"అలంకరణ" (Adornment)

అలంకరణ



పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ప్రియులారా, మనలో అనేకమంది క్రైస్తవులమని చెప్పుకొనుచున్నారు కాని వారు తమ శరీరమును అలకరించుకునే విధము, భౌతిక సంబంధమైన అలంకారణ కొరకు ప్రాకులాడే విధము చూడగా  వారు క్రీస్తుని ధరించుకొన్నవారుగా అగుపడుటలేదు.

క్రైస్తవులమైన మనము ఏ విధమైన అలంకారణ కలిగియుండాలి? దేవుడు మన భౌతిక సంబంధమైన అలంకారణను కోరుకుంటున్నాడా? మనము ఈ లోకస్థులవలె జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడా?.....

నిజమైన క్రైస్తవుల అలంకారణ 

ఏలయనగా మనము పోరాడునది శరీరులతోకాదు. ప్రధానులతోను, అధికారులతోను, ప్రస్తుత అంధకార సంబధులగు లోకనాథులతోను, ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము.
అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చుసర్వాంగ కవచమును ధరించుకొనుడి. – (ఎఫెసీ. 6:12-13).

◆  వడ్డాణము లేదా బెల్టు :
ఏలయనగా మీ నడుముకు సత్యమును దట్టి కట్టుకొని..... – (ఎఫెసీ. 6:14).

◆  వస్త్రములు :
నీతియను మైమరువు తొడుగుకొని.. – (ఎఫెసీ. 6:14).

◆ చెప్పులు లేదా  జోడు :
పాదములకు సమాధాన సువార్తవలననైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొని నిలువబడుడి. – (ఎఫెసీ. 6:15).

◆  డాలు :
ఇవన్నియుగాక విశ్వాసమను డాలు పట్టుకొనుడి; దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటని ఆర్పుటకు శక్తిమంతులవుదురు. – (ఎఫెసీ. 6:16).

◆  శిరస్త్రాణము లేదా హెల్మెట్ :
మరియు రక్షణయను శిరస్త్రాణమును.... – (ఎఫెసీ. 6:17).

◆  ఖడ్గము లేదా కత్తి :
దేవుని వాక్యమను ఆత్మ ఖడ్గమును ధరిచుంకొనుడి. (ఎఫెసీ. 6:17).

● జడలు అల్లుకొనుటయు, బంగారునగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయునను వెలపటి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమను అక్షయాలంకారముగల మీ హృదయపు అంతరంగస్వభావముమీకు అలంకారముగా ఉండవలెను; అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. (1 పేతురు. 3:3-4).

● స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రములచేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక,
దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్ క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. (1 తిమోతి. 2:8-10).

పరిశుద్ధ గ్రంథము సాదువైనట్టియు, మృదువైనట్టియునైన గుణమును అలకరించుకోవాలని, అది దేవుని దృష్టికి మిగుల విలువగలదని సెలవిస్తుంది. ఇది క్రైస్తవ స్త్రీకి ఉండవలసిన అలంకారణ.

» ప్రియులారా గ్రంధములో తగుమాత్రపు వస్త్రములు అని ఉన్నది కనుక అసభ్యకరమైన వస్రములు ధరించుకొనుచున్నారు.
తగుమాత్రపు అంటే ఇంగ్లీషు లో MODEST అని ఉంది అనగా వినయపూర్వకమైన వారిగా, అణుకువ గలవారిగా తమను తాము కనపరుచుకోవాలనే విషయము తెలియని స్థితిలో ఉండి దేవుని నామాన్ని అవమాన పరిచే వారిగా ఉన్నారు.

● అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొని యాడబడును. – (సామెతలు. 31:30).

ప్రియ సహోదరుడా, గ్రంధములో స్త్రీ అలంకారణ గూర్చి మాత్రమే చెప్పబడినది కాని పురుషుని గూర్చి చెప్పబడలేదు కదా అనే ఆలోచన చేస్తే  నిన్ను నీవు మోసపుచ్చుకొన్నట్టే ఎందుకనగా మన పితరులు మరియు అప్పటి పురుషులకి ఎటువంటి అలంకారణ ఉండేది కాదు వారు కేవలము అంగీ వంటి వస్త్రములు ధరించుకొని తగుమాత్రము ధరించుకొన్నవారిగా ఉన్నారు. అయితే ప్రస్తుతమున్న లోకస్తులవలె చెవికి పోగులు పెట్టుకుని, చిరిగినా చొక్కాలు, ఫ్యాంట్లు వేసుకుని నిన్ను నీవు అవమాన పరుచుకోవడమే కాకుండా దేవుని నామాన్ని అవమాన పరుస్తున్నావు.

మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారానే అనేకమందిని దేవుని చెంతకు నడిపించాలని గ్రంథము చెప్తుంటే ఈనాడు క్రైస్తవులలో అనేకమంది వారి అలంకారణ ద్వారా, వారి సౌందర్యమును ప్రేమించుటలో ఎక్కువ ఆసక్తి చూపిస్తూ, దేవునికిచ్చే సమయమును సైతము పక్కన పెట్టి ఎదుటివారి మనసాక్షిని బలహీన పరిచే వారిగా ఉన్నారు.

ప్రియ సహోదరీ, సహోదరుడా, నీవు ఏ విధముగా అలంకరించుకుంటున్నావు? నీ బాహ్య సౌందర్యమును కోరుకుంటున్నావా లేక ఆత్మీయ జీవితమునా? ఆలోచన చేసి ఎదుటివారిని దేవుని చెంతకు నడిపించే విధముగా మన జీవితమూ ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు కనుక మనము దేవుడు కోరుకున్నటుగా జీవించాలని నన్ను నేను హెచ్చరిక చేసుకొనుచూ మీకు  మనవి చేయు చున్నాను.

ఎందుకనగా,
★  భూమిమీద మన గుడారమైన యీ నివాసము (శరీరము) శిథిలమైపోయినను, చేతిపనికాక దేవునిచేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని యెరుగుదము. (2 కొరింధి. 5:1). 

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

Share this

Related Posts

Previous
Next Post »

4 comments

comments

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16