Showing posts with label క్రొత్త నిబంధన. Show all posts
Showing posts with label క్రొత్త నిబంధన. Show all posts

క్రొత్త నిబంధన సంఘము యొక్క నమూనా (The New Testament Church – A Chart)


ప్రభువు నందు  ప్రియులకు మా హృదయపూర్వక వందనములు. క్రొత్త నిబంధనలో నిర్మితమైన ప్రభువు సంఘము  లేఖనముల ఆధారముగా ఉన్నదో లేదో  వివరంగా  తెలుసుకొనుటకు ఈ అంశము వ్రాస్తున్నాము. తెలియని వారికి చాలా సులభముగా అర్థమగుటకు, తెలిసినవారికి మరింత అవగాహన కొరకు ఉపయోగపడుతుందని అనుకొనుచున్నాము. 


A). "క్రొత్త నిబంధన సంఘము యొక్క పరిపాలన ప్రణాళిక"  :
»  ప్రవచనము. : (యెషయా. 2:2-3).
»  సన్నాహము. : (మత్తయి. 16:13-18).
»  స్థాపన. : (అపో.కార్య. 2:1-47).
»  స్థితి. : (హెబ్రీ. 12:22-29).
»  ఉద్దేశ్యము. : (1కొరింధీ . 15:24-29).


B). "క్రొత్త నిబంధన సంఘము యొక్క ఆధ్యాత్మిక  స్వభావం" :
»  ఆధ్యాత్మికమైన మందిరం. : (1 తిమోతి.  3:15).
»  ఆధ్యాత్మికమైన దేవాలయం. : (ఎఫెసీ. 2:19-22).
»  ఆధ్యాత్మికమైన సమూహము. : (హెబ్రీ. 12:23).
»  ఆధ్యాత్మికమైన శరీరము. : (1 కొరింధీ . 12:13).
»  ఆధ్యాత్మికమైన రాజ్యము. : (యోహాను. 18:36).


C). "క్రీస్తునకు క్రొత్త నిబంధన సంఘముతో గల దైవికమైన సంబంధం" :
»  సంఘమును నిర్మించినవాడు క్రీస్తే. : (మత్తయి. 16:18).
»  సంఘమును కొన్నవాడు క్రీస్తే. : (అపో.కార్య. 20:28, ఎఫెసీ. 5:25).
»  సంఘమునకు శిరస్సు క్రీస్తే. : (ఎఫెసీ. 5:22-32, కోలస్సి. 1:18).
»  సంఘమునకు పునాది వేసినవాడు క్రీస్తే. : (1 కోరింది. 3:11, ఎఫెసీ. 2:20).
»  సంఘమునకు రక్షణకర్త క్రీస్తే. : (ఎఫెసీ. 5:23).


D). "క్రొత్త నిబంధన సంఘమునకు క్రీస్తుతో గల దైవికమైన సంభంధం" :
»  క్రీస్తునకు వధువు సంఘము . : (ఎఫెసీ. 5:23-32).
»  క్రీస్తు యొక్క శరీరము సంఘము. : (కోలస్సి. 1:24, ఎఫెసీ. 1:23).
»  క్రీస్తు యొక్క రాజ్యము.సంఘము. : (యోహాను. 18:36).
»  క్రీస్తు యొక్క మంద సంఘము. : (అపో.కార్య. 20:28).
» దీపస్తంభము. : (ప్రకటన. 1:12-20).


E). "క్రొత్త నిబంధన సంఘమునకు గల దైవికమైన  పేర్లు" :
»  దేవుని సంఘము. : (1 కోరింది. 1:2).
»  క్రీస్తు సంఘము. : (రోమా. 16:16).
»  జ్యేష్ఠుల సంఘము. : (హెబ్రీ. 12:23).
»  ప్రభువు సంఘము. : (అపో .కార్య. 20:28).
»  సంఘము. : (ఎఫెసీ. 3:10).
»  రాజ్యము. : (మత్తయి. 16:19).


