Showing posts with label పని. Show all posts
Showing posts with label పని. Show all posts

"నేటి కాలములో పరిశుద్ధాత్ముని పని" (The work of the Holy Spirit in the present Christianity)

నేటి కాలములో పరిశుద్ధాత్ముని పని


ప్రభువునందు ప్రియమైన పరిశుద్ధులందరికి నా హృదయపూర్వక వందనములు.


A). "యేసును ప్రభువుగా ఒప్పుకోలు చేస్తాడు" :

» "దేవుని ఆత్మవలన మాటలాడువాడెవడును యేసు శాపగ్రస్తుడని చెప్పడనియు, పరిశుద్ధాత్మవలన తప్ప ఎవడును యేసు ప్రభువని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను". ( 1 కొరింధి. 12:3).
» "యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు మృతులలోనుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినయెడల, నీవు రక్షింపబడుదువు". (రోమా. 10:9).
» "మనము బ్రదికినను ప్రభువు కోసమే బ్రదుకుచున్నాము; చనిపోయినను ప్రభువు కోసమే చనిపోవుచున్నాము. కాబట్టి మనము బ్రదికినను చనిపోయినను ప్రభువువారమైయున్నాము. తాను మృతులకును సజీవులకును ప్రభువై యుండుటకు ఇందు నిమిత్తమే గదా క్రీస్తు చనిపోయి (మరల ) బ్రదికెను". (రోమా. 14:8-9).
» "మీరు సిలువవేసిన యీ యేసునే దేవుడు ప్రభువు గాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసికొనవలెనని చెప్పెను". (అపో.కార్య. 2:36).


B). "లోకాన్ని పాపము గూర్చి ఒప్పుకోలు చేస్తాడు" :

» "నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్లిపోవుట వలన మీకు ప్రయోజనకరము; నేను వెళ్లనియెడల ఆదరణ కర్త మీయొద్దకు రాడు; నేను వెళ్లినయెడల ఆయనను మీయొద్దకు పంపుదును. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును.
లోకులు నాయందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు, నేను తండ్రియొద్దకు వెళ్లుటవలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పుపొందియున్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొనజేయును". (యోహాను. 16:7-11).


C). "మన హృదయములోనికి పంపబడి, సొంతగానికి ముద్రగా ఉంటాడు" :

» "మీరును సత్యవాక్యమును, అనగా మీ రక్షణ సువార్తను విని, క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానముచేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి". (ఎఫెసి. 1:13).
» “మీతోకూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్రవేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరువును అనుగ్రహించియున్నాడు”. (2 కొరింధి. 1:21-22).
» “మీ దేహము దేవునివలన మీకు అనుగ్రహింపబడి, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై యున్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువపెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి”. ( 1 కొరింధి. 6:19-20).


D). "మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉంటాడు" :

» “ఆయన తన ఆత్మ అను సంచకరువును మన కనుగ్రహించియున్నాడు”. (2 కొరింధి. 5:5).
» “దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు”. (ఎఫెసు. 1:14).


E). "నీలో నివాసము చేసి, విజ్ఞాపన చేస్తాడు" :

» "మీరు దేవుని ఆలయమైయున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించు చున్నాడనియు మీరెరుగరా?" ( 1 కొరింధి. 3:16).
» "అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా, మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముగాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు." "మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో యెరుగును; ఏలయనగా, ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధులకొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు." (రోమా. 8:26-27).


F). "కృపకు మూలమైన ఆత్మ" :

» "న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు, విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును." "ఎవడైనను మోషే ధర్మ శాస్త్రమును నిరాకరించిన యెడల ఇద్దరు ముగ్గురు సాక్షుల మాటమీద, కనికరింపకుండ వాని చంపించుదురు." "ఇట్లుండగా దేవుని కుమారుని, పాదములతో త్రొక్కి, తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి, కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించినవాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును?" (హెబ్రీ. 10:27-29).


దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి; విమోచన దినము వరకు ఆయనయందు
మీరు ముద్రింపబడియున్నారు. (ఎఫెసి. 4:30).

మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు.

"క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని పని" (the work of holy spirit in the new testament)



ప్రభువునందు ప్రియమైన పరిశుద్ధులందరికి నా హృదయపూర్వక వందనములు.

క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని యొక్క పేర్లు :

» ఆత్మ.  (మత్తయి. 4:1; 12:31; ఎపేసి. 1:14).
» దేవుని ఆత్మ.  (రోమా. 8:9).
» ఆదరణ కర్త/ఉత్తరవాది.  (యోహాను. 15:26).
» సత్యస్వరూపియైన ఆత్మ.  (యోహాను. 16:13).
» మహాస్వరూపియైన ఆత్మ.  (1 పేతురు. 4:14).
» నిత్యుడగు ఆత్మ.  (హెబ్రీ. 9:14).

