Showing posts with label పరిశుద్ధులు. Show all posts
Showing posts with label పరిశుద్ధులు. Show all posts

అక్కరగలవానికి పంచిపెట్టుటలో మొదటి వ్యక్తి - "యేసుక్రీస్తు"

అక్కరగలవానికి పంచిపెట్టుటలో మొదటి వ్యక్తి -"యేసుక్రీస్తు"


నేడు అనేక మంది అక్కరగలవానికి పంచిపెట్టుటలో వెనుక అడుగులో ఉన్నారు. ధనము కొరకు ప్రాకులాడుతూ ఈ భూమి మీద ధనవంతులునైనా బోధకులుగాను, విశ్వాసుకులుగాను పిలువబడుతున్నారు. బహుశా ఇలాంటి నామకర్ద క్రైస్తువులుకి "(మత్తయి 6:19)" ఈ వాక్యము గూర్చి సరియైన అవగాహన లేకపోవటయే.

యేసు జీవితమును మనము బహు జాగ్రత్తగా పరిశీలన చేస్తే అయన ఈ లోకములో తన కొరకు ఏమియు ఈ లోకములో సంపాదించికొనుటకు పరలోకమును విడిచి వచ్చినట్టుగా చూడలేము.

● అందుకు యేసు నక్కలకు బొరియలును ఆకాశపక్షులకు నివాసములును కలవు గాని "మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదని" అతనితో చెప్పెను. - (లుకా 9:58).

»  యేసు ఇటువంటి సితిలో ఉన్నప్పటికీ కూడా "సమస్త జనులు అక్కరతులో ఉండుట చూసి తన స్వరక్తమును  పంచిపెట్టుటలో కూడా అయన వెనుక అడుగు వేయలేదు". తన పరిశుద్ధ జీవితమును మన పాపపు జీవితములు కొరకు త్యాగము చేసారు.

  యేసుక్రీస్తు రక్తము వలన కలిగే మేలు 

❣ క్రీస్తు రక్తము వలెనే మనకి విమోచన మరియు క్రీస్తునకు దగర అగుటకు అవకాశము కలిగింది. (ఏపేసి 1:7; ఏపేసి 2:13).
❣ క్రీస్తు రక్తమే సమస్త జనులు పాపములను పోగొట్టుకొనే సామర్ధ్యము కలిగి ఉంది. (మత్తయి 26:28; మార్క 24:28; లుకా 24:47).
❣ క్రీస్తు రక్తమే దేవునితో సమాధాన పరచబడుటకు సామర్ధ్యము కలిగి ఉంది. (లుకా 10:6; యోహాను 14:27; రోమా 5:10; కొలసి 3:15).
❣ క్రీస్తు రక్తమే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించడానికి అవకాశము కలిగించింది. ( హెబ్రీ 10: 20).
❣ పాపపు సంకెళ్ళిను తెగొట్టుటకును, సాతాను బంధకాలు నుండి విముక్తి కలిగిచినంది క్రీస్తు ప్రభువు రక్తము ఒక్కటే.  (హెబ్రీ 2:14-15; అపో.కార్య 20:28).

  హెచ్చరిక ::
లోకమునుసారముగా ధనవంతుడుగా పిలువబడుతున్నా ఓ బోధకుడా/ఓ విశ్వాసుకుడా మరి నీవు అక్కరగలవారి కొరకు ఏమి చేయుచున్నావు? ధనము పొగుచేసుకోనే పనిలో ఉంటివా?

● ఇక ఆలస్యము చేయక నీ ధనము అంతటి అమ్మి అక్కరగలవానికి పంచిపెట్టుము. (మతాయి 19:21; మార్క10:21; లూకా 18:22)

యేసుక్రీస్తు వారు తన స్వరక్తమును మన కొరకు ఇచ్చుటలో ఆ గొప్ప ప్రేమను, త్యాగమును చూడుము.

🎯 క్రీస్తు సంఘము -  (రోమా 16:16). 💌KM

"మెలకువ" (awake)

 "పరిశుద్ధులు ఏ విషయములో మెలకువ కలిగి ఉండాలి"..?

నా తోటి పరిశుద్ధులుకు, మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.

■ "మెలకువ" అనగా  "అప్రమత్తంగా, మేలుకొని, శ్రద్ధగల, కనిపెట్టుకొని, నిద్రలేనట్టి, జాగ్రత్తగా" అని అర్ధము.

● విశ్వాసమందు మెలుకువ కలిగి ఉండవలెను - (1 కోరింది 16:13; 2 కోరింది 13:5).
● మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించు విషయములో మెలకువ కలిగి ఉండవలెను - (ఎపేసి 5:20; కొలసి 3:17; 4:2)
● మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలకువ కలిగి ఉండవలెను - (మత్తయి 26:41; 1 కోరింది 10:13; యాకోబు 1:12).
● స్వస్థబుద్ధిగలవారై, ప్రార్థనలు చేయుట విషయములో, సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయు విషయములో, మరియు మనుష్యకుమారుని యెదుట నిలువబడుటకు శక్తిగలవారగునట్లు ఎల్లప్పుడును ప్రార్థనచేయుచు మెలకువ కలిగి ఉండవలెను. -  (1 పేతురు 4:7; ఎపేసి 6:18; లూకా 21: 36).
● ఆ దినము (క్రీస్తు రెండో రాకడ) గూర్చి మనకి తెలియదు కాబట్టి మనము మెలువ కలిగి ఉండవలెను - (మతాయి 24:42-43; 25:13; లుకా 12:39; 1 దెస్స 5:6; 2 పేతురు 3:12; ప్రకటన 16:16).
● అపవాది విషయములో నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువ కలిగి ఉండవలెను - (1 పేతురు 5:8).
● సత్యములో, సత్య ప్రకటన విషయములో మెలుకువ కలిగి ఉండవలెను - (1 తిమోతి 4:16; 2 తిమోతి 2:15; 4:5).

◆  నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా నుండుడనెను. (మార్క 13:37).

"మనోహర్ బాబు గుడివాడ" 

The churches of Christ greet you - Roma 16:16