Showing posts with label ఆరాధన. Show all posts
Showing posts with label ఆరాధన. Show all posts

పలురకాల ఆరాధన (Types Of Worship)

పలురకాల ఆరాధన (Types Of Worship)

మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవుని పిల్లలైన వారందరికీ నా వందనములు.

1) వ్యర్థమైన ఆరాధన :

                     "వేషధారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మునుగూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పి జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి;" (మత్తయి. 15:7-10)

 

నీవు వేషధారులతో చేసే ఆరాధన  అంగీకరించబడదు. 

పెదవులతో ఘనపరిచే ఆరాధన అంగీకరించబడదు. 

ఆరాధనలో పరమతండ్రిని ఘనపరిచేది హృదయపూర్వకమైనదైయుండాలి.

మనుషులు పద్ధతులతో చేసే ఆరాధన అంగీకరించబడదు. 

ఇట్టి రీతిగా చేసే ఆరాధన అది వ్యర్ధమైన ఆరాధన అనబడును. వారు వ్యర్ధమైన ఆరాధికులు అగుదురు. 

 

2) స్వేచ్ఛా ఆరాధన : 

                    "అతి వినయాసక్తుడై దేవదూతా రాధనయందు ఇచ్ఛకలిగి, తాను చూచినవాటినిగూర్చి గొప్పగా చెప్పుకొనుచు, తన శరీరసంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు, శిరస్సును హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును అపహరింపనియ్యకుడి; ఆ శిరస్సుమూలముగా సర్వశరీరము కీళ్లచేతను నరములచేతను పోషింపబడి అతుకబడినదై, దేవునివలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. మీరు క్రీస్తుతోకూడ లోకముయొక్క మూలపాఠముల విషయమై మృతిపొందినవారైతే లోకములో బ్రదుకు చున్నట్టుగా మనుష్యుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించిచేతపట్టుకొనవద్దు, రుచిచూడవద్దు, ముట్టవద్దు అను విధు లకు మీరు లోబడనేల? అవన్నియు వాడుకొనుటచేత నశించిపోవును.౹ అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞాన రూపకమైనవని యెంచబడుచున్నవేగాని, శరీరేచ్ఛానిగ్రహ విషయములో ఏమాత్రమును ఎన్నిక చేయదగినవి కావు." (కొలొస్స. 2:18-23).


అతి వినయాసక్తుడై అనగా అతి వినయంతో చేసే ఆరాధన  అంగీకరించబడదు. 

దేవదూతారాధనయందు ఇష్టముకలిగి చేసే ఆరాధన అంగీకరించబడదు.  

తాను చూడని వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొని చేసే ఆరాధన  అంగీకరించబడదు. 

శరీర సంబంధంమైన మనస్సుతో ఊరకనే ఉప్పొంగుచు చేసే ఆరాధన  అంగీకరించబడదు. 

శిరస్సును అనగా క్రీస్తును హత్తుకొనని వాడు చేసే ఆరాధన అంగీకరించబడదు. 

లోకములో మనుషులు బ్రతుకుచున్నట్టుగా వారి ఆజ్ఞలను, పద్ధతులను, అనుసరించి అనగా శరీరేచ్ఛానిగ్రహ విషయములో నిలకడగా ఉండక వాటిని చేతపట్టుకొని, రుచిచూసి, ముట్టి వాటికి లోబడి చేసే ఆరాధన అంగీకరించబడదు. 

ఇట్టి రీతిగా చేసే ఆరాధన అది స్వేచ్ఛారాధన అనబడును. వారు స్వేచ్ఛారాధికులు అగుదురు.

 

3). తెలియనిదానిని/తెలియబడని ఆరాధన :

                     మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను౹ అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;౹ మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది. (యోహాను. 4:20-22).

 

యూదులు తెలిసినదానిని ఆరాధన చేయువారు - సమరయులు తెలియనిదానిని ఆరాధన చేయువారు

ఎవరిని ఆరాధన చెయ్యాలో తెలియకుండా చేసే ఒక అలవాటు, ఆచారం సమరయులది.

తెలియని దేవునికి ఆరాధన చేసే అనుభవం సమరయులది. ఇట్టి ఆరాధన అంగీకరించబడదు. 