F). "క్రొత్త నిబంధన సంఘ సభ్యులకు పెట్టబడిన లేఖనానుసారమైన పేర్లు" :
»  క్రైస్తవులు. : (1 పేతురు 4:16).
»  దేవుని కుమారులు. : (గలఁతి. 3:26).
»  సహోదరులు. : (గలఁతి. 6:1).
»  పరిశుద్ధులు. : (రోమా. 1:7),
»  శిష్యులు. : (అపో.కార్య. 11:26).


G). "క్రొత్త నిబంధన సంఘములో సభ్యత్వం పొందుటకు" :
»  వినాలి. : (యోహాను. 5:24, అపో.కార్య. 8:5-6,రోమా. 10:17, ప్రకటన. 1:3).
»  విశ్వసించాలి. : (యోహాను. 8:24, అపో .కార్య. 16:31, రోమా. 10:17, హెబ్రీ. 11:6).
»  మారుమనస్సు పొందాలి. : (లూకా . 13:3, అపో.కార్య. 2:38, 17:30).
»  ఒప్పుకో వాలి. : (మత్తయి. 10:32-33, యోహాను. 20:31, అపో.కార్య. 8:37,రోమా. 10:10).
»  బాప్తీస్మం పొందాలి. : (మార్కు. 16:16, అపో.కార్య. 2:38, 22:16, 1పేతురు. 3:21).


H). "క్రొత్త నిబంధన సంఘము యొక్క యదార్ధ ఆరాధన  నిజరూపము" :
»  ప్రార్థన. : (అపో.కార్య. 2:42, 1 తిమోతి. 2:1,8).
»  పాటలు. : (ఎఫెసీ. 5:19, కోలస్సి. 3:16, హెబ్రీ. 13:15).
»  బోధ. : (యోహాను. 17:14-21, అపో.కార్య. 2:42, 2 ధెస్సలొనీక. 2:15, 2 తిమోతి. 4:1-4).
»  ప్రభు బల్ల. : (అపో.కార్య. 2:42, 20:7,1 కోరింది. 11:23-29).
»  కానుకలు. : (1 కొరింధీ . 16:1-2, 2 కోరింది. 9:7).


I). "క్రొత్త నిబంధన సంఘము యొక్క క్షేమాభివృద్ధి
, పరిచర్య ధర్మము" :
»  పెద్దలు. : (1 తిమోతి. 3:1-7, తీతుకు .1:5-9).
»  పరిచారకులు. : (1 తిమోతి .3:8-13).
»  బోధకులు. : (2 తిమోతి 4:1-5).
»  ఉపదేశకులు. : (హెబ్రీ. 5:12-14).
»  సభ్యులు. : (1 కోరింది. 12:23-27).


J). "క్రొత్త నిబంధన సంఘము యొక్క పని" :
»  సువార్తను ప్రకటించాలి . : (మత్తయి. 28:18-20).
»  తప్పిదములో ఉన్న సహోదరులను బాగుచేయాలి. : (గలఁతి. 6:1).
»  దేవుని ఆరాధించాలి. : (యోహాను. 4:24).
»  క్రీస్తును జ్ఞాపకము చేసుకోవాలి. : (1 కోరింది. 11:23-29).
»  దేవుని సేవ చేయాలి. : (హెబ్రీ. 12:28-29).
» క్రీస్తును సేవించాలి అనగా సేవ చేయాలి. : (యోహాను. 12:26).
»  విశ్వాసగృహముగా ఉన్నవారికి మేలు చేయాలి. : (గలఁతి. 6:10).


