Showing posts with label కుటుంబము. Show all posts
Showing posts with label కుటుంబము. Show all posts
విజన్ - 2023 (Vision)
కుటుంబము క్రీస్తు సంఘము జీవితము ధనము పరిచర్య భక్తి సహవాసము![]() |
| విజన్ - 2023 (Vision) |
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.
సహోదరులారా, ప్రతి సంవత్సరము మన పరమదేవునికి వ్యక్తిగతముగా ఎన్నో మాటలిస్తుంటాము. చివరికి వాటిని పాటించక దేవునికి ఎంతో నష్టం కలిగిస్తూంటాము. ఈ సంవత్సరములో జరిగిన పొరపాట్లు మరల తిరిగి జరిగించక 2023 మరియు అటు మనకు అనుగ్రహింపు రోజులను/నెలలను/సంవత్సరములను వాక్యానుసారముగా సద్వినియోగము చేసికొనుచు మన దేవుడు కోరిన వాక్యానుసారమైన జీవితం కలిగి ఉండటానికి సిద్ధపడుదాం.
↛ (విలాపవాక్యములు. 3:40). "మన మార్గములను పరిశోధించి తెలిసికొని మనము యెహోవాతట్టు తిరుగుదము."
↛ (గలతి. 6:4): "ప్రతివాడును తాను చేయుపనిని పరీక్షించి చూచుకొనవలెను; అప్పుడు ఇతరునిబట్టి కాక తననుబట్టియే అతనికి అతిశయము కలుగును.౹"
↛ (1 కోరింథి. 11:28,31). "కాబట్టి ప్రతిమనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను; అయితే మనలను మనమే విమర్శించుకొనినయెడల తీర్పు పొందక పోదుము.౹"
↛ (ప్రసంగి. 1:9-11): "మునుపు ఉండినదే ఇక ఉండబోవు నది;మునుపు జరిగినదే ఇక జరుగబోవునది; సూర్యుని క్రింద నూతనమైన దేదియు లేదు.౹ ఇది నూతనమైనదని యొకదానిగూర్చి యొకడు చెప్పును; అదియును మనకు ముందుండిన తరములలో ఉండినదే.౹ పూర్వులు జ్ఞాపకమునకు రారు; పుట్టబోవువారి జ్ఞాపకము ఆ తరువాత నుండ బోవువారికి కలుగదు."
↛ (ఎఫెసీ. 5:15-17): దినములు చెడ్డవి గనుక, మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు, అజ్ఞానులవలె కాక, జ్ఞానులవలె నడుచుకొనునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి.౹ ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువుయొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి.౹"
వ్యక్తిగత జీవితము (Personal Life)
➦ “రహస్య పాపములు కలిగియున్ననా”..?
➦ “చెడు స్నేహము మరియు చెడు అలవాట్లు ఉన్నాయా”..?
➦ “పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నానా”..?
➦ “చెడు తలంపులకు చోటు ఇచ్చానా”..?
➦ “వ్యర్థమైన వాటికి సమయం కేటాయించానా”..?
➦ “వ్యర్థమైన వాటికి సమయం కేటాయించానా”..?
➦ "ఎవరికీ (దేవునికి/మనుషులకు) దాసులైయున్నాను"..?
➦ "నా మనసాక్షి దోషారోపణ చేయుచున్నప్పటికీ సమర్ధించుకొనుచున్నానా"..?
➦ "నా కనులు, చేతులు, ఆలోచన, హృదయము, మనస్సు నిజముగా వేటినైనా ఆశిస్తున్నాయా"..?
➦ "నా మనసాక్షి దోషారోపణ చేయుచున్నప్పటికీ సమర్ధించుకొనుచున్నానా"..?
➦ "నా కనులు, చేతులు, ఆలోచన, హృదయము, మనస్సు నిజముగా వేటినైనా ఆశిస్తున్నాయా"..?
కుటుంబ జీవితము (Family Life)
⟹ “భాగస్వామితో నమ్మకంగా/అపనమ్మకంగా ఉన్నానా”..?
⟹ “పిల్లలను దేవునిలో పెంచగలుగుతున్నానా”..?
⟹ “తల్లిదండ్రులకు విధేయత/అవిధేయత చూపానా”..?
⟹ “ఇంటిపనులలో సహకరించానా/ తృణీకరించానా”..?
⟹ “ఇంటిలో అశాంతికి/శాంతికి కారణమామయ్యానా”..?
⟹ "నా కుటుంబములో నాయకత్వాన్ని సక్రమముగా చేయుచున్నానా"..?
⟹ "నేను నా భర్త/భార్య అన్యుల/పరిశుద్ధుల మధ్య మాట్లాడువాటిని తెలుసుకోగలుగుచున్నానా"..?
⟹ "నా ఇంటివారి నోటి మాటలు విని పరిశుద్ధులను పొగగొట్టుకొనుచున్నానా"..?
⟹ "అందరితో సరియైన సంబంధాలు కలిగియున్నానా"..?
⟹ "నా కుటుంబములో నాయకత్వాన్ని సక్రమముగా చేయుచున్నానా"..?
⟹ "నేను నా భర్త/భార్య అన్యుల/పరిశుద్ధుల మధ్య మాట్లాడువాటిని తెలుసుకోగలుగుచున్నానా"..?
⟹ "నా ఇంటివారి నోటి మాటలు విని పరిశుద్ధులను పొగగొట్టుకొనుచున్నానా"..?
⟹ "అందరితో సరియైన సంబంధాలు కలిగియున్నానా"..?
భక్తి జీవితము (Devotion Life)
⟿ “గ్రంథము చదవడం”
- (దేవుడు మనతో మాట్లాడటం).
⟿ “ప్రార్థన చేయడం” - (మనం దేవునితో మాట్లాడటం).
⟿ “దేవుని కోసం ఉపవాసం ఉన్నానా”..?
⟿ “దేవుడు నాపై తప్పుమోపిన విషయములో నా హృదయం కఠినపరుచుకున్నానా/సమ్మతిపరుచుకున్నానా”..?
⟿ “దేవుడు నాపై తప్పుమోపిన విషయములో నా హృదయం కఠినపరుచుకున్నానా/సమ్మతిపరుచుకున్నానా”..?
⟿ “ఈ సంవత్సరము అంతానన్నువెంటాడిన
శోధనలు/శ్రమలు/బలహీనత/పాపం ఏంటి”..?
⟿ “నన్నువెంటాడిన వాటి విషయములో నిజముగా మారుమనస్సు పొందానా”..?
⟿ “నన్నువెంటాడిన వాటి విషయములో నిజముగా మారుమనస్సు పొందానా”..?
⟿ “నా పరిశుద్ధత/రక్షణ విషయములో శ్రద్ధ తీసుకున్నానా”..?
