తండ్రి + కుమారుడు = ఇద్దరు (కొందఱు యొక్క సాక్ష్యము).

 అంశము:: తండ్రి + కుమారుడు = ఇద్దరు (కొందఱు యొక్క సాక్ష్యము).


నా సహోదరులారా, మీ అందరుకి మన ప్రభువువైన యేసుక్రీస్తు వారు నామములో నా వందనములు.

మొదటి సాక్ష్యము - "యేసు బాప్తిస్మము పొందిన తరువాత తండ్రినైనా దేవుడు తన కుమారుడును గూర్చి సాక్ష్యము ఇచ్చుట".

మత్తయి 3: 17
ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయనయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
● "నా ప్రియ కుమారుడు" -- యేసుక్రీస్తు.
● "ఆకాశము నుండి కలిగిన శబ్దము" -- యెహోవా.

రెండో సాక్ష్యము -  సేన అనే వ్వక్తిలో ఉండే దెయ్యము యొక్క సాక్ష్యము.

మార్కు 5: 7
#యేసూ, సర్వోన్నతుడైన #దేవునికుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచకుమని #దేవునిపేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను.

●"దేవుని కుమారుడు" -- "యేసుక్రీస్తు"
 ●"దేవుడు" -- "యెహోవా"

మూడో సాక్ష్యము - "సిలువ మీద ప్రాణము విడిచె ముందు యేసు వారు చివరిగా పలికిన మాట".

 లూకా 23: 46
యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రీ, నీ చేతికి నాఆత్మనుఅప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.

 ● తండ్రి -- యెహోవా (దేవుడు).
 ● నా ఆత్మ అప్పగించుకొనుచున్నా -- యేసుక్రీస్తు (ప్రభువు).

నాలుగో సాక్ష్యము - "యేసుక్రీస్తు వారు యొక్క సాక్ష్యము"

యేసు వారు ఎక్కడ ఈ లోకమునకు వచ్చారో, మరల ఈ లోకమును విడిచి ఎక్కడకి వెల్లుచున్నాను అనేది అయన యొక్క శిష్యులుకి ముందుగా తెలియజేయుట.

యోహాను 16: 28
నేను తండ్రియొద్దనుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను; మరియు లోకమును విడిచి తండ్రియొద్దకువెళ్లుచున్నానని వారితో చెప్పెను.

 "నేను" -- "యేసుక్రీస్తు".
 "తండ్రి యొద్ద నుండి/యొద్దకు" -- "యెహోవా".

ఐదో సాక్ష్యము - "సిలువ వేయబడిన యేసును ఎవరు లేపారు అనే విషయమును మనకి మొదటి శతాబ్దాపు అపోస్తలలు సాక్ష్యమిస్తున్నారు".

 అపో.కార్యములు 2: 32
ఈ యేసును దేవుడు లేపెను; దీనికి(లేక, ఈయనకు) మేమందరము సాక్షులము.

● "యేసు" -- "దేవుని కుమారుడు".
 "దేవుడు" -- "యెహోవా".

ఆరో సాక్ష్యము -  మనకి ప్రభువు ఎవరు!? మనకి దేవుడు ఎవరు?

దేవుని ఆత్మ ప్రేరణ ద్వార తెలియపరిచిన పౌల్ గారు యొక్క సాక్ష్యము.

1కోరింథీయులకు 8: 6
మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయన ద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయన ద్వారా కలిగిన వారము.

● మనకు దేవుడు ఒక్కడే -- తండ్రి (యెహోవా).
 మనకు ప్రభువు ఒక్కడే -- దేవుని కుమారుడు (యేసుక్రీస్తు).


సాతాను బోధ 

A). తండ్రినైనా దేవుడు వారు శరీరదారియే యేసుక్రీస్తు వారులా వచ్చారు -- (వాక్యము లేదు).
B). తండ్రి మన కొరకు సిలువ వేయబడ్డారు -- (వాక్యము లేదు).
C). తండ్రి - యేసుక్రీస్తు - (వాక్యము లేదు).
D). తండ్రి వారు క్రీస్తులా వచ్చి మనకి మాదిరి చూపారు -- (వాక్యము లేదు)...etc


ప్రియులారా.... ఇటువంటి సాతాను మాటలు చెపుతూ మిమ్మలి ఎవరు మోసము చేయకుండా జాగ్రత్తగా చూసుకోండి.

 1యోహాను 2: 22
"తండ్రిని, కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి".


