"దేవుని కుమారుడు" (Son of God)

అంశము : దేవుని కుమారుడు (son of God).

సహోదరులందరికిని మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

నా ప్రియులారా, క్రైస్తవ్యములో అనేకమంది మనుష్యులలో బోధలు, సిద్ధాంతాలు, ఆలోచనలు చోటు చేసుకోవడము వలన "దేవుని కుమారుని గూర్చిన జ్ఞానవిషయములో సరైన ఏకత్వము లేకపోవడము" వలన సంపూర్ణ పురుషులు కాలేకపోతున్నారు.


క్రైస్తవ్యములో మూడు రకాల కట్టు కథలు


1). తండ్రియైన యెహోవా దేవుడే కుమారుడుగా (యేసుక్రీస్తుగా) ఈ లోకమునకు శరీరధారియై వచ్చారని.
2). జగత్తు పునాది వేయబడక మునుపే యేసు దేవుని కుమారుడుగా పిలువబడ్డారని.
3). అనాదిలో యెహోవా దేవుడు యేసును సృష్టించారని.

ఈ లోకములో దేవుని కుమారుని గూర్చిన  కట్టుకధలు అనేకమైనవి కలవు గాని ప్రస్తుతమున్న ముఖ్యమైన వాటిని పరిగణలోనికి తీసుకొని, వాక్య పరిశీలన చేసి, వాక్య ఆధారములుతో, మీ ముందు ఉంచాలని ఆశపడుచున్నాను.


A). "తండ్రి వారు ఈ లోకమునకు కుమారుడుగా వచ్చారా.."?.

(కాదు)

యోహాను 1: 1
ఆదియందు వాక్యముండెను(యేసుక్రీస్తు), వాక్యము దేవుని(యెహోవా) యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.

యోహాను 1: 14
వాక్యము(యేసుక్రీస్తు) శరీరధారియై, కృపాసత్యసంపూర్ణుడుగా మనమధ్య నివసించెను;
 తండ్రివలన(యెహోవా) కలిగిన అద్వితీయకుమారుని (యేసుక్రీస్తు) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి.

గమనిక :- "తండ్రివలన(యెహోవా) కలిగిన అద్వితీయకుమారుని(యేసుక్రీస్తు)".


B). "జగత్తు ముందే యేసు దేవుని కుమారుడా.. "?.

(కాదు).

యోహాను 1: 1
"....వాక్యము దేవుడై యుండెను"

యోహాను 3: 16
దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. కాగా ఆయన తన "అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు" విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను.

గమనిక :- "అద్వితీయకుమారునిగా పుట్టిన వాని యందు".


C). "తండ్రి అనాదిలో యేసును నిర్మించారా.."?

(లేదు).


● యేసు అనాది నుండి దేవత్వపు లక్షణములు కలిగి తండ్రితో సమానముగా ఉన్నారు.

ఆదికాండము 1: 26
దేవుడు "మన స్వరూపమందు"
"మన పోలికె చొప్పున" నరులను చేయుదము.
ఫిలిప్పీయులకు 2: 6
ఆయన "దేవుని స్వరూ పము" కలిగినవాడైయుండి, "దేవునితో సమానముగా" ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు.
కొలస్సీయులకు 2: 9
"దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత" శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది.

★ ఆదాము దేవుని కుమారుడుగా పిలువబడినప్పటికి (లూకా. 3:38). "దేవత్వము లక్షణములు కలిగినవాడు కాదు".


"దేవుని కుమారుని గూర్చిన వివరణ"


"దేవుని కుమారుడు" అనగా దేవుని ప్రజలను యుగయుగములు ఏలుబడి చేయువాడని అర్ధము.


■ "కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను;ఆయన స్త్రీయందు పుట్టి..." - (గలతి. 4:4).

■ అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను; ఆయన అనేకులను గూర్చి అన్నట్టునీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను; ఆ సంతానము క్రీస్తు. ( గలతి. 3:16).

■ "అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు..." (మత్తయి. 1:1).

■ పరమ తండ్రి ఏలుబడిని ఇశ్రాయేలు ప్రజలు విసర్జించి, తమకు లోకసంబంధమైన రాజును నియమించమని సమూయేలును కోరగా, సమూయేలు యెహోవా కి ప్రార్థన చేసి, యెహోవా మాట చొప్పున వారికి భౌతికసంబంధమైన మొదటి రాజును నియమించెను. - (1 సమూయేలు. 8:1-22; 9:2,17).

■ లోక సంబంధమైన అనేక మంది రాజులు ఇశ్రాయేలు ప్రజలను ఏలుబడి చేసి, యెహోవా ఆజ్ఞలను ధిక్కరించి, ఆయనకు విరోధముగా పాపము చేసిరి.

