తండ్రి + కుమారుడు = ఇద్దరు (కొందఱు యొక్క సాక్ష్యము).

 అంశము:: తండ్రి + కుమారుడు = ఇద్దరు (కొందఱు యొక్క సాక్ష్యము).


నా సహోదరులారా, మీ అందరుకి మన ప్రభువువైన యేసుక్రీస్తు వారు నామములో నా వందనములు.

మొదటి సాక్ష్యము - "యేసు బాప్తిస్మము పొందిన తరువాత తండ్రినైనా దేవుడు తన కుమారుడును గూర్చి సాక్ష్యము ఇచ్చుట".

మత్తయి 3: 17
ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
● "నా ప్రియ కుమారుడు" -- యేసుక్రీస్తు.
● "ఆకాశము నుండి కలిగిన శబ్దము" -- యెహోవా.

రెండో సాక్ష్యము -  సేన అనే వ్వక్తిలో ఉండే దెయ్యము యొక్క సాక్ష్యము.

మార్కు 5: 7
#యేసూ, సర్వోన్నతుడైన #దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని #దేవునిపేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను.

●"దేవుని కుమారుడు" -- "యేసుక్రీస్తు"
 ●"దేవుడు" -- "యెహోవా"

మూడో సాక్ష్యము - "సిలువ మీద ప్రాణము విడిచె ముందు యేసు వారు చివరిగా పలికిన మాట".

 లూకా 23: 46
యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రీ, నీ చేతికి నాఆత్మనుఅప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.

 ● తండ్రి -- యెహోవా (దేవుడు).
 ● నా ఆత్మ అప్పగించుకొనుచున్నా -- యేసుక్రీస్తు (ప్రభువు).

నాలుగో సాక్ష్యము - "యేసుక్రీస్తు వారు యొక్క సాక్ష్యము"

యేసు వారు ఎక్కడ ఈ లోకమునకు వచ్చారో, మరల ఈ లోకమును విడిచి ఎక్కడకి వెల్లుచున్నాను అనేది అయన యొక్క శిష్యులుకి ముందుగా తెలియజేయుట.

యోహాను 16: 28
నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకువెళ్లుచున్నానని వారితో చెప్పెను.

 "నేను" -- "యేసుక్రీస్తు".
 "తండ్రి యొద్ద నుండి/యొద్దకు" -- "యెహోవా".

ఐదో సాక్ష్యము - "సిలువ వేయబడిన యేసును ఎవరు లేపారు అనే విషయమును మనకి మొదటి శతాబ్దాపు అపోస్తలలు సాక్ష్యమిస్తున్నారు".

 అపో.కార్యములు 2: 32
ఈ యేసును దేవుడు లేపెను; దీనికి(లేక, ఈయనకు) మేమందరము సాక్షులము.

● "యేసు" -- "దేవుని కుమారుడు".
 "దేవుడు" -- "యెహోవా".

ఆరో సాక్ష్యము -  మనకి ప్రభువు ఎవరు!? మనకి దేవుడు ఎవరు?

దేవుని ఆత్మ ప్రేరణ ద్వార తెలియపరిచిన పౌల్ గారు యొక్క సాక్ష్యము.

1కోరింథీయులకు 8: 6
మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.

● మనకు దేవుడు ఒక్కడే -- తండ్రి (యెహోవా).
 మనకు ప్రభువు ఒక్కడే -- దేవుని కుమారుడు (యేసుక్రీస్తు).


సాతాను బోధ 

A). తండ్రినైనా దేవుడు వారు శరీరదారియే యేసుక్రీస్తు వారులా వచ్చారు -- (వాక్యము లేదు).
B). తండ్రి మన కొరకు సిలువ వేయబడ్డారు -- (వాక్యము లేదు).
C). తండ్రి - యేసుక్రీస్తు - (వాక్యము లేదు).
D). తండ్రి వారు క్రీస్తులా వచ్చి మనకి మాదిరి చూపారు -- (వాక్యము లేదు)...etc


ప్రియులారా.... ఇటువంటి సాతాను మాటలు చెపుతూ మిమ్మలి ఎవరు మోసము చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి.

 1యోహాను 2: 22
"తండ్రిని, కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి".


నేటి క్రైస్తవ్యములో కొందరూ బోధకులు సాతానుకు లోబడి అనేక మందికి వాడి ప్రవేశపెట్టిన బోధలును ప్రకటన చేయిస్తూ, ప్రపంచములో అసత్యమును ఎదుగుటకు సహాయకులుగా వినియోగపరచుకుంటున్నాడు. జాగ్రత్త సుమా!!! #వందనములు.
మనోహర్.
క్రీస్తు సంఘము - (రోమా 16:16).

Share this

Related Posts

Previous
Next Post »

1 comments:

comments
Gowri
June 27, 2017 at 11:51 PM delete

Good explanation Brother

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16