క్రొత్త నిబంధన గ్రంథము వ్రాయుంచుటలో పరిశుద్ధాత్ముని పని

ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏల యనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి. – (2 పేతురు. 1:20:21).


యేసు పుట్టుకలో పరిశుద్ధాత్ముడు

● అందుకు మరియ నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. – (లూకా. 1:34-35).

● అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ప్రభువుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై - దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్బము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది. – (మత్తయి. 1:20).

యేసు బాప్తీస్మములో పరిశుద్ధాత్ముడు

యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డుకు వచ్చెను; అప్పుడు ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. – (మత్తయి. 3:16; మార్కు. 1:10; లూకా. 3:22; యోహాను. 1:32).

అపోస్తులుల కాలములో పరిశుద్ధాత్ముడు

1)     అపోస్తులులు పరిశుద్దాత్మలో బాప్తీస్మము పొందుట :
» తండ్రి యొక్క వాగ్ధానమును అనగా పాత నిబంధనలో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి (యోవేలు. 2:28) యేసు ముందుగా తండ్రియొక్క వాగ్ధానమును తన శిష్యులకి జ్ఞాపకము చేసి యెరూషలేములో వారు మాత్రమే పొందుకొనుటకు సహాయపడిరి (లూకా. 24:49; అపో.కార్య. 1:4; 2:3-4).

2)     అపోస్తులులతో పరిశుద్ధాత్ముడు చేసిన పని :
» అపోస్తులులకు సమస్తమును బోధించుటలోను, యేసు చెప్పిన సంగతులన్నిటిని జ్ఞాపకము చేయుటలోను పరిశుద్ధాత్ముడు వారికి ఉత్తరవాదిగా ఉన్నారు. (యోహాను. 14:26; 17:7). 

» పరిశుద్ధాత్ముడు, అపోస్తులుల ద్వారా యేసుని గూర్చిన సాక్ష్యమును లోకమునకు తెలియజేసారు. (యోహాను. 15:26).

» అపోస్తులులను సర్వసత్యములోనికి నడిపించుటలోను, ఆయన వినిన సంగతులను వారికి బోధించి సంభవింపబోవు సంగతులను వారికి తెలియజేసారు. (యోహాను. 16;13).

3)   అపోస్తులుల “తో”, “లో” ఉంటూ పరిశుద్ధాత్ముడు చేసిన కార్యాలు :  
» పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తిని అపోస్తులులతో పరిశుద్ధాత్ముడు స్వస్థపరిచెను. (అపో. కార్య. 3:1-9).

» పరిశుద్ధాత్మ అపోస్తులులలో ఉండుట వలన వారి నీడ సైతము పడి అనేకమంది స్వస్థపరచబడ్డారు. (అపో.కార్య. 5:15).

4)     అపోస్తులులు పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటించుట :
 » పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా     మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై, తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు. (1 పేతురు. 1:12).

» నీవును నీ యింటివారందరును ఏ మాటలవలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని, తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. (అపో.కార్య. 11:14).

» పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనెను- ప్రజల అధికారులారా, పెద్దలారా... (అపో.కార్య. 4:8).

5)     మరుగైయున్న దేవుని సంకల్పము తెలియచేయుటలో పరిశుద్దాత్ముని పని :
» మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడుఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవుదేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. (1 కొరింధి. 2:10-13).

» ఈ మర్మమిప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులుగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడ లేదు.
ఈ మర్మమేదనగా - అన్యజనులు సువార్త వలన క్రీస్తుయేసునందు యూదులతోపాటు సమాన వారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునై యున్నారను నదియే. (ఎఫెసీ. 3:5-6).

6)     అపోస్తులుల హస్తనిక్షేపణ చేయగా(చేతులుంచగా)  పరిశుద్దాత్ముని శక్తీ పొందునట్లు పనిచేసెను :
» అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతు లుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. (అపో.కార్య. 8:17).

» తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును  ప్రవచించుటకును  మొదలుపెట్టిరి. (అపో.కార్య. 19:16).

7)     పరిశుద్దాత్ముడు తన చిత్తము చెప్పున కృపావరములు పంచి ఇచ్చెను :
» ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును, మరియొకనికి ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి. అయినను వీటినన్నిటిని ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. (1 కొరింధి. 12:8-11).

.» దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుత ములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను. (1 కొరింధి. 12:28-31).

వాక్యము స్థిరపరచుటలో పరిశుద్ధాత్ముడు
కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలచేతను మహత్కార్యములచేతను నానావిధములైన అద్భుతములచేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢపరచబడెను. – (హెబ్రీ. 2:1-4).

