"రక్షణ" (salvation)

క్రీస్తును మరియు సత్యముని అంగీకరించి, దేవుని చిత్తములో నడవాలని ఆసక్తి కలిగి క్రీస్తు సంఘములో చేర్చబడాలని ఆశిస్తున్న సహోదరీ, సహోదరులకు నా హృదయపూర్వక వందనములు.

ఈ లోకములో రక్షణ అనగా అనేక విధములైన అర్థములను మనము చూడగలము కాని నిజమైన రక్షణ మరియు సర్వ మానవాళి రక్షింపబడుటకు గల ఉన్న ఏకైక మార్గము యేసు ద్వారానే దొరుకుతుందని మొదట తెలుసుకోవాలి.

మన తండ్రియైన దేవుడు మన యెడల ప్రేమ కలిగి ఉన్నాడు తన బిడ్డలమైన మనము పాపమునకు దాసులు కాకూడదని, నిత్యజీవమును కోల్పోకూడదని, నరకమనే భయంకరమనే వేదన స్థలములోనికి మనము వెళ్లకూడదని ఎంతగానో కోరుకున్నాడు కనుక తండ్రి తనయొద్ద ఉన్న వాక్యమైయున్న దేవుడిని యేసుగా ఈ లోకమునకు పంపి, ఆ కుమారుని సిలువ మరణము ద్వారా మనకు విమోచన అనగా పాప క్షమాపణ కలుగజేయుచున్నాడు.


❣️ (మత్తయి.1:21): "ఆమె యొక కుమారుని కనును; తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను."

❣️ (రోమా. 5:6-11): "ఏలయనగా మనమింక బలహీనులమై యుండగా, క్రీస్తు యుక్తకాలమున భక్తిహీనులకొరకు చనిపోయెను.౹ నీతిమంతునికొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు; మంచివానికొరకు ఎవడైన ఒకవేళ చనిపోవ తెగింప వచ్చును.౹ అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను.౹ కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా "ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింపబడుదుము".౹ ఏలయనగా శత్రువులమై యుండగా, ఆయన కుమారుని మరణముద్వారా మనము దేవునితో సమాధానపరచబడినయెడల సమాధానపరచబడిన వారమై, ఆయన జీవించుటచేత మరి నిశ్చయముగా రక్షింపబడు దుము.౹ అంతేకాదు; మన ప్రభువైన యేసు క్రీస్తుద్వారా మనము దేవునియందు అతిశయపడుచున్నాము; ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధానస్థితి పొంది యున్నాము."

❣️ (1 యోహాను 4:10): "మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది.౹"


ఇటువంటి విమోచన నీవు కోరుకుంటే, నిత్యజీవము పొందాలని ఆశపడుతున్నట్లయితే ఆయన మార్గములను తెలుసుకోవాలి.


రక్షణ పొందుకొనుటకు 5 మార్గములు : 


వినాలి


» మొదట యేసుక్రీస్తుని గూర్చిన సువార్త వినాలి.

● వినుటవలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును. – (రోమా. 10:17).
క్రీస్తు ఏ ఏ సంగతులను బోధించమని ఆజ్ఞాపించాడో ఆ సంగతులన్ని మనము వినాలి.

● నేను మీకు ఏయే సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. – (మత్తయి. 28:20).

» మనకు ప్రకటింపబడిన సువార్తయందు విశ్వాసముంచి క్రీస్తు మన పాపముల నిమిత్తము మరణించాడని, మూడవ దినమున లేపబడ్డాడన్న ఉపదేశమును గట్టిగా పట్టుకొని యుండాలి.

● సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలుపుచున్నాను. మీరు దాని అంగీకరించితిరి, దానియందే నిలిచియున్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశరూపకముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొనియున్న పక్షమందు ఆ సువార్తవలననే మీరు రక్షణ పొందువారై యుందురు. నాకియ్యుబడిన ఉపదేశమును ముఖ్యమైనదిగా ఎంచి మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను. లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను. – (1 కొరింధి. 15:1-4).

