22).


 ఆయనే స్వయంభవుడు; ఆయనే యెహోవా. - (యెషయా. 43:10-11; ద్వితియో. 4:35).


"దేవుడు అద్రుశ్యుడా"..?

అదృశ్యుడు అనగా కంటికి అగోచరుడు

  1.  ఆయన నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను. - (నిర్గమ. 33:20).
  2.  మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. - (1 తిమోతి. 6:16).
  3.  ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు - (యోహాను. 1:18).
  4.  ఏ మానవుడును దేవుని ఎప్పుడును చూచియుండ లేదు. - (1 యోహాను. 4:12).



"దేవుడు ఒక్కడా లేక ముగ్గురా"..?


  దేవుడొక్కడే - (1 తిమోతి. 2:5).


మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. - (ద్వితియో. 6:4).


  మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి. - (1 కోరింథీ. 8:6).


  లోకమందు విగ్రహము వట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. - (1 కోరింథీ. 8:4)


  ఒక్కడే మీ తండ్రి. - (మత్తయి. 23:9).


   అందరిలోను అన్నిటిని జరిగించు దేవుడు ఒక్కడే. - (1 కోరింథీ. 12:6).


   అందరికి తండ్రియైన దేవుడు ఒక్కడే. ఆయన అందరికిపైగా ఉన్నవాడై అందరిలోను వ్యాపించి అందరిలోఉన్నాడు. - (ఎఫెసీ. 4:6).


  అద్వితీయ సత్యదేవుడు ఒక్కడే. - (యోహాను. 17:3
).



"ఆ ఒక్క సత్య దేవుడును గుర్తించడము ఎట్లా"..?


ఆయన అదృశ్య లక్షణములు, అనగా ఆయన నిత్యశక్తియు + ఆయన దేవత్వము - (రోమా. 1:20). ఈ ప్రత్యేక లక్షణములు బట్టి నిజమైన దేవుడు ఎవరో గ్రహించుకోగలము.

 

నిత్యశక్తియు”( eternal power) అనగా “శాశ్వతమైన శక్తి”.


దేవత్వము” (Godhead) అనగా “దేవుని యొక్క గుణ లక్షణములు
”.


:: నిత్యశక్తియు ::

> దేవుడు సృష్టికర్త. - (ఆది. 1:1; రోమా. 1:25; 4:17).
> దేవుడు అద్వితీయుడు. - (యోహాను. 17:3).
> దేవుడు ఆత్మస్వరూపి అనగా ప్రకృతి సంబందికాడు. -  (యోహాను. 4:24).
> దేవుడు సర్వశక్తిమంతుడు అనగా సమస్తము చేయగల సమర్ధుడు. - (ఆది. 17:1).
> దేవుడు సర్వజ్ఞానం గలవాడు అనగా సమస్తము తెలిసినవాడు. - (కీర్తన. 139:1-6).
> దేవుడు సర్వాంతర్యామి అనగా అంతట ఉన్నవాడు. - (కీర్తన. 139:7-12; యిర్మియా. 23:23).
> దేవుడు నిత్యుడు అనగా ఎల్లప్పుడు ఉన్నవాడు. - (నిర్గమ. 3:14; యెషయా. 57:15).
> దేవుడు ఉగ్రుడు. - (రోమా. 1:18; 2:8-9).
> దేవుడు రోషము గలవాడు - (నిర్గమ. 34:14).
> దేవుడు అదృశ్యుడు అనగా కంటికి అగోచరుడు. - (నిర్గమ. 33:20).


:: దేవత్వము ::

> దేవుడు పరిశుద్ధుడు అనగా పాపము లేనివాడు. -  (యెషయా. 6:3; 1 పేతురు. 1:14).
> దేవుడు ప్రేమమాయుడు. - (యోహాను. 3:16; 1యోహాను. 4:8).
> దేవుడు సమాధానకర్త. - (1 కొరింథీ. 4:33; 2 కొరింథీ. 13:11; యెషయా. 45:7).
> దేవుడు దీర్ఘశాంతుడు. - (కీర్తన. 145:8; 2 పేతురు 3:9).
> దేవుడు దయగలవాడు - (నిర్గమ. 34:6; విలాప. 3:25).
> దేవుడు మంచివాడు. - (నిర్గమ 33:19; లూకా. 18:19).
> దేవుడు సత్యవంతుడు - (రోమా. 3:4; 15:8-9; యోహాను. 3:33).
> దేవుడు నాయ్యవంతుడు - (కీర్తన - 89:14; 129:4; లూకా. 7:29).
> దేవుడు శాంతమూర్తి మరియు పరిపూర్ణడు. -  (యోవేలు. 2:13; మత్తయి. 5:48).
> దేవుడు అబద్ధమాడనేరడు -  (సంఖ్యా. 23:19; తీతుకు 1:3).



గమనిక: ఇంకా అనేకమైనవి కలవు. వాక్య జ్ఞానముతో ఆలోచన చేయకపోవడము వలనే మనుష్యుడు చేతులతో చేయబడిన వాటిని పూజిస్తున్నాడు. (అపొ..కార్య. 17: 25:26).

 హెచ్చరిక : అద్వితీయ సత్య దేవుడెవరో సరైన అవగాహన లేకుండా మీ నోటికి వచ్చింది మాట్లాడినా లేక మీ ఆలోచనలు గ్రంథము మీద రుద్ది దేవుని క్రమాన్ని పాడుచేసినా నిత్యజీవం కోల్పోతారు జాగ్రత్త!!!

ఇట్లు,
మీ ఆత్మీయులు 

Share this

Related Posts

Previous
Next Post »

10 comments

comments
ఉదయ్ కుమార్
Jun 8, 2017, 3:27:00 PM delete

బ్రదర్ మనోహర్ మిమ్మలి ఇంకా మన ఒకే ఒక్క దేవుడు మరింత బలంగా వాడుకోవాలి అని నా వ్యక్తిగతమైన ప్రాద్దన లో మిమ్మలి జ్ఞాపకము చేసుకుంటాను. చాల మంచి పోస్ట్లు పెడుతూ అనేక మందికు సహాయ పడుతున్నారు మీకు నా వందనములు బ్రదర్.

Reply
avatar
Anil
Jun 8, 2017, 3:39:00 PM delete

క్రీస్తు దేవుడు కాదా? బ్రదర్ Km

Reply
avatar
ఉదయ్ కుమార్
Jun 8, 2017, 4:09:00 PM delete

క్రీస్తు మనకి ప్రభువు బ్రదర్ అనిల్
వందనములు
( 1 కొరింది 8:5-6 ఎపేసి 4:4-6 అపో 2:36 )

Reply
avatar
Jun 8, 2017, 8:05:00 PM delete

క్రీస్తు మనకి ప్రభువుగా నియమింపబడ్డారు బ్రదర్ అపో.కార్య. 2:36 చుడండి

దేవుని చిత్తము ఐతే "క్రీస్తు దేవుడు కాడా"..? ఆనే అంశమును త్వరలో రాసి పోస్ట్ చేస్తాను. అంత వరకు కాస్త వేచి ఉండగలరు సోదరా.

Reply
avatar
Oct 10, 2021, 10:02:00 PM delete

రోమీయులకు 9: 5
పితరులు వీరివారు; శరీరమునుబట్టి క్రీస్తువీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారియైన దేవుడైయుండి నిరంతరముస్తోత్రార్హుడై యున్నాడు. ఆమేన్‌.

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16