మీ ఆత్మీయ సహోదరుడు, 
మనోహర్ బాబు . 


"పాత నిబంధనలో పరిశుద్ధాత్ముని పని" (The work of Holy Spirit in the old testament)

                                  
నా తోటి పరిశుద్ధులరా, మీకు మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.


పాత నిబంధనలో పరిశుద్ధాత్ముని యొక్క పేర్లు

» దేవుని ఆత్మ.  (ఆది. 1:2; యోబు. 33:4).

» యెహోవా ఆత్మ.  (యెషయా. 11:2; 40:3; 61:1).

» పరిశుద్ధాత్మ.  (కీర్తన. 51:11; యెషయా. 63:10).

» నా ఆత్మ.  (యోవేలు 2:28-29).



సృష్టికి ముందు పరిశుద్ధాత్మ

నిత్యుడగు ఆత్మద్వారా తన్నుతాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తుయొక్క రక్తము, నిర్జీవక్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో యెక్కవగా శుద్ధిచేయును. – (హెబ్రీ. 9:14).

● నిత్యుడు అనగా నిరంతరము ఉన్నవాడు. కావున జగత్తు పునాది వేయబడకమునుపే ఉన్నవాడని మరియు అదృశ్యమైనవి నిత్యములు అని పరిశుద్ధ గ్రంధము చెప్పుచున్నది. – (2 కొరింధి. 4:18).



సృష్టి ప్రారంభములో పరిశుద్ధాత్మ

● ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. – (ఆది. 1:1-2).

● దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తునియొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను.  (యోబు. 33:4).

అందరి ప్రయోజనముకొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. (1 కొరింధి. 12:7;11).



సృష్టి నిర్మాణములో పరిశుద్ధాత్మ

● నిత్యత్వములో దేవుని యొక్క ఆలోచనలకు ఆకారమిచ్చిన యేసుక్రీస్తు వారియొక్క పనికి కొలమానమిచ్చినది మన ఆదరణకర్తయైన పరిశుద్ధాత్ముడు.  (ఆది. 1:1; 1 కొరింధి. 8:6; కొలస్సి. 1:15-17).

● తన పుడిసిటిలో జలములు కొలిచినవాడెవడు? జేనతో ఆకాశముల కొల చూచినవాడెవడు? భూమిలోని మన్ను కొలపాత్రలో ఉంచినవాడెవడు? త్రాసుతో పర్వతములను తూచినవాడెవడు? తూనికచేత కొండలను తూచినవాడెవడు?  (యెషయా. 40:12).



పాత నిబంధన గ్రంథము వ్రాయుంచుటలో పరిశుద్దాత్ముని పని


ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏల యనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి. (2 పేతురు. 1:20:21).

» పాత నిబంధన గ్రంధములో గల ముప్పది తొమ్మిది పుస్తకములను ముప్పది మంది గ్రంథకర్తలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ చేత వ్రాయడము జరిగినది.

» దేవుడు చేసిన సృష్టి క్రమమును, మానవ నిర్మాణమును మరియు ఏ మనుష్యునికి తెలియని గొప్ప మర్మములను అనగా 2,500 సంవత్సరముల క్రితము జరిగిన విశేష సంగతులను ప్రవక్తయైన మోషే (ద్వితియో. 18:16) ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు తెలియపరిచారు (ఆది. 1:1-31; 2:7-8, 21-23).

» దేవుని సంకల్పమును బట్టి సృష్టిలో జరిగిన మొట్ట మొదటి వివాహ బంధము గూర్చి (ఆది. 2:24-25), నోవాహు కాలములో ప్రపంచమును నాశనము చేసిన జలప్రళయము గూర్చి (ఆది. 7:17-24), అప్పటి వరకు ఒక్క జనముగా మరియు ఒక్కటే భాష మాట్లాడుతున్నవారిని భూమియందంతట వారిని చెదరగొట్టి వారి భాషను తారుమారు చేసి శాస్త్రవేత్తలకు సైతము అంతుచిక్కని మరెన్నో విశేష సంగతులను పరిశుద్ధాత్ముడు ప్రవక్తయైన మోషే  ద్వారా గ్రంథములో వ్రాయించి మనకు తెలియజేసెను.

» ఆది నుండి జరిగిన అన్ని సంగతులను ఉన్నవి ఉన్నట్టుగా ప్రతి విషయమును లేఖనముల ద్వారా మనకు తేటగా తెలియపరుచుటకు గ్రంధములో పొందుపరచెను.

» దేవుని యొక్క అనాది సంకల్పమును తన ప్రవక్తలకు పరిశుద్ధాత్ముడు  తెలియజేసారు. - (2 సమూ. 23:2).