● వారు విశ్వసింపనివానికి ఎట్లు ప్రార్ధన చేయుదురు? విననివానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువారు లేకుండ వారెట్లు విందురు?. – (రోమా. 10:14).
కాబట్టి సహోదరీ, సహోదరుడా రక్షణ పొందాలంటే నీవు ఖచ్చితంగా సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గూర్చిన సువార్త వినాలి.


నమ్మాలి

» నీవు రక్షణ పొందాలంటే యేసుక్రీస్తు సర్వోన్నతుడైన దేవుని కుమారుడని నమ్మాలి.

● అందుకు సీమోను పేతురు - నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. – (మత్తయి. 16:16).
యేసు దేవుని కుమారుడని నమ్మితేనే మన పాపముల విషయములో చనిపోతామని తెలుసుకోవాలి.
● నేను ఆయననని మీరు విశ్వసించినయెడల మీరు మీ పాపములలోనేయుండి చనిపోవుదురని వారితో చెప్పెను. – (యోహాను. 8:24).

» రక్షణ పొందాలంటే యేసు ప్రభువునందు విశ్వాసముంచాలి.

● ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పి
అతనికిని అతని ఇంటనున్నవారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. – (అపొ.కార్య. 16:30-32).
● నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మనివానికి శిక్ష విధింపబడును.(మార్కు. 16:16).
కాబట్టి ప్రియులారా, రక్షణ పొందాలంటే మొదట వినాలి, అటు తరువాత  వినిన దానిని నమ్మాలి.


మారు మనస్సు పొందాలి

» మూడవదిగా నీవు విన్న విషయములను నమ్మిన తరువాత, ఇంతకుముందు నీవు చేసిన ప్రతీ పాపము విషయములో మనస్సు మార్చుకుని దేవుని యెదుట పశ్చాత్తాపడాలి.

● ఆ అజ్ఞానకాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను; ఇప్పుడైతే అంతటను అందరును మారుమనస్సు పొందవలెనని మనుష్యలకు ఆజ్ఞాపించుచున్నాడు. – (అపొ.కార్య. 17:30-31).
● యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారుమనస్సును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడియున్నది. – (లూకా. 24:47).
● దైవచిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనస్సు కలుగజేయును. – (2 కొరింధి. 7:10).
● వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని- సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపొస్తలులను అడుగగా పేతురు - మీర మారుమనస్సుపొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. – (అపొ.కార్య. 2:37-38).

కావున ప్రియ సహోదరీ, సహోదరుడా నీవు వినిన విషయములను నమ్మాలి, నీవు చేసిన పాపముల విషయములలో మారు మనస్సు పొందాలి.


ఒప్పుకోవాలి 

పైన చెప్పబడిన అన్ని విషయముల కంటే ఇది చాల కీలకమైనది ఎందుకనగా ఈనాడు క్రైస్తవులలో అనేకమంది క్రీస్తుని ఒప్పుకునే  విషయములో పొరబడుతున్నారు.

» యేసుక్రీస్తు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి.

● అందుకు సీమోను పేతురు -నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. – (మత్తయి. 16:16).
● మనుష్యులయెదుట నన్ను ఒప్పుకొనువాడెవడో పరలోకమందున్న నా తండ్రియెదుట నేను వానిని ఒప్పుకొందును. – (మత్తయి. 10:32).

» అన్నిటికంటే ముఖ్యముగా క్రీస్తు తను ఒక  సంఘమును నిర్మించియున్నాడని, ఆ సంఘమునకు ఆయన నామమే పెట్టుకున్నాడని, ఆ సంఘము ద్వారానే నిత్యజీవము పొందుకోగలమని, ఆ సంఘము క్రీస్తు సంఘమని (Church of Christ) ఒప్పుకోవాలి.

