![]() |
"పరిశుద్ధులు ఏ విషయములో మెలకువ కలిగి ఉండాలి"..? |
నా తోటి పరిశుద్ధులుకు, మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.
■ "మెలకువ" అనగా "అప్రమత్తంగా, మేలుకొని, శ్రద్ధగల, కనిపెట్టుకొని, నిద్రలేనట్టి, జాగ్రత్తగా" అని అర్ధము.
● విశ్వాసమందు మెలుకువ కలిగి ఉండవలెను - (1 కోరింది 16:13; 2 కోరింది 13:5).
● మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించు విషయములో మెలకువ కలిగి ఉండవలెను - (ఎపేసి 5:20; కొలసి 3:17; 4:2)
● మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువ కలిగి ఉండవలెను - (మత్తయి 26:41; 1 కోరింది 10:13; యాకోబు 1:12).
● స్వస్థబుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుట విషయములో, సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయు విషయములో, మరియు మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువ కలిగి ఉండవలెను. - (1 పేతురు 4:7; ఎపేసి 6:18; లూకా 21: 36).
● ఆ దినము (క్రీస్తు రెండో రాకడ) గూర్చి మనకి తెలియదు కాబట్టి మనము మెలువ కలిగి ఉండవలెను - (మతాయి 24:42-43; 25:13; లుకా 12:39; 1 దెస్స 5:6; 2 పేతురు 3:12; ప్రకటన 16:16).
● అపవాది విషయములో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ కలిగి ఉండవలెను - (1 పేతురు 5:8).
● సత్యములో, సత్య ప్రకటన విషయములో మెలుకువ కలిగి ఉండవలెను - (1 తిమోతి 4:16; 2 తిమోతి 2:15; 4:5).
◆ నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా నుండుడనెను. (మార్క 13:37).
"మనోహర్ బాబు గుడివాడ"
Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.
📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️
📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com