![]() |
| "సామెతలు 8వ అధ్యా., క్రీస్తుని గూర్చా"..? |
నా తోటి విస్వాసులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.
ఈనాడు అనేకమంది క్రైస్తవ సహోదరులు “సామెతలు 8”వ అధ్యాయము క్రీస్తుని గూర్చే చెప్పబడినదని అనుకొనుచు తమస్వకీయనాశనమునకు అపార్థము చేసుకొనుచున్నారు. (2 పేతురు. 3:16)
1) రాజైన సోలోమోనుని ప్రవక్తగా భావిస్తూ సామెతలు 8వ అధ్యా., లో విషయములు యేసుక్రీస్తు వారి గూర్చి అని వక్రీకరించుట.
2) సామెతలు 8వ అధ్యా., లోని 1వ వచనమును బట్టి; “జ్ఞానము” అనే మాటకి “క్రీస్తే” అని వక్రీకరించుట.
3) సామెతలు 8వ అధ్యా., లోని 2 నుండి 4 వచనములను బట్టి; ఈ జ్ఞానము అనగా క్రీస్తు త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడిమార్గములలోను నిలుస్తూ గుమ్మములయొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గవునులయొద్దనుఆయన నిలువబడి గట్టిగా ప్రకటన చేయుచున్నారు అని వక్రీకరించుట.
4) సామెతలు 8వ అధ్యా., లోని 21వ వచనమును బట్టి; క్రీస్తుని ప్రేమించువారిని ఈ లోకములో ఆస్తికర్తలుగా చేయువాడని వక్రీకరించుట.
5) సామెతలు 8వ అధ్యా., లోని 22వ వచనమును బట్టి; యెహోవా వారు పూర్వకాలమందే ప్రధమమైనదానిగా క్రీస్తుని కలుగజేసారని వక్రీకరించుట.
6) సామెతలు 8వ అధ్యా., లోని 23 నుండి 29 వచనములను బట్టి; యెహోవా వారు క్రీస్తు ని సృష్టికి ముందే పుట్టి౦చియున్నారని వక్రీకరించుట.
7) సామెతలు 8వ అధ్యా., లోని 30వ వచనమును బట్టి; క్రీస్తు వారు ప్రధానశిల్పియై యెహోవా సన్నిధిని ఆనందిoచుచున్నారని వక్రీకరించుట.
8) సామెతలు 8వ అధ్యా., లోని 35వ వచనమును బట్టి; క్రీస్తుని కొనిగొనువాడు జీవమును కనుగొనాలని వక్రీకరించుట.
ఈ విధముగా అనేకమంది సత్య వాక్యమును సరిగా విభజన చేయక (2 తిమోతి. 2:15) లేఖనములను అపార్థము చేసుకొనుచు తమకు తామే శేఘ్రముగా నాశనము కలుగజేసికొనుచున్నారు (2 పేతురు. 2:1).
వక్రీకరించబడుతున్న వాటి యొక్కగ్రంధ వివరణ:
» 1) దావీదు కుమారుడైన సోలోమోను రాజుగా నియమింపబడ్డాడు కానీ ప్రవక్త కాదు (1 రాజులు. 1:43; సామెతలు. 1:1) ఈయన తన రాజ్యములో అందరికంటే జ్ఞానవంతుడై ఉండి మూడువేల సామెతలు రచించెను (1 రాజులు. 4:32). ఈయన చేత వ్రాయబడినవి సామెతలు కాని ప్రవచనములు కాదు (సామెతలు. 1:2-4).
అంతట ఆయన - మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తలగ్రంథములలోను కీర్తనలలోను నన్నుగూర్చి వ్రాయబడినవన్నియు నెరవేరవలెనని నేను మీయొద్దఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితోచెప్పెను. – (లూకా. 24:44).
పై వచనమును బట్టి రాజైన సోలోమోను రచించిన సామెతలు గ్రంధములో వ్రాయబడినవి ప్రవచనములు కావు .
» 2) సామెతలు 8వ అధ్యా., లోని జ్ఞానము అనే పదము సృష్టికి సంబంధించినది. గ్రంధకర్త ఈ జ్ఞానము అనే పదమును వ్యక్తీకరనాలంకారములో చెప్పడం జరిగినది.
ఉదా: సామెతలు 8వ అధ్యా., లోని తన, నన్ను, నేను, నావలన
ఓ మరణమా, నీ విజయమెక్కడ? ఓ మరణమా, నీ ముల్లెక్కడ? (1 కోరింధి. 15:55). ఈ వచనములో మరణము అనే పదము ఒక మనిషిని గూర్చి వర్ణించుట లేదు కాని వ్యక్తీకరనాలంకారములో చెప్పబడినది.
సామెతలు 8వ అధ్యా., లోని సృష్టికి సంబంధించిన ఈ జ్ఞానమును (సామెతలు. 8:1) సిలువను గూర్చిన ఆత్మీయ జ్ఞానముతో(క్రీస్తుతో) (1 కోరింధి. 1:18-32)పోల్చి చూడడం దేవుని వాక్యమును వక్రీకరించడమే.
పిలువబడినవారికే అనగా క్రీస్తు సంఘమునకు (church of Christ) క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై యున్నాడు (1 కొరింధి. 1:24). యిట్టి క్రీస్తు జ్ఞానమును సామెతలు 8వ అధ్యా., లో చెప్పబడిన సృష్టి జ్ఞానముతో పోల్చి చూడడం దేవుని వాక్యమును వక్రీకరించడమే.