⟿ "నేను వాత వేయబడిన మనసాక్షి/హృదయ కాఠిన్యము కలిగియున్నానా"..?
⟿ "దిద్దుబాటును ప్రేమించ లేనివాడిగా నున్నానా"..?
⟿ "నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషింస్తూన్నానా"..?
⟿ "నేను వాత వేయబడిన మనసాక్షి/హృదయ కాఠిన్యము కలిగియున్నానా"..?
⟿ "దిద్దుబాటును ప్రేమించ లేనివాడిగా నున్నానా"..?
⟿ "నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషింస్తూన్నానా"..?
పరిచర్య జీవితము (Service Life)
➾ “దేవుని పనిలో ఏమైనా పోల్గొన్నానా”..?
➾ “దేవుని పని చేయడానికి అవకాశాలు వచ్చాయా”..?
➾ “నాకు వచ్చిన అవకాశాలు ఏమేరకు ఉపయోగించుకున్నాను”..?
➾ “నాకు వచ్చిన అవకాశాలు ఏమేరకు ఉపయోగించుకున్నాను”..?
➾ “నశించు ఆత్మల పట్ల భారం కలిగియున్నానా”..?
➾ “సత్యానికి భిన్నమైన బోధ చేయుచున్నానా”..?
➾ “కల్పన కథలకు చెవి యొగ్గుతున్ననా”..?
➾ "అసత్యాన్ని ప్రోత్సహిస్తున్నానా"..?
➾ “నా సొంత అభిప్రాయాలను & ఆలోచనలను నెరవేర్చుకునే
విషయములో సంఘమును వాడుకొంటున్నానా”..?
➾ "నేను ఎక్కువగా ఎవరికీ ప్రాధాన్యత ఇస్తున్నాను రక్త సంబంధులకు (లేక) నిజవిశ్వాసుకులక"..?
సహవాస జీవితము (Communion Life)
➟ “సహవాసాన్ని నిర్లక్ష్యము/లక్ష్యము చేయుచున్నానా”..?
➟ “ఆత్మీయ ఆలోచనను త్రోసిపుచ్చుతున్నానా”..?
➟ “నిజ విశ్వాసులతో ఎవరితోనైనా విభేదాలు కలిగియున్నానా”..?
➟ “నిజ విశ్వాసులతో సమాధానము పడుట తప్పిపోయానా”..?
➟ "సహోదరులను ప్రేమిస్తున్నానా"..?
➟ “ప్రార్ధించుటకు బదులు దుష్ప్రచారం చేయుచున్నానా”..?
(ప్రార్ధించు - సవరించు)
➟ “వాక్యానుసారమైన దైవజనుడుతో అమర్యాదగా ప్రవర్తించాన”..?
➟ “నీ కంటే నేను మెరుగు అనే భావన నాలో ఉందా”..?
➟ “నేను వేషధారణ కలిగియున్నానా”..?
➟ "నా తప్పులను చూసిన వారిని, ప్రశ్నించేవారిని నిందలు వేసి సంఘములో నుండి వెళ్లగొట్టుచున్నానా"..?
➟ "సహోదరుల మీద ఉండే ప్రేమను కొనసాగించడానికి వాళ్ళు బోధించునది అసత్యమని తెలిసికూడా వారిని ప్రోత్సహిస్తున్నానా"..?
➟ "శరీరమును ఆస్పదము చేసుకొనుచు సహవాసము చేయుచున్నానా"..
➟ "నా తప్పులను చూసిన వారిని, ప్రశ్నించేవారిని నిందలు వేసి సంఘములో నుండి వెళ్లగొట్టుచున్నానా"..?
➟ "సహోదరుల మీద ఉండే ప్రేమను కొనసాగించడానికి వాళ్ళు బోధించునది అసత్యమని తెలిసికూడా వారిని ప్రోత్సహిస్తున్నానా"..?
➟ "శరీరమును ఆస్పదము చేసుకొనుచు సహవాసము చేయుచున్నానా"..
డబ్బు జీవితము (Money
Life)
⟼ “దేవుడు ఇచ్చిన డబ్బును ఏ సందర్భములో వృథా చేశాను”..?
⟼ “నా కష్టారిజీతాన్ని దేవుని పనికి ఎంత వరకు ఖర్చు
చేశాను”..?
⟼ “ఎవరి అక్కరలోనైన సహాయము చేశానా”..? (బీదలు, నిజమైన విధవరాండ్రులు/అనాథులు).
⟼ “ఎవరి అక్కరలోనైన సహాయము చేశానా”..? (బీదలు, నిజమైన విధవరాండ్రులు/అనాథులు).
⟼ "నా ధనాపేక్షత వలన నిత్యజీవమునకు దూరమగుచున్నానా"..?
⟼ "నేను అన్నవస్త్రములుతో తృప్తిపొందియున్నానా"..?
⟼ "నేను నావారి కొరకు ధనము సంపాదించుకొనే పనిలో నిమగ్నమై పరమదేవున్ని ఆరాధించుటకు దూరమగుచున్నానా"..?
⟼ "నేను ఇతరుల/విదేశీయులు ధనమును సేవ పేరుతో పోగుచేసుకొనే పనిలోనున్నానా"..?
హెచ్చరిక :
"ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి.౹" (ప్రసంగి. 12:13).
"ఇల్లు" (The House)
ఇల్లు కుటుంబము దేవుడు పిల్లలు![]() |
ఇల్లు |
పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.
ఇల్లు అనగా మనకు రెండు విషయములు గుర్తుకువస్తాయి ఒకటి భౌతిక
సంబంధమైనది రెండు ఆత్మ సంబంధమైనది. అయితే ఆత్మ సంబంధమైన ఇల్లు
అనగా సంఘము (1 కొరింధి 3:9; గలతీ. 6:10) గూర్చి ఇంతకుముందు వ్రాసిన అంశము
ద్వారా తెలుసుకున్నాము. ఇప్పుడు భౌతిక సంబంధమైన ఇంటిని గూర్చి తెలుసుకుందాము.
క్రైస్తవులమైన మనము పరిశుద్ధ గ్రంథము చెప్పిన విధముగా మంచి కుటుంబముగా లేక దేవుని ఇంటిగా కట్టబడుతున్నామా? దేవునికి యిష్టానుసారముగా మన కుటుంబములను మన
ఇంటిని ముందుకు నడిపిస్తున్నామా? ఒక క్రైస్తవుని కుటుంబము ఎలా ఉండాలో గ్రంధమును
పరిశీలన చేస్తున్నామా?
ఈ విషయాలను ఆలోచన చేసి మన కుటుంబము లేక ఇల్లు ఏ విధముగా ఉండాలని దేవుడు
ఆశ పడుతున్నాడో గ్రంధము ఆధారముగా వచనములను చూసి మార్పు చెందుదాము.