K). "క్రొత్త నిబంధన సంఘమునకు నియమింపబడిన దేవుని అధికారి" :
»  సంఘమునకు రక్షకుడు క్రీస్తే. : (ఎఫెసీ. 5:23, లూకా. 2:11, మత్తయి. 1:21).
»  సంఘమునకు దేవునికి మధ్యవర్తి క్రీస్తే. : (1 తిమోతి. 2:5).
»  సంఘమును ఏలువాడు క్రీస్తే. : (ఎఫెసీ. 1:22-23, అపో.కార్య. 2:36).
»  సంఘమునకు న్యాయాధిపతి క్రీస్తే. : (2 కోరింది. 5:10).


L). "క్రొత్త నిబంధన సంఘము దేవుని అంగీకారం పొందాలంటే" :
»  మహిమగలిగినదై ఉండాలి. : (ఎఫెసీ. 5:25-27).
» నిష్కళంకంగా ఉండాలి. : (2 పేతురు. 3:14).
»  పరిశుద్ధంగా ఉండాలి. : (పేతురు. 1:14-16).
»  నిర్దోషంగా ఉండాలి. : (ఎఫెసీ. 1:4).
»  లోపము లేనివారిగా ఉండాలి. : (కొలస్సి. 1:22).


కావున ప్రియులారా, మీరు ఏ సంఘముగా కట్టబడ్డారో ఆలోచన చేయండి. క్రొత్త నిబంధనలో నిర్మించిన క్రీస్తు సంఘముగా(CHURCH OF CHRIST) కట్టబడినచో దేవునికి స్తోత్రము. ఒకవేళ ఇప్పటికీ కట్టబడనిచో  పై వచనాల ఆధారముగా నిజ సంఘము గూర్చి తెలుసుకోవాలని మా మనవి.  ఈ సందేశము చదివిన వారంతా దేవుని చిత్తములో కొనసాగాలని మమ్మల్ని మేము హెచ్చరిక చేసుకొనుచూ మీకు మనవి చేయుచున్నాము.
మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"క్రొత్త నిబంధనలో వాయిద్యములు?" (Musical Instruments in the new testament?)

క్రొత్త నిబంధనలో వాయిద్యములు


ప్రియమైన సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

నేటి క్రైస్తవ్యములో అనేకమంది ఆరాధనలో వాయిద్యములు వాయించవచ్చని భావించి, లేని వాటిని సృష్టించి తండ్రియైన దేవుని వ్యర్థముగా ఆరాధిస్తున్నారు.

క్రొత్త నిబంధనలో వాయిద్యములు (Musical Instruments) ఉన్నాయా..?, అపోస్తులులు కాని ఆదిమ క్రైస్తవులు కాని వాయిద్యములతో ఆరాధించారా..?, అసలు వాయిద్యములు అనే పదము క్రొత్త నిబంధన గ్రంథములో ఉందా..?, వాక్యమును పరిశీలన చేసి సత్యాన్ని అన్వేషించు ప్రతి ఒక్కరు ఈ ప్రశ్నలన్నిటికి సమాధానము లేదు అని ఖండితంగా చెప్పగలము. ఎందుకనగా, క్రొత్త నిబంధనలో ఏ సంధర్భములోను వాయిద్యములను ఉపయోగించినట్టుగా చూడలేము అసలు వాయిద్యములు అనే పదమే మనకు ఈ నిబంధనలో కనిపించదు.

క్రైస్తవులమైన మనము వాయిద్యములు వాడచ్చా?


మోషే కాలములో దేవుడు తన మందిరపు యాజకత్వపు పనిని గూర్చి మోషే కు తెలియజేస్తూ యాజకత్వపు పనిని ఆహారోను సంతతి వారు అనగా లేవీ గోత్రస్తులు మాత్రమే చేయాలని తెలియజేసారు.

» మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. – (నిర్గమ. 28:1).

యెహోవా మందిరములోనికి వెళ్ళుటకు లేవీయులకు తప్ప ఇంకెవరికిని అధికారము లేదు కనుక రాజైన దావీదు కూడా దేవుని మందిరములో వాయిద్యములు వాయించే పనిని లేవీయులకు మాత్రమే అప్పగించునట్టు గ్రంథములో చూడగలము.