క్రీస్తు మనకు జ్ఞానమును (సిలువను గూర్చిన జ్ఞానము) నీతియుపరిశుద్ధతయు విమోచనమాయెను. - (1 కోరింధి 1:31).
» 3) ప్రవక్తయైన యెషయా క్రీస్తుని గూర్చి ముందుగా ప్రవచించిన ప్రవచనమేమనగా:
ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడునా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మనుఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయముకనుపరచును. “అతడు కేకలు వేయడు అరువడు తనకంఠస్వరము వీధిలో వినబడనియ్యడు”. (యెషయా. 42:1-2).
పై వచనమును బట్టి సామెతలు 8వ అధ్యా., 2 నుండి 4 వచనములను బట్టి క్రీస్తు కేకలు వేయడు అరువడు తనకంఠస్వరము వీధిలో వినబడనియ్యడు కనుక సామెతలు 8వ అధ్యా., లో చెప్పబడిన జ్ఞానము అనే మాట క్రీస్తుకి సంబంధించినది కాదు.
» 4) సామెతలు 8వ అధ్యా., 21 లోని చెప్పబడిన“నన్ను ప్రేమించువారిని ఆస్తికర్తలుగా చేయుదును వారినిధులను నింపుదును” ఈ మాట క్రీస్తే చెప్పియున్నాడని అని అనుకున్నచో నీవు వాక్యమను అపార్ధము చేసుకున్నట్టే ఎందుకనగా ధనవంతుడుపరలోకరాజ్యములో ప్రవేశించుటకంటె సూదిబెజ్జములో ఒంటె దూరుట సులభము. (మత్తయి. 19:24; మార్కు. 10:25).
భూమి మీద మీకొరకు ధనము కూర్చుకొనవద్దు. (మత్తయి. 6:19).
పై వచనమును బట్టి చూస్తే సామెతలు 8వ అధ్యా., 21 లో ధనమును గూర్చి చెప్పబడిన ఆ మాటను క్రీస్తు చెప్పుటలేదు.
» 5) అతడు తండ్రిలేనివాడును తల్లిలేనివాడునువంశావళిలేనివాడును, జీవితకాలమునకు ఆదియైననుజీవనమునకు అంతమైనను లేనివాడునైయుండిదేవుని కుమారుని పోలియున్నాడు. (హెబ్రీ. 7:3)
క్రీస్తు దేవుని సృష్టి కి ఆదియునైనవాడు. (ప్రకటన. 3:14)
పై వచనమును బట్టి క్రీస్తు వారు ఆదియు అంతము లేనివాడై , ఆదియందు దేవునియెద్ద ఉన్నవాడు కనుక సామెతలు 8వ అధ్యా., లోని 22వ వచనము సృష్టి జ్ఞానము గూర్చి చెప్పబడినది కాని క్రీస్తుని గూర్చి కాదు.
» 6) ఆదియందు వాక్యముండెను, వాక్యముదేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను. (యోహాను. 1:1). ఆ వాక్యము శరీరధారియై,కృపాసత్య సంపూర్ణుడుగా మనమధ్య నివసించెను. (యోహాను. 1:14).
“దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తనఅద్వితీయకుమారుడుగాపుట్టిన వానియందు విశ్వాసముంచుప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయననుఅనుగ్రహించెను”. (యోహాను. 3:16).
పై వచనమును బట్టి ఆదిలో తండ్రియెద్ద ఉన్న వాక్యము (logos) అద్వితీయకుమారుడుగా మనమధ్య పుట్టెను (మత్తయి. 2:1; లూకా. 2:11; యోహాను. 7:42) కనుక సామెతలు 8వ అధ్యా., లోని 23 నుండి 29 వచనములను బట్టి యెహోవా వారు సృష్టికి ముందే క్రీస్తుని పుట్టి౦చియున్నారని చెప్పడం దేవుని వాక్యమును వక్రీకరించడమే.
» 7) తన జ్ఞానముచేత ఆయన ఆకాశమునుకలుగజేసెను ఆయన కృప నిరంతరముండును. (కీర్తన. 136:5). యెహోవా, నీ కార్యములు ఎన్నెన్నివిధములుగా నున్నవి జ్ఞానముచేత నీవు వాటన్నిటినినిర్మించితివి నీవు కలుగజేసినవాటితో భూమినిండియున్నది.(కీర్తన. 104:24). మనకు ఒకేదేవుడున్నాడు. ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగెను ఆయన నిమిత్తముమనమున్నాము. (1 కోరింధి. 8:6)
పై వచనమును బట్టి యెహోవా తన జ్ఞానము చేత సృష్టినంతటిని కలుగజేసెను సామెతలు 8వ అధ్యా., 30వ వచనములో చెప్పబడిన నేను (సృష్టి జ్ఞానము) యెహోవాయెద్ద ఉన్నది.
» 8) లేఖనములయందు మీకు నిత్యజీవము కలదనితలంచుచు వాటిని పరిశోధించుచున్నారు; అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. (యోహాను. 5:39)
క్రీస్తే నిత్యజీవమై ఉన్నాడు కనుక క్రీస్తునందున్న మనము జీవమును ప్రత్యేకముగా కనుగొన్న అవసరము లేదు . (యోహాను. 8:12; 14:6)
పై వచనమును బట్టి సామెతలు 8వ అధ్యా., 35 వచనములోని చెప్పబడినట్టుగా “నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును” అను ఈ మాట క్రీస్తుని గూర్చి చెప్పబడుటలేదు