ఇంటిని గూర్చి గ్రంథ వివరణ
A). క్రైస్తవులమైన మనము, మన ఇల్లు దేవునికి సంబంధించిన ఒక వ్యవస్థ అని,
దానికి ఆయన అధికారియై యున్నాడని మొదట గ్రహించుకోవాలి. ఎందుకనగా ఆదాముని నిర్మించిన
దేవుడు నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని యెంచి హవ్వని నిర్మించి వారిని ఒక
కుటుంబముగా, ఒక యింటిగా కట్టెను.
● దేవుడైన యెహోవా నేలమంటితో
నరుని నిర్మించి,.. – (ఆది. 2:7).
● అప్పుడు దేవుడైన యెహోవా
ఆదామునకు గాఢనిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి
ఆ చోటును మాంసముతో పూడ్చి వేసెను తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను
స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము నొద్దకు తీసికొనివచ్చెను. – (ఆది. 2:21-22).
B). ఇల్లు కుటుంబ సభ్యులతో
కూడిన ఒక విభాగము. దానికి అధికారి పురుషుడు లేక భర్త.
● ఆదాము (భర్త), హవ్వ
(భార్య), కయీను, హేబెలు (కుమారులు), etc... - (ఆది. 2:24; 4:1-2).
C). ప్రతి ఇంటిలోనూ భర్త
మాత్రమే నాయకుడుగా ఉండాలి మరియు తన భార్యను, పిల్లలను సరియైన పద్ధతిలో నడిపించే వాడుగా ఉండి దేవుని
నామాన్ని మహిమపరచాలి.
● క్రీస్తు సంఘమునకు శిరస్సైయున్నలాగున
పురుషుడు భార్యకు శిరస్సైయున్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై యున్నాడు. – (ఎఫెసీ.
5:23).
● ప్రతి పురుషునికి శిరస్సు
క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తుకు శిరస్సు దేవుడనియు
మీరు తెలిసికొనవలెనని కోరుచున్నాను. – (1 కొరింధి. 11:3).
● సంపూర్ణమాన్యత కలిగి
తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు, తన యింటివారిని బాగుగ ఏలువాడునైయుండవలెను. – (1
తిమోతి. 3:4).
D). ప్రతి ఇంటిలోనూ భర్త
తన కుటుంబమును పోషించేవాడిగా ఉండాలి. ఎందుకనగా మొదటి నుండి పురుషులే పని చేసి తమ
కుటుంబములను పోషించేవారిగా ఉన్నారని గ్రంథము తెలియజేస్తుంది.
● మరియు దేవుడైన యెహోవా
నరుని తీసికొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుటకును దానిలో ఉంచెను. – (ఆది.
2:15).
● ఎవడైనను స్వకీయులను, విశేషముగా తన యింటివారిని, సంరక్షింపకపోయినయెడల వాడు విశ్వాస త్యాగము చేసినవాడై
అవిశ్వాసికన్న చెడ్డవాడై యుండును – (1 తిమోతి. 5:8).
E). ప్రతి ఇంటిలోనూ భర్త
భార్యను ప్రేమించేవానిగా ఉండాలి. క్రీస్తు ఎలాగైతే సంఘమును ప్రేమించి తన శరీరమును
అర్పించాడో అలాగే భర్త కూడా తన భార్యను ప్రేమించాలి.
● పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలె క్రీస్తుకూడ సంఘమును
ప్రేమించి, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక, పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను
మహిమగల సంఘముగాను ఆయన తనయెదుట దాని నిలువబెట్టుకొనవలెనని, వాక్యముతో ఉదకస్నానముచేత
దాని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దానికొరకు తన్నుతాను అప్పగించుకొనెను. – (ఎఫెసీ.
5:25).
● అటువలెనే పురుషులుకూడ
తమ స్వశరీలములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. – (ఎఫెసీ. 5:28).
F). ప్రతి ఇంటిలోనూ
భార్య గృహనిర్వాహకురాలై యుండి ఇంటనుండి పని చేసుకునేదానిగా ఉండాలి.
● కాబట్టి యౌవనస్త్రీలు
వివాహము చేసికొని, పిల్లలు కని గృహపరిపాలన జరిగించుచు, నిందించుటకు విరోధికి అవకాశమియ్యకుండవలెనని కోరుచున్నాను. – (1 తిమోతి.
5:14).
● ఆలాగుననే వృద్ధస్త్రీలు
కొండెకత్తెలును, మిగుల మద్యపానాసక్తులునైయుండక, ప్రవర్తనయందు భయభక్తులుగలవారై యుండవలెననియు; దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు, యౌవనస్త్రీలు తమ భర్తలకు లోబడుచు, పతిప్రియులును శిశుప్రియులును
స్వస్థబుద్ధిగలవారును పవిత్రులును ఇంట ఉండి పనిచేసికొనువారును మంచివారునై యుండవలెనని.
– (తీతుకు. 2:5).
G). ప్రతి ఇంటిలోనూ
భార్య తన భర్తకు లోబడి విధేయత చూపడమే తనకు అలంకారముగా ఎంచుకుని కుటుంబము విషయములో
జాగ్రత్త కలిగి భర్తను గౌరవించాలి.
● స్త్రీలారా, ప్రభువునకువలె మీ స్వపురుషులకు లోబడియుండుడి. – (ఎఫెసీ. 5:22).
● భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి; ఇది ప్రభువునుబట్టి యుక్తమైయున్నది.
– (కొలస్సి. 3:18).
● అటువలె పూర్వము దేవుని
ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలును తమ స్వపురుషులకు లోబడియుండుటచేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడియుండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు, ఏ భయమునకు బెదరకయున్నయెడల
ఆమెకు పిల్లలగుదురు – (1 పేతురు. 3:5-6).
● భార్యయైతే తన భర్తయందు
భయము కలిగియుండునట్లు చూచుకొనవలెను. – (ఎఫెసీ. 5:33).
H). గర్భ ఫలము దేవుడిచ్చు
బహుమానము కనుక ప్రతి ఇంటిలోనూ తల్లితండ్రులు తమ పిల్లలను దేవుని జ్ఞానములో పెంచేవారిగా
ఉండి వారికి కోపము రేపక వారికి అన్నిటిని సమకూర్చే వారిగా ఉండాలి.
● కుమారులు యెహోవా అనుగ్రహించు
స్వాస్థ్యము గర్భఫలము ఆయన యిచ్చు బహుమానమే. – (కీర్తన. 127:3).
● నీ పూర్ణహృదయముతోను నీ
పూర్ణాత్మతోను నీ పూర్ణశక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను.