» దావీదును దావీదు రాజుకు దీర్ఘదర్శియైన గాదును ప్రవక్తయైన నాతా నును చేసిన నిర్ణయముచొప్పున యెహోవా మందిరములో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీయులను ఏర్పాటుచేసెను. ఆలాగు జరుగవలెనని యెహోవా తన ప్రవక్తలద్వారా ఆజ్ఞాపించి యుండెను. – (2 దినవృత్తా. 29:25).

పాత నిబంధనలో లేవీయులకు మాత్రమే ఇవ్వబడిన ఈ కార్యక్రమమును క్రైస్తవులమైన మనము చేయవచ్చునా అంటే చేయకూడదు ఎందుకనగా మునుపు అన్యులమైన మనము క్రీస్తు యొక్క నిబంధన రక్తము ద్వారా క్రైస్తవులుగా పిలువబడుతున్నాము కాని లేవీ గోత్రమునకు అనగా ఆహారోను సంతతికి చెందిన వారము కాము కనుక నేటి క్రైస్తవులు ఆరాధనలో వాయిద్యములు వాడకూడదు.

మనము లేవీయుల యాజకత్వమును చేయవచ్చా?


పాత నిబంధనలో లేవీయులకు మాత్రమే దేవుడు అప్పగించిన యాజకత్వపు పనిని ఆ సంతతి వారు తప్ప రాజులైనను, ఇతర గోత్రీకులైనను చేసినట్టు దాఖలు లేవు. దేవుడిచ్చిన ఈ ఆజ్ఞను మీరిన వారు శిక్ష  పొందినట్టుగా కూడా చూడగలము.

» వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియేగాని నీ పని కాదు; పరిశుద్ధస్థలములోనుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసియున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ జేయదని చెప్పగా ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే యున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. – (2 దినవృత్తా. 26:18-19).

లేవీ యాజకత్వము నేటి క్రైస్తవులకు వర్తిస్తుందా?


పాత నిబంధనలో తెలుపబడిన లేవీ యాజకత్వపు ధర్మము క్రొత్త నిబంధనలో ఎక్కడా చూడలేము. క్రైస్తవులమైన మనము రాజులైన యాజక సమూహమని  గ్రంథము తెలియజేస్తుంది, మరి మనము ఏ విధముగా దేవుని ఆరాధించాలి? మన ప్రధాన యాజకుడు ఎవరు? అనే విషయములను ఆలోచన చేస్తే గ్రంథము ఈ విధముగా సెలవిస్తుంది.

» ఆకాశమండలము గుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను. – (హెబ్రీ. 4:14-15).

» అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తయిన ప్రజలునై యున్నారు. – (1 పేతురు. 2:9).

» నీవు వధింపబడినవాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాటలాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను, దేవుని కొరకు మనుష్యులను కొని, మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితిమి. – (ప్రకటన. 5:9).

క్రైస్తవులమైన మనకు క్రీస్తు ప్రధానయాజకుడుగా ఉన్నాడని, చీకటిలో ఉన్న మనలను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనలను నడిపించాడని, ఆయన రక్తము ద్వారా మనలను రాజులైన యాజక సమూహముగా చేసాడని తెలుసుకోవాలి.

» పాత నిబంధనలో ఈ ప్రధానయజకుడు తనది కాని రక్తము తీసుకొని సంవత్సరమునకు ఒక్కసారే పరిశుద్ధస్థలములోనికి ప్రవేశించి ప్రజల కొరకు , తన కొరకు పాపముల నిమిత్తము అర్పణము చేయువాడు. – (హెబ్రీ. 5:3, 9:25).

» క్రొత్త నిబంధన కాలమునకు వచ్చేసరికి ఆ పనిని మన ప్రధానయజకుడైన క్రీస్తు , తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారముద్వారా, మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక , తన్నుతాను అర్పించుకొన్నప్పుడు  తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించి యీ పని చేసి ముగించెను. – (హెబ్రీ. 7:28; 9:11,12,26-28).