గనుక, యెహోవా ఈ లోక సంబంధమైన రాజులు పట్ల విసుగు చెంది "దావీదుతో చేయబడిన వాగ్దానము నేరవేర్చుటకే తన ప్రజలను  ఏలుబడి చేయుటకు, తన యొద్ద ఉన్న వాక్యమును(యేసుక్రీస్తు) దేవుని కుమారునిగా ఈ లోకములో పుట్టించెను." - (2 సమూయేలు. 7:12-16; యిర్మీయా. 23:5; లూకా. 1:32; యోహాను. 3:16).

■ దేవుని రాజ్య భారమును నిత్యము మోయుటకై తండ్రి వారు యేసును దేవుని కుమారునిగా పుట్టించెను. - (యెషయా. 9:6).

గమనిక:- తన కుమారుడు ఏలుబడి చేయుటకు నియమించిన రాజ్యము లోక సబంధమైనది కాదు. (యోహాను. 18:36).

■ తన ప్రజలు వారి పాపములు కొరకు యేసు మరణించి, సమాధి చేయబడి, మూడవ దినము తిరిగి లేచిన పిమ్మట (1 కొరింది. 15:3-4) తన వారుకి కనబడి నలభై దినములు వారికి బోధించి, సజీవునిగా కనపరుచుకొని (అపొ.కార్య. 1:4). అటు పిమ్మట, పరలోకమునకు ఆరోహణమయ్యి. (అపొ.కార్య. 1:9). మహా దేవుడు కుడిపార్శ్వమునకు హెచ్చింపబడెను. (అపొ.కార్య. 2:33).

■ తండ్రి ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించి (హెబ్రీ. 1:2). పాపముల విషయములో శుద్ధీకరణము చేసిన తన కుమారుని ఆనందతైలముతో అభిషేకించెను. (హెబ్రీ. 1:3; 9).

■ అటు పిమ్మట, దావీదు సింహాసనమును తన కుమారునికిచ్చి తన ప్రజలను ఏలుబడి చేయుటకు తనను "ప్రభువుగాను, క్రీస్తుగాను" నియమించెను. (లూకా.1:32; అపో.కార్య. 2:32-36).

■  అతని సింహాసనము "సూర్యుడున్నంతకాలము" నా సన్నిధిని ఉండుననియు.. "చంద్రుడున్నంతకాలము" అది నిలుచుననియు మింటనుండు సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిర పరచబడుననియు. - (కీర్తన. 88:35-36).


"దేవుని కుమారుని రాజ్యములో పాలు పొందుటకు మనము ఏమి చేయవలెను?".

● మనము "సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని" తన కుమారుని విశ్వసించాలి. (మత్తయి. 16:16).
● ఈయన తన ప్రజలను ఏలుబడి చేయుటకు వచ్చిన దేవుని కుమారునిగా గుర్తించాలి. (యోహాను. 1:49).
● బాప్తీస్మము పొంద గోరువారు "యేసు దేవుని కుమారునిగా అనగా నా రాజని, నన్ను శాస్వతమైన సింహాసనము  మీద కూర్చొని నన్ను ఏలుబడి చేయువాడని విశ్వసిస్తే, తన రాజ్యములోనికి చేర్చబడుతాడు. (అపొ.కార్య. 8:36; రోమా. 10:39; అపొ.కార్య. 2:38-40;47).
● దేవుని కుమారునియందలి అనగా అయన ఏలుబడి యందు ఉంటు విశ్వాసము వలన జీవించవలెను. (గలతి. 2:20).
● యేసు దేవుని కుమారుడని ప్రకటించవలెను. (అపో.కార్య. 9:20).
● యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మిన యెడల జీవము పొందుకోగలము. (యోహాను. 20:31).
● యేసు దేవుని కుమారుడుగా నమ్మే వాడు తన హృదయములో యేసును ప్రతిష్టంచుకొని (1పేతురు. 3:15), తన ఏలుబడిలో ఉంటూ, ఇక మీదట జీవించువాడిని నేను కాదు ఆయనే అనే ఆలోచన గలిగిన వారుకి మాత్రమే యేసు వారు దేవుని కుమారునిగా ఉంటారు.
● మనలో "దేవుని కుమారుని గూర్చిన జ్ఞానవిషయములో ఏకత్వము పొందాలి అనుకుంటే అపొస్తలుల బోధ వలన మాత్రమే సాధ్యము. (యోహాను. 17:20-22)


1యోహాను 2: 22
యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.

"మనోహర్ బాబు గుడివాడ" ©

Share this

Related Posts

Previous
Next Post »

19 comments

comments
Pradeep
May 15, 2017 at 5:59 PM delete

Amen Good post Brother KM

Reply
avatar
Srinivas Reddy
May 15, 2017 at 6:03 PM delete

వందనములు అన్న. మీరు రాసే ప్రతి పోస్ట్ చూస్తున్నా చాల బాగా రాస్తున్నారు. థాంక్స్. మాకు చాలా ఉపయోగపడుతున్నాయి. మీరు ఇక్కడ సేవ చేస్తున్నారో తెలియజేయగలరా..?