నేడు నేను నీకాజ్ఞాపించు
ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును
వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టు కొనవలెను. – (ద్వితియో.
6:5-7).
● తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువుయొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. –
(ఎఫెసీ. 6:4).
I). ప్రతి యింటిలోను
పిల్లలు అన్ని విషయములలోను తమ తల్లి
తండ్రుల మాటలు విని వారికి విధేయులై ఉండాలి.
● పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధేయులైయుండుడి; ఇది ధర్మమే. – (ఎఫెసీ.
6:1).
● పిల్లలారా, అన్నివిషయములలో మీ తలిదండ్రుల మాట వినుడి; ఇది ప్రభువునుబట్టి మెచ్చుకొనదగినది.
– (కొలస్సి. 3:20).
కాబట్టి ప్రియులారా,
క్రైస్తవులమైన మన ఇల్లు ఏ విధముగా ఉన్నది? గ్రంథములో చెప్పిన విధముగా పురుషుడు
కుటుంబమును పోషిస్తున్నాడా? నీ ఇంటిలో పురుషుడే అధికారము చేయుచున్నాడా? నీ భార్య ఇంటి
బాధ్యతలు నెరవేర్చి భర్తకు లోబడుతున్నదా? నీ పిల్లలని దేవుని శిక్షలోను,
జ్ఞానములోను పెంచుతున్నావా?. ఆలోచన చేయు గ్రంధములో చెప్పబడిన మాటలను పరిశీలన చేసి
నీ కుటుంబము దేవుని విరోధముగా నడుచుకుంటున్నట్లయితే ఈ క్షణమే నీ మనస్సు మార్చుకుని
నీ కుటుంబమును సరియైన దారిలో నడిపించి దేవుని నామాన్ని మహిమ పరిచి ఆయన యిచ్చే
ప్రతి ఆశీర్వాదమును పొందుకో.
మీ ఆత్మీయ సహోదరుడు,
» మనోహర్ బాబు. ©
"దేవుని క్రమములో పురుషుని పాత్ర". (Role of Men)
కుటుంబము పురుషుడు పాత్ర శాపము సంఘము సువార్త స్త్రీ పాత్ర
అంశము: "దేవుని క్రమములో పురుషుని పాత్ర".
నా తోటి సహోదరీ, సహోదరులారా!!
మీకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.
(ఆదికాండము. 2: 7)
దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
◆ నరుడు - దేవుని పోలిక దేవుని స్వరూపం - ఆత్మ
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; (ఆదికాండము. 1:27).
ఆది యందు మన తండ్రియైన దేవుడు స్త్రీ లేనప్పుడే అనగా ఆదాము ఒంటరిగా ఉన్న దినములలో(ఆదికాండము. 2:18) అయన తన ఆలోచనలను, ఆజ్ఞలను ఆదాముకి జారీచేశారు.
తండ్రియైన దేవుడు మొదటి మనుష్యుడు(నరుడు) ఒంటరిగా నుండుట మంచిది కాదు అని చూసి అతనికి సాటియైన సహాయము కొరకు దేవుడు ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించారు. (ఆది. 1:27; 2:18; 21-22).
● స్త్రీ ద్వారా శాపము కలుగకమునుపు వారు ఇరువురు దేవునితో మంచి ఆత్మీయ సంబంధములు కలిగి ఉండేవారు.
● దేవుడు వారిని ఆశీర్వదించి, ఫలించమని, అభివృద్ధిపొందమని, విస్తరించమని, భూమిని నిండించి దానిని లోబరచుకొనమని చెప్పెను. (ఆది. కాండ. 1:28).
● దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మరచి స్త్రీకి లోబడుట వలననే ఆదాము ఆమె చేత మోసగింపబడ్డాడు. (ఆది. 2:17; 3:17; 1 తిమోతి. 2:14).
"పురుషుని నాయకత్వములో ఆశీర్వదింపబడిన కుటుంబాలు"
● "నోవహు కుటుంబము" - (ఆది. 7:13; హెబ్రీ. 11:7).
● "అబ్రాహాము కుటుంబము" - (ఆది. 18:18-19; హెబ్రీ. 11:8; 17).
● "ఇస్సాకు కుటుంబము" - (ఆది. 25:21-23; హెబ్రీ. 11;9; 20).
● "యాకోబు కుటుంబము" - (ఆది. 28:13-15; హెబ్రీ. 11:21).
● "యోసేపు కుటుంబము" - (ఆది. 39:23; 41:45-46; హెబ్రీ. 11:22).
● "మోషే కుటుంబము" - (నిర్గమ. 2:21-25; 3:12 హెబ్రీ. 11:23-26).
● "యెహోషువ కుటుంబము" - (యెహోషువ. 24:15)
● "దావీదు కుటుంబము" - (2 సమూయేలు. 7:29).
● "యోబు కుటుంబము" - (యోబు. 1:1-5).
● "పేతురు కుటుంబము" - (1 కొరింథీ. 9:5).
● "అకుల కుటుంబము" - (అపొ.కార్య. 18:26; రోమా.16:3).
● "కొర్నేలి కుటుంబము" - (అపొ.కార్య. 10:1-2).
● "చెరసాల నాయకుని కుటుంబము" - (అపొ.కార్య. 16:27; 31-33).
"స్త్రీకి లోబడిన పురుషుని యొక్క స్థితి"
● "హవ్వకి లోబడిన ఆదాము". - (ఆది. 3:6).
*ఫలితము - (ఆది. 3:9-21).
● "యెజెబెలుకి లోబడిన అహాబు" - (1 రాజులు. 21:6-8). *ఫలితము - (1 రాజులు. 22:21-40).
● "భార్యలుకు లోబడిన సొలొమోను" - (1 రాజులు. 11:1-8). *ఫలితము - (1 రాజులు. 11:11-14).
● "హేరోదియకు లోబడిన హేరోదు". - (మత్తయి. 14:3-11).
● "సప్పీరాతో ఆలోచనలో లోబడిన అననీయ" - (అపొ.కార్య. 5:1-4). *ఫలితము - (అపొ.కార్య. 5:5-10).
కుటుంబములో భార్య - భర్తల మధ్య పాత్ర
A). భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడుపవలెను. -
(1 కొరింథీ. 7:3).
B). పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. - (ఎఫెసీ. 5: 25).
C). పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు - (ఎఫెసీ. 5:28)
D). ఎక్కువ "బలహీనమైన ఘటమని" భార్యను సన్మానించి - (1 పేతురు 3:7a)
E). జ్ఞానము చొప్పున కాపురము చేయాలి. - (1పేతురు 3:7b).
F). భార్యను లేదా భర్తను దూరముగా పెట్టె కార్యక్రమమును దేవుడు అంగీకరించడు. -
(1 కొరింథీ. 7:5).