పై వచనములను బట్టి క్రైస్తవులమైన మనకు లేవీ యాజకత్వము వర్తించదని ఖండితంగా నమ్మాలి. ఎందుకనగా ఈ లేవీ యాజకత్వము ఆరాధికుడికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు. క్రీస్తు అను మన ప్రధానయాజకుడు ఇట్టి యాజకత్వములో చేరక మెల్కీసెదెకు క్రమము చొప్పున యాజకుడుగా వచ్చి యాజక ధర్మము సహా మార్చెను.

» ఆ లేవీయులు యాజకులై యుండగా ప్రజలకు ధర్మశాస్త్రమియ్యబడెను గనుక, ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన యెడల అహరోను క్రమములో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమము చొప్పున వేరొక యాజకుడు రావలసిన అవరసమేమి? ఇదియు గాక యాజకులు మార్చబడిన యెడల అవశ్యముగా యాజక ధర్మము సహా మార్చబడును. ఎవని గూర్చి ఈ సంగతులు చెప్పబడెనో ఆయన వేరొక గోత్రములో పుట్టెను. ఆ గోత్రములోని వాడెవడును బలిపీఠము నొద్ద పరిచర్య చేయలేదు. – (హెబ్రీ. 7:10-12).

సత్య లేదా యదార్ధ ఆరాధికులు చేయవలసినది


క్రైస్తవులమైన మనము తండ్రియైన దేవుని మాత్రమే ఏ విధముగా ఆరాధించాలో క్రీస్తు వారు ఈ లోకములో ఉన్నపుడే మనకు తెలియజేసారు.

 యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అనెను. – (యోహాను. 4:23-24).

క్రొత్త నిబంధనలో పాడుట గూర్చి మాత్రమే చూడగలము కాని వాయిద్యములు లేవనుటకు క్రింది వచనములే మనకు సాక్ష్యమిస్తున్నాయి.

★ అంతట వారు కీర్తన "పాడి" ఒలీవల కొండకు వెళ్లిరి. – (మత్తయి. 26:30).

★ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు "పాడుచు"నుండిరి. -  (అపొ.కార్య. 16:25).

★ అన్యజనులలో నేను నిన్ను "స్తుతింతును"; నీ "నామసంకీర్తనము" చేయుదును. – (రోమా. 15:9).

 ★ ఆత్మతో "పాడుదును", మనస్సుతోను "పాడుదును". – (1 కొరి౦ధి. 14:15).

 ★ మీ హృదయములలో ప్రభువునుగూర్చి "పాడుచు" కీర్తించుచు. – (ఎఫెసీ. 5:19).

★ మీ హృదయములలో దేవునిగూర్చి "గానము" చేయుచు. - (కొలస్సి. 3:16).

★ సమాజముమధ్య నీ కీర్తిని "గానము" చేతును అనెను. – (హెబ్రీ. 2:12).

★ ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు "పాడవలెను". – (యాకోబు. 5:13).

క్రొత్త నిబంధనలో చెప్పబడిన ఏ వచనములలో కూడా తండ్రియైన దేవుని వాయిద్యములతో ఆరాధించినట్టుగా చూడలేము కనుక క్రైస్తవులమైన మనము వాయిద్యములతో ఆరాధించుట వ్యర్థమైన ఆరాధనే (మత్తయి. 15:9) అగును, విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము (రోమా. 14:23)  కనుక ఆలోచన చేసి వాక్యమును పరిశీలన చేసి సత్యమును గ్రహించవలెనని మీకు మనవి చేయుచున్నాను.    

 ● కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము. – (హెబ్రీ. 13:15). 


మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని పని" (the work of holy spirit in the new testament)



ప్రభువునందు ప్రియమైన పరిశుద్ధులందరికి నా హృదయపూర్వక వందనములు.