నేటి క్రైస్తవ్యములో కొందరూ బోధకులు సాతానుకు లోబడి అనేక మందికి వాడి ప్రవేశపెట్టిన బోధలును ప్రకటన చేయిస్తూ, ప్రపంచములో అసత్యమును ఎదుగుటకు సహాయకులుగా వినియోగపరచుకుంటున్నాడు. జాగ్రత్త సుమా!!! #వందనములు.
మనోహర్.
క్రీస్తు సంఘము - (రోమా 16:16).
దేవుని గూర్చిన సత్యము

దేవుని గూర్చిన సత్యము

దేవుని గూర్చిన సత్యము

దేవుడు అనే పదము అందరికి తెలిసింది కానీ దేవుడు అంటే మాత్రము చాలా మందికి తెలియలేదు. #Km

👀 మరి దేవుడు ఎవరు..?

✍ "దేవుడు ఆత్మ" - (యోహాను - 4:24) & "దేవుడు ఒక్కడే అయన మన తండ్రి" - (1 కోరింది 8:6).
* దేవుడు సర్వశక్తిమంతుడు - (ఆది"కా - 17:1)
* దేవుడు సర్వాంతర్యామి - (యిర్మీయ -23:23)
* దేవుడు సర్వజ్ఞానం గలవాడు - (కీర్తన - 139:1-5)
* దేవుడు నిత్యుడు - (నిర్గమ 3:14)
* దేవుడు ప్రేమమాయుడు - (1యోహాను - 4:8)
* దేవుడు అక్షయుడు - (1తిమోతి - 1:17)
* దేవుడు అమారత్వము గలవాడు - (1తిమోతి - 6:16)
* దేవుడు జీవము గలవాడు - (ఆపో"కా - 14:15)
* దేవుడు సృష్టికర్త - (రోమా - 1:25)
* దేవుడు కాపాడువాడు - (కీర్తన - 121:4)
* దేవుడు పరిశుద్ధుడు -  (యెషయా - 6:3)
* దేవుడు దహించు ఆగ్ని - (హెబ్రీ - 12:9)
* దేవుడు సత్యవంతుడు - (రోమా - 3:4)
* దేవుడు సమాధాన కర్త - (1కోరింది - 14:33)
* దేవుడు నాయ్యవంతుడు - (కీర్తన - 89:14)
* దేవుడు నీతిమంతుడు - (కీర్తన - 11:7)
* దేవుడు కనికరం గలవాడు - (ద్వితీ"కా - 4:31)
* దేవుడు సైన్యములకధిపతి - (యెషయ -10:23)
* దేవుడు అద్వితీయుడు - (యోహాను - 17:3)
* దేవుడు ఉగ్రుడు - (రోమా - 1:18)
* దేవుడు రోషము గలవాడు - (నిర్గమ 34:14).

👪 క్రీస్తు సంఘము - రోమా 16:16

"మెలకువ" (awake)

 "పరిశుద్ధులు ఏ విషయములో మెలకువ కలిగి ఉండాలి"..?

నా తోటి పరిశుద్ధులుకు, మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

■ "మెలకువ" అనగా  "అప్రమత్తంగా, మేలుకొని, శ్రద్ధగల, కనిపెట్టుకొని, నిద్రలేనట్టి, జాగ్రత్తగా" అని అర్ధము.

● విశ్వాసమందు మెలుకువ కలిగి ఉండవలెను - (1 కోరింది 16:13; 2 కోరింది 13:5).
● మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించు విషయములో మెలకువ కలిగి ఉండవలెను - (ఎపేసి 5:20; కొలసి 3:17; 4:2)
● మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువ కలిగి ఉండవలెను - (మత్తయి 26:41; 1 కోరింది 10:13; యాకోబు 1:12).
● స్వస్థబుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుట విషయములో, సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయు విషయములో, మరియు మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువ కలిగి ఉండవలెను. -  (1 పేతురు 4:7; ఎపేసి 6:18; లూకా 21: 36).
● ఆ దినము (క్రీస్తు రెండో రాకడ) గూర్చి మనకి తెలియదు కాబట్టి మనము మెలువ కలిగి ఉండవలెను - (మతాయి 24:42-43; 25:13; లుకా 12:39; 1 దెస్స 5:6; 2 పేతురు 3:12; ప్రకటన 16:16).
● అపవాది విషయములో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ కలిగి ఉండవలెను - (1 పేతురు 5:8).
● సత్యములో, సత్య ప్రకటన విషయములో మెలుకువ కలిగి ఉండవలెను - (1 తిమోతి 4:16; 2 తిమోతి 2:15; 4:5).

◆  నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా నుండుడనెను. (మార్క 13:37).

"మనోహర్ బాబు గుడివాడ" 

The churches of Christ greet you - Roma 16:16