G). భర్త తన సొంత భార్యను పోషించి సంరక్షించుకొనవలెను. - ( ఎఫెసీ. 5:30).
H). అవిశ్వాసురాలైన భార్య యుండి, ఆమె అతనితో కాపురము చేయ నిష్టపడిన యెడల, అతడు ఆమెను పరిత్యజింపకూడదు. -
(1 కొరింథీ. 7:12).
I). అవిశ్వాసురాలైన భార్య విశ్వాసియైన భర్తనుబట్టి (మూలభాషలో-సహోదరుని బట్టి) పరిశుద్ధపరచబడును. - (1 కొరింథీ. 7:14).
J). "మీరు యోగ్య ప్రవర్తనులై, తొందర యేమియు లేక ప్రభువు సన్నిధాన వర్తనులైయుండవలెనని యిది మీ ప్రయోజనము నిమిత్తమే చెప్పుచున్నాను." - (1 కొరింథీ. 7:33-35).
K). "సత్యము కొరకు పోరాటము చేస్తున్న తన భార్యకి పురుషుడు మంచి సహకారై ( అకుల వలె) ఉండాలి." - (అపొ.కార్య 18:26; రోమా 16:4).
L). "పురుషుడు వచ్చి భార్యను హత్తుకొనిన యెడల వారు ఇరువురు ఏక శరీరమైయుందురు కావున వారి ఆలోచనలు, పనులు, నిర్ణయాలు ఒక్కటిగా ఉండాలి" - (ఆది. 2:24; మత్తయి. 19:5; మార్కు. 10:7; ఎఫెసీ. 5:31).
M). "పిల్లలును దేవునిలో పెంచే కార్యక్రమము భార్యభర్తలకు ఇవ్వబడినది". - (ద్వితీయో. 6:7-9; సామెతలు. 22:6; ఎపేసి. 5:31).
N). భార్యకు బద్ధుడవైయుంటివా? విడుదల కోరవద్దు. భార్యలేక విడిగానుంటివా? వివాహము కోరవద్దు. - (1 కొరింథీ. 7: 27).
O). పురుషుడు తన యింటి వారును బాగుగా ఏలువాడునై యుండాలి. - (1 తిమోతి. 3:4).
P). పురుషుడు తన యింటివారిని ఏలనేరక పోయినయెడల అతడు దేవుని సంఘమును ఏలాగు పాలించును? - (1 తిమోతి. 3:5).
Note:- కుటుంబములో లోకానుసారమైన సమస్యలు ఉంటే సంఘములో ఆ పురుషుడు పరిపాలన చేయుటకు అర్హత లేదు.
"సంఘములో పురుషుని యొక్క బాధ్యత"
● దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడ నక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను(సరిగా విభజించు వానిగాను) నిన్ను నీవే దేవునికి కనుపరచు కొనుటకు జాగ్రత్తపడుము. - (1 తిమోతి. 2:15; ఎజ్రా. 7:10).
● ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై, పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. -
(1 తిమోతి. 2:8).
● వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించాలి. - (1 కొరింథీ. 1:17; 2:1 9:16; ఎఫెసీ. 6;19 )
● మిక్కిలి అల్పులైన నీ తోటి సహోదరులకు మేలు చేయవలెను - (మత్తయి. 25:32-40; 2థెస్స. 3: 13).
● అపొస్తలుల ద్వారా వ్రాయబడిన ప్రతి పత్రికలో మనకి బోధింపబడిన విధులను(పారంపర్యములను) చేపట్టాలి. - (2థెస్స. 3:15; 2 తిమోతి 1:13).
● ఒకడు బోధించినయెడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను - (1 పేతురు. 4:11).
● సంఘములో అధ్యక్ష పదవిని ఆశించినయెడల (1 తిమోతి. 3:1-5) లో చెప్పబడిన లక్షణములు కలిగి ఉండవలెను.
● సంఘములో పెద్దగా ఉండగోరువారు (తీతుకు. 1:5-9) లో చెప్పబడిన లక్షణములు కలిగి ఉండవలెను.
● జారత్వమునకు దూరముగా ఉండాలి మరియు శరీరాశయు నేత్రాశయు జీవపుడంబము విషయములో జాగ్రత్త కలిగి ఉండాలి - ( 1థెస్స. 4: 3; 1యోహాను. 2:16).
● సమాజముగా కూడుట మానక, ఒకనినొకడు హెచ్చరించుచు, ఆ దినము (ప్రభువు దినము) సమీపించుట మీరు చూచినకొలది మరి యెక్కువగా అలాగు చేయుచు, ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని(మూలభాషలో-లేపవలెనని) ఆలోచింతము. - (హెబ్రీ. 10:24-25).
● ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొని రావలెను. - (గలతీ. 6:1).
● సంఘములో పురుషులు మధ్య ఉపదేశము చేయుటకు తన భార్యకు అధికారము ఇవ్వకూడదు. - (1 కొరింథీ. 14:34-35; 1 తిమోతి. 2:12).
● పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనవలెను. - (రోమా. 12:1).
● బలహీనుల దౌర్భల్యములను భరించుటకు మరియు సత్యమునకు సహాయకులమవునట్టు(జతపనివారమవునట్లు) అట్టివారికి ఉపకారము చేయ బద్ధులమై యున్నాము. - (రోమా. 15:1; 3 యోహాను. 1:8).
● సంఘములో వృద్ధుని - తండ్రి గాను,
సంఘములో వృద్ధ స్త్రీలను - తల్లులు గాను,
సంఘములో యౌవనులను - అన్నదమ్ములు గాను, సంఘములో యౌవన స్త్రీలను - అక్కచెల్లెండ్రలు గాను భావించి హెచ్చరిక చేయుము. ఇది దేవుని దృష్టికనుకూలమైయున్నది. - (1 తిమోతి. 5:1-5).
గమనిక
◆ కుటుంబములో ప్రతి పురుషుడు తన యొక్క బాధ్యత సక్రమముగా నిర్వర్తిస్తే ఏ కుటుంబము కూడా దేవునికి దూరము కాదు.
◆ సంఘములో ప్రతి పురుషుడు తన యొక్క బాధ్యత గూర్చి ఆలోచించగలిగి అట్టి రీతిగా నడుచుకోగలితే ఆ సంఘము అభివృద్ధి చెందే విషయములో ముందడుగులో ఉంటుంది.
హెచ్చరిక
◆ స్త్రీ పాత్ర లేనిదే పురుషుడు నాయకుడు కాలేడు.
◆ పురుషుడుకు మాత్రమే ఇవ్వబడిన నాయకత్వపు లక్షణములను స్త్రీ అనుసరిoచకూడదు.