● నీవు పేతురువు, ఈ బండమీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దానియెదుట నిలువనేరవని నేను నీతో చెప్పుచున్నాను. – (మత్తయి. 16:18).
● మరి ఎవనివలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలెనుగాని, ఆకాశముక్రింద మనుష్యులలో 
ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము.(అపొ.కార్య. 4:12).
● వేయబడినది తప్ప మరియొక పునాది ఎవడును వేయనేరడు; ఈ పునాది యేసుక్రీస్తే. – (1 కోరింధి. 3:11).
● (ఆ సంఘము) ఆయన శరీరము అది సమస్తమైన వాటిలో ఉండి సమస్తమైన వాటిని నింపుచున్న వానితో నింపబడినదై యున్నది. – (ఎఫెసీ. 1:23).
● సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. – (కొలస్సి. 1:18).

నీవు రక్షింపబడాలంటే యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని, దేవుడు ఆయనని మృతులలో నుండి లేపాడని విశ్వసించాలి.

● యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును– (రోమా. 10:8-10).


బాప్తీస్మము పొందాలి

ప్రియ సహోదరీ, సహోదరుడా యేసుక్రీస్తు సువార్తను వినిన నీవు ఆయన మాటలను నమ్మాలి, నీ పాపముల విషయములో మారుమనస్సు పొందాలి, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకుని అయితే ఇవన్ని చేసిన నీవు క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆ ఒక్క  సంఘములో అనగా క్రీస్తు సంఘములో (Church of Christ) చేర్చబడాలంటే ఖచ్చితంగా బాప్తీస్మము తీసుకోవాలి.

● ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. – (మార్కు. 16:16).
● పేతురు - మీర మారుమనస్సుపొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. – (అపొ.కార్య. 2:38).
● క్రీస్తు యేసులోకి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోకి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో (పాలుపొందుటకై ) ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి. – (రోమా. 6:3-4).
● మీరును బాప్తిస్మమందు ఆయనతోకూడ పాతి పెట్టబడినవారై ఆయనయందు సున్నతి పొందితిరి ఆ సున్నతి చేతులతో చేయబడునది కాదుగాని శరీరేచ్ఛాయుక్తమైన స్వభావమును విసర్జించుటయను క్రీస్తుకు (అనుకూలమైన) సున్నతియే. ఆయనను మృతులలోనుండి లేపిన దేవుడు కనుపరచిన ప్రభావమందు విశ్వాసముంచుటచేత ఆ బాప్తిస్మమువలన ఆయనతో కూడ లేచితిరి.(కొలస్సి. 2:12).
● సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది; అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదుగాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవునివిషయమై నిర్మలమైన మనస్సాక్షి కలిగియుండుటకు పూనుకొనుటయే. – (1 పేతురు. 3:21).


గమనిక : ఈ విషయముపై పూర్తి అవగాహనకు బాప్తీస్మము అంటే ఏమిటి? బాప్తీస్మము ఎలా తీసుకోవాలి? బాప్తీస్మము ఎందుకు తీసుకోవాలి? బాప్తీస్మము ఏ నామములో తీసుకోవాలి? అనే అంశములను చూడండి.


» » ఎవరైతే ఈ అయిదు విషయములను గ్రహిస్తారో వారు దేవుని కుమారుడు స్థాపించిన క్రీస్తు సంఘములో (Church of Christ) చేర్చబడతారు.

● మరియు వారేకమనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటరొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరివలన దయపొందినవారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్నవారిని అనుదినము చేర్చుచుండెను. – (అపొ.కార్య. 2:46-47).
● కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. – (2 కొరింధి. 5:17).

కాబట్టి ప్రియులారా, నీవు క్రీస్తు సంఘములో (Church of Christ)  చేర్చబడ్డావా, నిత్యజీవము పొందుకొనుటకు సిద్ధముగా ఉన్నావా? ఆలోచన చేయు. రక్షణ పొందుకో.

★ ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణదినము.(2 కొరింధి. 6:2).

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

Share this

Related Posts

Previous
Next Post »

2 comments

comments

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16