Reply
avatar
Anil
May 15, 2017 at 9:17 PM delete

Anna, first time vintunna Jesus jagathu punadi veyabadaka munupu devuni kumarudu kadhu ani.. ayina clarity ravadam ledhu.

Mari ayana apudo emi ayyi unnaru? Epudo ayyaru devuni kumarudu ga ? Naku kosamu marala cheppagalara ? Thanks anna KM

Reply
avatar
nani
May 15, 2017 at 9:46 PM delete

Share this ani dhagara Facebook ani click cheste share avvadam ledhu brother KM

Okkasari chudandi.. vandhanamulu Bro

Reply
avatar
May 15, 2017 at 10:41 PM delete

వందనములు బ్రదర్ ప్రదీప్

Reply
avatar
May 15, 2017 at 10:45 PM delete

వందనములు బ్రదర్ శ్రీనివాస్ నేను సేవకుడును కాదు లేదా సేవ చేయుట లేదు. స్థానిక క్రీస్తు సంఘముపు యవ్వనస్తుడును.. మీ తోటి వారుకి కూడా షేర్ చేయండి.

Reply
avatar
May 15, 2017 at 10:50 PM delete

* ఆదిలో వాక్యము(లోగాస్) దేవుడై యున్నారు. (యోహాను. 1:1-2)
* ఆయన మన మధ్యకు దేవును కుమారుడుగా పుట్టిన్నారు. (యోహాను. 3:16).
* మరణము జయించి లేదా సాతాను ఓడించి దేవుని కుడి పార్శమున కూర్చొని, తండ్రి చేత ప్రభువుగాను, క్రీస్తుగాను పట్టాభిషేకం పొంది, దేవుని ప్రజలను ఏలుబడి చేస్తున్నారు. (అపో.కార్య. 2:31-36).

మరల ఒక్కసారి పైన పోస్టును జగర్తగా పరిశీలంక్ చేయగలరు. వందనములు బ్రదర్.అనిల్

Reply
avatar
May 15, 2017 at 10:50 PM delete

వందనములు బ్రదర్. నాని

Reply
avatar
May 15, 2017 at 10:51 PM delete

ఇప్పుడు మరల ఒక్కసారి చూడండి. పని చేస్తుంది. వందనములు.

Reply
avatar
Bala Krishna
May 16, 2017 at 12:16 AM delete

Excellent Brother KM

Reply
avatar
Anil
May 16, 2017 at 12:19 AM delete

Mari yesu devudu kaadhaa..? Son of God ante God kaadhaa ?

Naku koncham chepandi brother. Thankq

Reply
avatar
Anil
May 16, 2017 at 12:21 AM delete

Chala mandhi God ani, saviour ani, son of God ani, Immanuel ani, Lord, Father ani ...etc antaru nijaniki manamu emi anali ?

Reply
avatar
David
May 16, 2017 at 8:43 AM delete

బాగా వివరణ ఇచ్చారు బ్రదర్. మనోహర్ గారు మీకు మన ప్రభువు నామములో నా వందనములు.

Reply
avatar
May 16, 2017 at 9:38 AM delete

యేసు గా మన మధ్యకి వచ్చిన వారు వాక్యము -యోహాను. 1:1
ఈయనే శరీర దారియే పుట్టి దేవుని కుమారుడుగా పిలువబడ్డారు. యోహాను. 3:16

ఈయన అనాది లో దేవుడే కానీ మన మధ్యకి దేవుడు గా రాలేదు. దాసుని రూపము ధరించి(పిలిప్పీ 2:3-6) ఎలుబడి చేయుటకు వచ్చారు.

Reply
avatar
May 16, 2017 at 9:40 AM delete

అయన పట్టాభిషేకం పొంది దేవును చేత ఎలా నియమింప బడ్డారో అలాగునే మనము ఆయనను సంబోధించాలి. అపో. 2:36 చూడుము. వందనములు!!

Reply
avatar
May 16, 2017 at 9:42 AM delete

వందనములు బ్రదర్ డేవిడ్ గారు

Reply
avatar
Honey
May 18, 2017 at 3:02 PM delete

Thanks annaya. Ni next topic kosam waiting.. b-(

Reply
avatar
Anonymous
May 12, 2020 at 12:03 PM delete

ముగిపులేని విషయం లా చెప్పారు సరైన వివరణ లేదు యేసు దేవుని కుమారుడా దేవుని కుమారుడు ఎలా అయ్యాడు? దేవునికి పుట్టినవాడా? దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలని బైబిల్ చూపింది?వీటి గూర్చి వివరంగా చెప్పగలరు

Reply
avatar

Thanks for messaging us. We try to be as responsive as possible. We will respond to you soon.

📖 అపొస్తలుల బోధ : ⛓️ www.cockm.in ⛓️
📖 ಅಪೊಸ್ತಲರ ಬೋಧನೆ : ⛓️ kannada.cockm.in ⛓️

📲 whatsapp no : +91-9705040236
📩 Email : cockm3@gmail.com

The churches of Christ greet you - Roma 16:16