* దేవుని క్రమములో స్త్రీ పాత్ర * Click HERE
మీ ఆత్మీయ సహోదరుడు,
మనోహర్ బాబు గుడివాడ
దేవుని క్రమములో స్త్రీ పాత్ర (Role of Women)
కుటుంబము పురుషుడు పాత్ర శాపము సంఘము సువార్త స్త్రీ పాత్ర
💌 అంశము: స్త్రీ పాత్ర (Role of women).
నా తోటి సహోదరీ, సహోదరులారా!
మీకు మన ప్రభువువైన యేసుక్రీస్తు నామములో నా వందనములు.
నా ప్రియులారా!!
ఆది యందు మన తండ్రియైన దేవుడు స్త్రీ లేనప్పుడే అనగా ఆదాము ఒంటరిగా ఉన్న దినములలో(ఆది. కాండము. 2:18) అయన తన ఆలోచనలను, ఆజ్ఞలను ఆదాముకి జారీచేశారు.
● (ఆది. కాండము. 2:17).
"నీవు"(ఆదాము) మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు.
● (ఆది. కాండము. 3: 17).
"నేను(దేవుడు) నీకు(ఆదామునకు) ఆజ్ఞాపించిన....."
∆ ఆదాముకి మాత్రమే ఇవ్వబడిన ఈ ఆజ్ఞను కాస్తా స్త్రీ నిర్మాణము (ఆది.2:21-23) పిమ్మట...
అపవాది(ఘట సర్పము) ఇలా కలిపేశాడు. అదేమనగా, "మీరు తినకూడదా అని". (ఆది. కాండము. 3:1) మరియు "మీరు చావనే చావరు" అని (ఆది. కాండము. 3:4).
∆ అప్పుడే దేవుని ఆలోచనలకు, ఆజ్ఞకి కల్పితము జరిగింది అంటే వాస్తవానికి ఆదాము హవ్వ కి చెప్పి ఉండవచ్చు కారణము "మేము తినవచ్చు"(ఆది.కాండము. 3:2); " మీరు చావకుండునట్లు".(ఆది. కాండము.3:3).
∆ దేవుడైన యెహోవా ఈ ఆజ్ఞను "స్త్రీ"(హవ్వ) కి ఇచ్చినట్టుగా చూడలేము.
∆ "హవ్వకి దేవుని యొక్క ఆజ్ఞను ఆదాము చెప్పాడు". దీనిని బట్టి మన తండ్రియైన దేవుడు ఆత్మ సంబంధమైన విషయాలలో స్త్రీ నడిపింపు మీద లేదా స్త్రీ మీద నాయకత్వ కార్యక్రమము పురుషుడులో పెట్టాడు.
∆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను హవ్వ(స్త్రీ) మాత్రమే తిని ఉంటే ఇంత సమస్య ఉండేది కాదేమో. హవ్వ తిన్నాక కూడా ఏమి జరగలేదు.
" ఆమె దాని ఫలములలో కొన్ని తీసికొని తిని తనతోపాటు ఆదామునకు ఇచ్చెను, అతడుకూడ తినెను" (ఆది. కాండము 3:6)
∆ ఆదామునకు మాత్రమే ఇవ్వబడిన ఆ ఆజ్ఞను మీరి దేవునికి లోబడక, స్త్రీకి లోబడుట చేతనే "వారిద్దరి కన్నులు తెరవబడి, వారు తాము దిగంబరులమని తెలుసుకున్నారు" (ఆది. కాండము. 3:7).
★ ఫలాలను తినకూడదు అనే విషయములో స్త్రీ(హవ్వ) ఎక్కడ తనని తిరస్కరిస్తాదేమోనని ఆలోచన చేసిన పురుషుడు(ఆదాము) తన నాయకత్వమును స్త్రీకి అప్పగించేసాడు.
★ పురుషుడు మీద నాయకత్వమును చేసే కార్యక్రమము స్త్రీకి దేవుడు ఇవ్వలేదు.
★ ఆదాము తన దోషములును దాచిపెట్టాడు - (యోబు. 31:33).
★ "ఆదాము నిబంధన మీరినాడు". - (హోషేయా. 6: 7).
★ ఆదాము, హవ్వ ఇరువురు అవిధేయ స్థితిలోనికి వెళ్లిపోయారు.
■ భర్త అవిధేయుడు అయినచో భార్య అతని మీద నాయకత్వము చేయకూడదు.
"ఆమె పవిత్ర ప్రవర్తన బట్టియు, వాక్యము లేకుండనే తమ భార్యల నడవడివలన అతనిని రాబట్టబడవచ్చును. - (1 పేతురు 3:2).
■ ఆదిలో స్త్రీ(హవ్వ) తన భర్తను(ఆదాము) నడిపించే అధికారమును తీసుకొంది.
■ పురుషుడును మాటలతో ఆకర్షించడానికి, మాటలతో అధికారము చేయుటకు, మాటలతో నడిపించుటకు స్త్రీని అలా ఉద్దేశించి దేవుడు రూపకల్పన చేయలేదు.
★ "స్త్రీ పురుషునికి ఉపదేశము చేయుటకు, పురుషుడు మీద అధికారము చేయుటకు సెలవు లేదు" - (1 తిమోతి 2:12). ఆదిలో స్త్రీ చేత ఆదాముకి ఉపదేశము, అధికారము ఏదెను తోటలో జరిగింది.
★ ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములోపడెను. (1 తిమోతి. 2:14).
* ఏదెను తోటలో సర్పము(అపవాది) ఆదామును మోసపరచలేకపోయాడు.
∆ ఇందుచేతనే స్త్రీ ఉపదేశము చేయుటకు, అధికారము చేయుటకు ఆమెకు సెలవు లేదు అని దేవుని ఆత్మ మనకి తేటగా తెలియపరిచారు.
■ "స్త్రీ నాయకత్వములో శాపము" ■
లోకమునకు శాపమును కొని తెచ్చినది స్త్రీ నాయకత్వమే.
*"మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు", నా నామమును ఘనపరచునట్లు మనఃపూర్వకముగా "దానిని ఆలోచింపకయు ఉండినయెడల నేను మీ మీదికి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును". - (మలాకీ. 2:2).
A). హవ్వ యొక్క కుటుంబమునకు శాపము కొని తెచ్చింది. - (ఆది. 3:15)
B). ఆదామునకు శాపము కొని తెచ్చింది - (ఆది. 3:19)
C). తనకు శాపము కొని తెచ్చుకుంది - (ఆది. 3:16).
D). భూమికి శాపము కొని తెచ్చింది - (ఆది. 3:17-18).
