◆ "దేవుని చిత్తము" అనగా ఆయన పిల్లల యెడల ఉండే "దేవుని మనసు" లేదా "దేవుని మది" అర్ధము.
» "ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క వ్యక్తిత్వపు లక్షణములు ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలని" - ( ఎఫెసి. 1:5; గలతి. 5:22).
» "నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించేవారుగా ఉండాలని" - (హెబ్రీ. 1:9).
» క్రీస్తు సువార్త ద్వారా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన విషయములో" (1 కొరింథీ. 1:2). "పరిశుద్ధులగుటయే" అనగా ప్రతి క్రైస్తవుడు "జారత్వమునకు దూరముగా ఉండాలని."- ( 1 థెస్స. 4:3).
» "పరిశుద్ధత, ఘనత విషయములో తన శరీరమును ఎలా కాపాడుకోవాలి అని తెలుసుకొనగోరువారై ఉండాలని". - ( 1 థెస్స. 4:5).
» క్రైస్తవులు ఇతరులతో అజ్ఞానముగా మాట్లాడక "యుక్తప్రవర్తన గలవారై" (మేలు చేయువారై) ఉండాలని. - (1పేతురు. 2:15).
» క్రీస్తు తన స్వరక్తము ఇచ్చి కట్టిన ఏకైక ఒక్క క్రీస్తు సంఘముగా (CHURCH OF CHRIST) ఉండాలని (మత్తయి. 16:18; అపొ.కార్య. 2:41-42; 20:28; ఎఫెసి. 1:23; కొలస్స. 1:18; 1కొరింథీ. 12:27).
» "ప్రతి క్రైస్తవుడు "లోకము దాని ఆశయు" అనే విషయములో నశించి పోవాలి అనేది దేవుని చిత్తము కాదు". - (1యోహాను. 2:16-17; మత్తయి. 18:14).
» "మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురముచేయాలి". - (1 పేతురు. 2:9).
» "దేవుని చిత్తమైతే మనము బ్రతికి ఉండే ఆత్మ సంబంధమైన కార్యములు ఇది అది చేతమని చెప్పుకొనవలెను" - (యాకోబు. 4:15).
» ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో "దేవుని చిత్తము" - (1థెస్స. 5: 18).
● నా ప్రియులారా... "ప్రభువు చిత్తమైతే" ఒక ఎకరం పొలం, బిల్డింగ్, కారులు కొందామనుకుంటున్నాను మరియు "ప్రభువు చిత్తమైతే" పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాను అనకూడదు.
» అవన్నీ మన శరీర ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంది కాని దానికి "ప్రభుచిత్తమని" "దేవుని చిత్తమని" పేరు పెట్టకూడదు.
∆ "సమస్తము అంతటి మీద దేవుడు మనకి అధికారమిచ్చారు మరియు మన పాదముల క్రింద వాటిని ఉంచారు". - (కీర్తన 8:6-8).
పరిశుద్ధులు దీనిని ఎరుగక శరీర సంబంధమైన వాటి కొరకు ప్రాకులాడుతూ దేవుడు ఇచ్చే విలువవైన జీవితములో దేవుని చిత్తమును పక్కన పెట్టి వృథాగా ఖర్చు చేస్తున్నారు.
■ యేసుక్రీస్తు వారి సాక్ష్యము:
"నా యిష్టమును నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగి వచ్చితిని". - (యోహాను 6:39)
★ ఆయన పరలోక సేనయెడలను, భూనివాసులయెడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. - (దానియేలు. 4: 35).
★ ప్రభువా, ప్రభువా, అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడుగాని "పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము" చేయువాడే ప్రవేశించును. - (మత్తయి. 7:21).
మీ ఆత్మీయా సహోదరుడు,
💌 KM