క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముని యొక్క పేర్లు :

» ఆత్మ.  (మత్తయి. 4:1; 12:31; ఎపేసి. 1:14).
» దేవుని ఆత్మ.  (రోమా. 8:9).
» ఆదరణ కర్త/ఉత్తరవాది.  (యోహాను. 15:26).
» సత్యస్వరూపియైన ఆత్మ.  (యోహాను. 16:13).
» మహాస్వరూపియైన ఆత్మ.  (1 పేతురు. 4:14).
» నిత్యుడగు ఆత్మ.  (హెబ్రీ. 9:14).

క్రొత్త నిబంధన గ్రంథము వ్రాయుంచుటలో పరిశుద్ధాత్ముని పని

ఒకడు తన ఊహనుబట్టి చెప్పుటవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏల యనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింప బడినవారై దేవుని మూలముగ పలికిరి. – (2 పేతురు. 1:20:21).


యేసు పుట్టుకలో పరిశుద్ధాత్ముడు

● అందుకు మరియ నేను పురుషుని ఎరుగనిదాననే; యిదేలాగు జరుగునని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీమీదికి వచ్చును; సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. – (లూకా. 1:34-35).

● అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ప్రభువుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై - దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్బము ధరించినది పరిశుద్ధాత్మవలన కలిగినది. – (మత్తయి. 1:20).

యేసు బాప్తీస్మములో పరిశుద్ధాత్ముడు

యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలోనుండి ఒడ్డుకు వచ్చెను; అప్పుడు ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. – (మత్తయి. 3:16; మార్కు. 1:10; లూకా. 3:22; యోహాను. 1:32).

అపోస్తులుల కాలములో పరిశుద్ధాత్ముడు

1)     అపోస్తులులు పరిశుద్దాత్మలో బాప్తీస్మము పొందుట :
» తండ్రి యొక్క వాగ్ధానమును అనగా పాత నిబంధనలో యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి (యోవేలు. 2:28) యేసు ముందుగా తండ్రియొక్క వాగ్ధానమును తన శిష్యులకి జ్ఞాపకము చేసి యెరూషలేములో వారు మాత్రమే పొందుకొనుటకు సహాయపడిరి (లూకా. 24:49; అపో.కార్య. 1:4; 2:3-4).

2)     అపోస్తులులతో పరిశుద్ధాత్ముడు చేసిన పని :
» అపోస్తులులకు సమస్తమును బోధించుటలోను, యేసు చెప్పిన సంగతులన్నిటిని జ్ఞాపకము చేయుటలోను పరిశుద్ధాత్ముడు వారికి ఉత్తరవాదిగా ఉన్నారు. (యోహాను. 14:26; 17:7). 

» పరిశుద్ధాత్ముడు, అపోస్తులుల ద్వారా యేసుని గూర్చిన సాక్ష్యమును లోకమునకు తెలియజేసారు. (యోహాను. 15:26).

» అపోస్తులులను సర్వసత్యములోనికి నడిపించుటలోను, ఆయన వినిన సంగతులను వారికి బోధించి సంభవింపబోవు సంగతులను వారికి తెలియజేసారు. (యోహాను. 16;13).

3)   అపోస్తులుల “తో”, “లో” ఉంటూ పరిశుద్ధాత్ముడు చేసిన కార్యాలు :  
» పుట్టినది మొదలుకొని కుంటివాడైన వ్యక్తిని అపోస్తులులతో పరిశుద్ధాత్ముడు స్వస్థపరిచెను. (అపో. కార్య. 3:1-9).

» పరిశుద్ధాత్మ అపోస్తులులలో ఉండుట వలన వారి నీడ సైతము పడి అనేకమంది స్వస్థపరచబడ్డారు. (అపో.కార్య. 5:15).