* పురుషుడు మీద స్త్రీ నాయకత్వము చేస్తే ఆ కుటుంబమునకు శాపము వస్తుంది కాని దీవెన రాదు. పురుషుడు నాయకత్వములో మాత్రమే దేవుని యొక్క దీవెన కలదు *
∆ యెహోవా దేవుడు ఏదెను తోటలో స్త్రీని ఒక విధముగా రూపకల్పన చేస్తే ఆమె పురుషుడుకు ఉపదేశము, అధికారము చేయుట వలనే ఆమె ద్వారా అందరికి శాపము వచ్చింది.
■ భార్య - భర్తల మధ్య పాత్ర ■
A). అటువలె స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడియుండుడి - (1పేతురు. 3:1).
B). సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలుకూడ ప్రతి విషయములోను తమ పురుషులకు లోబడవలెను. - (ఎఫెసీ. 5: 24).
C). పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. - (ఎఫెసీ. 5: 25).
D). పురుషులు కూడ తమ సొంత శరీరములనువలె తమ భార్యలను ప్రేమింప బద్ధులైయున్నారు - (ఎఫెసీ. 5:28)
E). యెక్కువ "బలహీనమైన ఘటమని" భార్యను సన్మానించి - (1 పేతురు 3:7)
F). జ్ఞానము చొప్పున కాపురము చేయాలి. - (1 పేతురు 3:7).
G). భార్యను లేదా భర్తను దూరముగా పెట్టె కార్యక్రమమును దేవుడు అంగీకరించడు. - (1 కోరింది 7:5).
∆ ఇక్కడ కూడా భర్తకి లోబడమని వాక్యము సెలవు ఇస్తుంది. కాని అధికారము లేదా నాయకత్వము చేయమని సెలవు ఇవ్వడము లేదు.
★ ఒక వేళ భర్త అవిశ్వాసి అయినచో వాక్యము చూడు "(1 కోరింది 7:13-14)" వచనములు.
★ ఒక వేళ భర్త అవిధేయుడు అయినచో వాక్యము చూడు "(1 పేతురు. 3:2)" చూడుము.
■ కుటుంబములో స్త్రీ పాత్ర ■
A). స్త్రీ ఇంట ఉండి పనిచేసికొనువారుగా ఉండాలి. (తీతుకు. 2:4).
* (జాబ్ చేయాలా, వద్దా అనేది గ్రంథము సెలవు ఇవ్వలేదు) *
B). భర్తకి లోబడాలి, నాయకత్వము చేయకూడదు. - (1 పేతురు 3:1).
C). పిల్లలును మాత్రమే దేవునిలో "నడిపించే" కార్యక్రమమును తీసుకోవాలి. - (ద్వితీయో. 6:7-9; సామెతలు. 22:6; తీతుకు. 2:4-5).
D). సత్యము కొరకు పోరాటము చేస్తున్న తన భర్తకు స్త్రీ మంచి సహకారై (ప్రిస్కిల్ల వలె) ఉండాలి. - (అపొ.కార్య 18:26; రోమా 16:4).
E). "పురుషుడు వచ్చి భార్యను హత్తుకొనిన యెడల వారిరువురు ఏక శరీరమైయుందురు కావున వారి ఆలోచనలు, పనులు, నిర్ణయాలు ఒక్కటిగా ఉండాలి" - (ఆది. 2:24; మత్తయి. 19:5; మార్కు. 10:7; ఎపేసి. 5:31).
∆ ఏదెను తోటలో ఆదాము కుటుంబము "ఒక్క ఆలోచన యందు, ఒక్క పని యందు, ఒక్క నిర్ణయము యందు" స్థిరముగా లేకపోవటం వలెనే వారు ఏదెను తోట నుండి బహిష్కరించబడ్డారు.
■ "సంఘము 'లో' స్త్రీ పాత్ర" ■
★ సంఘము - దేవుని మందిరము - (1 తిమోతి. 3:15)
★ ఉపదేశము అనగా బోధ చేయుట.
★ అధికారము అనగా బాధ్యత, దొరతనము చేయుట, ఆధిపత్యము కోరుట.
★ "ఏదెను తోటలో అనగా పండ్లు తినక ముందు స్త్రీకి పురుషునికి సృష్టి మీద సమాన అధికారాలిచ్చాడు". - (ఆది కాండము 1:28) కాని ఒకరి మీద ఒకరికి అధికారం ఇవ్వలేదు.
★ ఎప్పుడైతే హవ్వ(స్త్రీ) పురుషుని(ఆదాము) మీద అధికారం చేసి దేవుని ఆజ్ఞను తృణీకరించిందో ఆనాడే దేవుడు స్త్రీ మీద అధికారం పురుషునికి ఇచ్చాడు. పురుషుని యెడల స్త్రీకి వాంఛ కలుగజేసాడు. - (ఆది. కాండము. 3:16).
A). సంఘము 'లో' స్త్రీలు ఏమి అలంకరించుకోకూడదో, ఏమి అలంకరించుకోవాలో దేవుని ఆత్మ మనకి తేటగా తెలియపరుస్తున్నారు - (1 తిమోతి. 2:9-10; 1 పేతురు. 3:3-4).
B). సంఘము 'లో' స్త్రీలు మౌనముగా ఉండి, సంపూర్ణ విధేయతతో నేర్చుకొనవలెను. - (1 తిమోతి. 2:11; 1 కోరింది. 14:35).
C). సంఘము 'లో' స్త్రీలు మౌనముగా ఉండాలి, ఉపదేశము చేయుటకు, పురుషుడు మీద అధికారము చేయుటకు ఆమెకి సెలవు లేదు - (1 కోరింది. 14:34; 1 తిమోతి. 2:12).
★ స్త్రీకి సంఘము 'లో' ఉపదేశము, అధికారము చేయుటకు సెలవు లేదని ధర్మశాస్త్రము కూడా చెప్పుచున్నది. - (1 కొరింది. 14:34).
* ఉదా: లేవి గోత్రములో ఉండే మూడు వంశస్థులు మాత్రమే దేవుని మందిరము పై అధికారము కలదు.
1) గెర్షోను - (సంఖ్యా. 3:17-18,21; 3:25-26)
2) కహాతు - (సంఖ్యా. 3:17,19; 3:29-32)
3) మెరారి - (సంఖ్యా. 3:17,20; 3:36-38)
మన తండ్రియైన దేవుడు "ఆ ముగ్గురుకి ఆయా వంశస్థుల వారికి" మూడు రకాల పనులు ఇచ్చారు.
నా సహోదరులారా!! ధర్మశాస్త్రములో ఏ స్త్రీ కూడా దేవుని పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలము లోనికి వెళ్లి సేవ చేసినట్టుగా గ్రంథములో రుజువులు లేవు కారణము అవి లేవి యాజకులకు(పురుషులు) మాత్రమే అప్పగింపబడింది.