సాక్ష్యపు గుడారం నిర్మాణములో పరిశుద్ధాత్ముని పని

● విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును పొదుగుటకై రత్నములను సాన బెట్టుటకును కఱ్ఱనుకోసి చెక్కుటకును సమస్త విధములైన పనులను చేయుటకును జ్ఞానవిద్యా వివేకములును సమస్తమైన పనుల నేర్పును వానికి కలుగునట్లు వానిని “దేవుని ఆత్మ” పూర్ణునిగా చేసి యున్నాను. - (నిర్గమా. 31:3-5).

● మోషే ఇశ్రాయేలీయులతో ఇట్లనెను చూడుడి; యెహోవా ఊరు కుమారుడును హూరు మనుమడునైన బెసలేలును పేరుపెట్టి పిలిచి విచిత్ర మైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయుటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటిని చేయుటకును వారికి ప్రజ్ఞా వివేక జ్ఞానములు కలుగునట్లు “దేవుని ఆత్మ"తో వాని నింపియున్నాడు. - (నిర్గమా. 35:30-33).


న్యాయాధిపతుల కాలములో పరిశుద్దాత్ముని పని

● "యెహోవా ఆత్మ” గిద్యోనును ఆవేశించెను. అతడు బూర ఊదినప్పుడు అబీయెజెరు కుటుంబపువారు అతని యొద్దకు వచ్చిరి. - (న్యాయా. 6:34).

● “యెహోవా ఆత్మ” యెఫ్తామీదికి రాగా అతడు గిలాదు లోను మనష్షేలోను సంచరించుచు, గిలాదు  మిస్పే లో సంచరించి గిలాదు మిస్పేనుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. - (న్యాయా. 11:2,29).

● “యెహోవా ఆత్మ” జొర్యాకును ఎష్తాయోలుకును మధ్యనున్న మహనెదానులో అతని రేపుటకు మొదలు పెట్టెను. - (న్యాయా. 13:25).

● “యెహోవా ఆత్మ” అతనిని ప్రేరేపింపగా అతనిచేతిలో ఏమియు లేకపోయినను, ఒకడు మేకపిల్లను చీల్చునట్లు అతడు దానిని చీల్చెను. అతడు తాను చేసినది తన తండ్రితోనైనను తల్లితో నైనను చెప్పలేదు. - (న్యాయా. 14:9,19).



రాజుల కాలములో పరిశుద్దాత్ముని పని

● సౌలు ఆ వర్తమానము వినగానే “దేవుని ఆత్మ” అతనిమీదికి బలముగా వచ్చెను. - (1 సమూ. 11:6).

● సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల యెదుట వానికి అభిషేకము చేసెను. నాటనుండి “యెహోవా ఆత్మ” దావీదుమీదికి బలముగా వచ్చెను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్లిపోయెను. - (1 సమూ. 16:13).

● ఆ కాలమున “దేవుని ఆత్మ” ఓదేదు కుమారుడైన అజర్యామీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి యీలాగు ప్రకటించెను. - (2 దినవృత్తా. 15:1).

● “యెహోవా ఆత్మ” అతని (యహజీయేలు) మీదికి రాగా అతడీలాగు ప్రకటించెను. - (2 దినవృత్తా. 20:14).

● అప్పుడు “దేవుని ఆత్మ” యాజకుడగు యెహోయాదా కుమారుడైన జెకర్యామీదికి రాగా అతడు జనులయెదుట నిలువబడిమీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు? మీరు వర్ధిల్లరు; మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించియున్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనెను. - (2 దినవృత్తా. 24:20).



పాత నిబంధనలో తండ్రి యొక్క వాగ్ధానము


ప్రవచనము :

» తరువాత నేను సర్వజనులమీద నా ఆత్మను కుమ్మ రింతును; మీ కుమారులును మీ కుమార్తెలును ప్రవచన ములు చెప్పుదురు; మీ ముసలివారు కలలుకందురు, మీ యౌవనులు దర్శనములు చూతురు.  - (యోవేలు 2:28-29)


నెరవేర్పు :

» పరిశుద్ధాత్ముని గూర్చిన తండ్రి యొక్క వాగ్ధానమును అపోస్తులులకి  మాత్రమే ఇవ్వబడుట గూర్చి ముందుగానే క్రీస్తు వారు తన శిష్యులకి తెలియపరచుట. – (లూకా. 24:49).

» అందరు పరిశద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ఛక్తి అనుగ్రహించినకొలది అన్యభాషలతో మాటలాడసాగిరి. యోవేలు ప్రవక్తద్వారా చెప్పబడిన సంగతి యిదే.  (అపో.కార్యా. 2:4,16).


మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్_నవీన


The churches of Christ greet you - Roma 16:16