4)     అపోస్తులులు పరిశుద్ధాత్మ వలన సువార్త ప్రకటించుట :
 » పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా     మీకిప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై, తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలు పరచబడెను; దేవదూతలు ఈ కార్యములను తొంగిచూడ గోరుచున్నారు. (1 పేతురు. 1:12).

» నీవును నీ యింటివారందరును ఏ మాటలవలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని, తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూచిన సంగతి మాకు తెలిపెను. (అపో.కార్య. 11:14).

» పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనెను- ప్రజల అధికారులారా, పెద్దలారా... (అపో.కార్య. 4:8).

5)     మరుగైయున్న దేవుని సంకల్పము తెలియచేయుటలో పరిశుద్దాత్ముని పని :
» మనకైతే దేవుడు వాటిని తన ఆత్మవలన బయలుపరచి యున్నాడు; ఆత్మ అన్నిటిని, దేవుని మర్మములను కూడ పరిశోధించుచున్నాడుఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుష్యులలో మరి ఎవనికి తెలియును? ఆలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవుదేవునివలన మనకు దయచేయబడినవాటిని తెలిసికొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్దనుండి వచ్చు ఆత్మను పొందియున్నాము. మనుష్యజ్ఞానము నేర్పుమాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు, ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. (1 కొరింధి. 2:10-13).

» ఈ మర్మమిప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులుగు అపొస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి యున్నట్టుగా పూర్వకాలములయందు మనుష్యులకు తెలియపరచబడ లేదు.
ఈ మర్మమేదనగా - అన్యజనులు సువార్త వలన క్రీస్తుయేసునందు యూదులతోపాటు సమాన వారసులును, ఒక శరీరమందలి సాటి అవయవములును, వాగ్దానములో పాలివారలునై యున్నారను నదియే. (ఎఫెసీ. 3:5-6).

6)     అపోస్తులుల హస్తనిక్షేపణ చేయగా(చేతులుంచగా)  పరిశుద్దాత్ముని శక్తీ పొందునట్లు పనిచేసెను :
» అప్పుడు పేతురును యోహానును వారిమీద చేతు లుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. (అపో.కార్య. 8:17).

» తరువాత పౌలు వారిమీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారిమీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుటకును  ప్రవచించుటకును  మొదలుపెట్టిరి. (అపో.కార్య. 19:16).

7)     పరిశుద్దాత్ముడు తన చిత్తము చెప్పున కృపావరములు పంచి ఇచ్చెను :
» ఏలాగనగా, ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరియొకనికి ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును, మరియొకనికి ఆత్మవలననే విశ్వాసమును, మరియొకనికి ఒక్క ఆత్మవలననే స్వస్థపరచు వరములను మరియొకనికి అద్భుతకార్యములను చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలును, మరి యొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి. అయినను వీటినన్నిటిని ఆత్మ యొకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి యిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. (1 కొరింధి. 12:8-11).

.» దేవుడు సంఘములో మొదట కొందరిని అపొస్తలులు గాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటుపిమ్మట కొందరిని అద్భుత ములు చేయువారిని గాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారినిగాను, కొందరిని ఉపకారములు చేయువారినిగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాటలాడువారినిగాను నియమించెను. (1 కొరింధి. 12:28-31).

వాక్యము స్థిరపరచుటలో పరిశుద్ధాత్ముడు
కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొనిపోకుండునట్లు వాటియందు మరి విశేష జాగ్రత్త కలిగియుండవలెను ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలము పొందియుండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభువు బోధించుట చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియలచేతను మహత్కార్యములచేతను నానావిధములైన అద్భుతములచేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడ సాక్ష్యమిచ్చుచుండగా వినినవారిచేత మనకు దృఢపరచబడెను. – (హెబ్రీ. 2:1-4).

మీ ఆత్మీయ సహోదరుడు, 
మనోహర్ బాబు . 


The churches of Christ greet you - Roma 16:16