పాత నిబంధనలో భక్తిపరులైన స్త్రీలు, ప్రవక్తిలు ఉండవచ్చు కానీ వారు పురుషులు మీద నాయకత్వము వహించినట్టుగా రుజువులు లేవు. ప్రవక్తిరాండ్రుకి దేవుడు ఎలా చెపుతే అలాగునే చేసారు తప్ప పురుషులు మీద అధికారము చేయలేదు.
D) భయభక్తులుగలవారై యుండవలెననియు, దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు స్త్రీ జాగ్రత్త వహించాలి - (తీతుకు. 2:3).
E). సంఘములో యవ్వన స్త్రీలు, తమ పిల్లలకి ఉపదేశము చేయవచ్చు - (తీతుకు. 2:4-5).
F) క్రీస్తులోనికి బాప్తిస్మము పొందు కార్యక్రమములో స్త్రీ, పురుషుడు అని బేధము లేదు - ( గలతి. 3:27-28).
F). స్త్రీ ఉపదేశము చేయుటకు సెలవు లేదు అంటే సంఘము 'లో' పురుషుడు మాత్రమే అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి.
★ "స్త్రీ ఎందుకు మౌనము వహిస్తూ, సంఘములో ఉపదేశమును, అధికారము చేయకూడదు.."?.
1) మొదట ఆదామును తరువాత హవ్వయును నిర్మింపబడిరి కారా? - (1 తిమోతి 2:13).
2) ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోసపరచబడి అపరాధములోపడెను. - (1 తిమోతి 2:14).
3) "స్త్రీకి శిరస్సు పురుషుడు" - ఇది దేవుని క్రమము (శిరస్సు అనగా అధికారమునకు సూచన) - (1 కొరింది. 11:3)
★ మొదటి సృష్టిలో జరిగిన పరిస్థితి అనగా " స్త్రీ నాయకత్వములో శాపము కలిగింది". మరల క్రీస్తు నందు నూతన సృష్టిలో (2 కొరింది. 5:17) అలా జరుగకూడదు అనే దృష్టితో దేవుడు ఆమెకి సెలవు ఇవ్వలేదు.
■ "సువార్త 'లో' స్త్రీ పాత్ర" ■
Note:- స్త్రీ ఉపదేశము చేయుటకు సెలవు లేదు అంటే సంఘము 'లో' పురుషుడుకు మాత్రమే అనే విశేషమైన సంగతిని గుర్తుపెట్టుకోవాలి.
A) ప్రిస్కిల్ల తన భర్తయైన అకులతో పౌలుకొరకు సువార్త విషయములో ప్రాణం యివ్వడానికైనా తెగించింది - (రోమా 16:4).
ప్రిస్కిల్ల అకులయు ఒక సువార్తకునికి బోధ చేస్తున్నారు. ఇది సంఘము యొక్క పరిస్థితి కాదు. ప్రిస్కిల ఇంటి వాతావరణములో జరిగిన కార్యక్రమము. - (అపో.కార్య. 18:24-26).
B) యూనీయ - (రోమా 16:7)
C) త్రుపైనాకు, త్రుఫోసాకు, పెర్సిసు - (రోమా 16:12)
D) యూలియా - (రోమా 16:15)
E) నేరియకు సహోదరి - (రోమా 16:15)
F) ప్రభువైన యేసును సేవించడంలో తనతో ప్రయాసపడిన యువొదియ, సుంటుకే సహాయము చేయుడని పౌలు కోరాడు - (ఫిలిప్పీ 4:2, 3)
G) నుంఫాకు తన యింటిని సంఘ కూడిక స్థలంగా యిచ్చింది - (కొలొస్స 4:15).
★ అన్యులైన పురుషులుకి స్త్రీలకు ఆమె సువార్త ప్రకటన చేయచ్చు (మత్తయి 28:19). కానీ దేవుని మందిరములో బోధ చేయుటకు ఆమెకి సెలవు లేదు
ప్రభువును సేవించడంలో అతడు వారితో కలిసి పని చేశాడు అందుకు వాత్సల్యముతో పౌల్ గారు వారికి వందన వచనాలను పంపారు.
ఆనాడు స్త్రీలు యేసుతో మరియు అపొస్తలతో కలసి సమానముగా సంఘములో ఉపదేశము(బోధ) చేసినట్టుగాని, పురుషులపై వారు అధికారం చేశారనిగాని, సంఘపు ఆరాధనలో నడిపించారనిగాని, పురుషులుతో కూడా సమానముగా నాయకత్వము వహించారు అని గాని నేటి క్రైస్తవ్యం తీర్మానించకూడదు.
- (లూకా. 6:6; లూకా. 4:21; మత్తయి. 13:53; యోహాను. 6:59; మత్తయి. 21:23 యోహాను. 7:14; యోహాను. 8:2; అపో.కార్య. 5:21; 13:15; 16:31; 1 తిమోతి 2:8).
【 గమనిక 】
◆ పురుషులుకి అసాధ్యమైనది స్త్రీలకు మాత్రమే సాధ్యమైనది దేవుడు ఇచ్చిన వరమే గర్భఫలము. - (కీర్తన 127:3)
◆ పరిశుద్ధ గ్రంథములో స్త్రీ యొక్క పరిచారము అమోఘమైనది.
◆ కుటుంబము పాత్రలో, తోటి పరిశుద్ధలకు(సంఘము) పరిచారము చేయుటలో, పిల్లలను పెంచే విషయములో, సువార్త పాత్రలో స్త్రీలకి సాటియైన వారు ఎవరు లేరు.
★ స్త్రీ పాత్ర లేకుండా పురుషుడు నాయకుడు కాలేడు.
★ పిల్లలు భక్తిపరులుగా తీర్చిదిద్దబడాలి అనుకుంటే స్త్రీ పాత్ర ఎంతో ఉంది.
★ ఆమె గృహము ఆశీర్వాదించబడాలి అంటే స్త్రీ పాత్ర ఎంతో ఉంది.
★ భర్త నుండి ప్రేమను పొందుకోవాలి అనుకుంటే స్త్రీ పాత్ర ఉంది.
【 హెచ్చరిక 】
దేవుడు ఒకేఒక్క విషయములోనే అనగా పురుషుడు మీద అధికారము, ఉపదేశము చేయుటకు ఆమెకి నాయకత్వము ఇవ్వలేదు.● నా ప్రియమైన సహోదరి, దయచేసి దేవుడు ప్రభువుసంఘములో ఇవ్వని నాయకత్వమును నీవు తీసుకొని, నీవు మరియు నీ కుటుంబము శాపమునకు గురి కావద్దు.
"దేవుని క్రమములో పురుషుడు పాత్ర" Click HERE
మీ ఆత్మీయ సహోదరుడు,
💌 మనోహర్ బాబు గుడివాడ
Subscribe to:
Posts (Atom)