 

మరొక్క రకమైన వాళ్ళు ఎవరనగా గ్రీక్ ఫిలాస్ఫర్ (గ్రీక్ తత్త్వజ్ఞాని/తార్కికుడు) వారి అతి జ్ఞానమును ప్రదర్శించి  తెలియబడని దేవునికి ఆరాధన చేస్తున్నారంట.. 


                     ఏథెన్సువారందరును అక్కడ నివసించు పరదేశులును ఏదోయొక క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపు చుండువారు.౹ పౌలు అరేయొపగు మధ్య నిలిచిచెప్పిన దేమనగా ఏథెన్సువారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతాభక్తిగలవారై యున్నట్టు నాకు కనబడు చున్నది.౹ నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీదతెలియబడని దేవునికి అని వ్రాయబడియున్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తికలిగియున్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. (అపో.కార్య. 17:21-23)

 

ఏ దేవుని ఆరాధన చెయ్యాలో తెలియక చేస్తున్న తెలియబడని దేవునికి ఏథెన్సు ప్రజలు చేయుచున్న వారి ఆరాధన కార్యక్రమం.  

దేవుడు ఎవరో? ఎవరికి మాత్రమే ఆరాధన చెయ్యాలో? లేదా ఆ ఒక్క ఆరాధ్యదైవం ఎవరో? ఈ విషయాలు తెలియకపోవడం అర్ధరహితమైన సమాచారం. 

✓ ఇట్టి రీతిగా చేసే ఆరాధన అది తెలియనిదానిని/తెలియబడని దేవునికి ఆరాధన అనబడును. 

 

4). యదార్థమైన ఆరాధన : 

                    "అమ్మా, ఒక కాలమువచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము;౹ మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము; రక్షణ యూదులలోనుండియే కలుగుచున్నది.౹ అయితే యథార్థముగా ఆరా ధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలమువచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు; ౹ దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెననెను. (యోహాను. 4:21-24). 

 

యేసు మాటల్లో . ఆరాధనకు పాత్రుడు? - పరమతండ్రి

యేసుమాటల్లో . ఆత్మతోను, సత్యముతోను ఎవరిని ఆరాధన చేయాలి? - పరమతండ్రిని

యేసుమాటల్లో .  యదార్థమైన ఆరాధికులు కావాలని ఎవరు వెతుకుచున్నారు? - పరమతండ్రి

యదార్థమైన ఆరాధికులు ఎవరిని ఆరాధన చెయ్యాలి? - పరమతండ్రిని

తనను ఆరాధించాలాని ఎవరు కోరుతున్నారు? - పరమతండ్రి

 

క్రీస్తు ప్రభువు ఆరాధనను కోరుకోలేదు. *


» మీరు మీకు తెలియనిదానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము. (22వ)

☀ మీరు - సమరయులు (స్త్రీ తో)

☀ మేము - యూదులు  (యేసు)

Note: మేము అనే మాటలో నేను అనే మాట  ఇమిడి ఉందని గ్రహించుము. 


             మన ప్రభువైన యేసుక్రీస్తు తాను కూడా ఆరాధికులలో ఒక్కడు అన్నట్టుగా తెలియజేశారు. తండ్రిని ఆరాధించే వ్యక్తులలో యేసు కూడా ఉన్నారు. కావున తండ్రియైన దేవుడు ఆరాధింపబడే వ్యక్తి, ప్రభువైన యేసుక్రీస్తు ఆరాధింపబడటం అనేది జరిగే కార్యక్రమం కాదు.

చాలామంది తెలియని దానియందు విశ్వాసం నిలిపి ఇలా అందురు "మేము క్రైస్తవులము కథ అందుకే మేము క్రీస్తును ఆరాధన చేస్తామని" ఇట్టివారు తెలియక మాట్లాడుతున్నారు. నిజానికి క్రైస్తవులు క్రీస్తును ఆరాధన చేస్తారని/చెయ్యాలని పరిశుద్ధు గ్రంథము చెప్పే సమాచారం కాదు. ఇది మనుషుల యొక్క అభిప్రాయం. వీరు స్వేచ్ఛారాధికులు. ఎవరిని ఆరాధన చెయ్యాలో యేసు మాటల్లో తెలియక/ఆలోచన చేయక ఆయన్నే(క్రీస్తును) ఆరాధన చేస్తాం అనేడి వారు... కానీ యేసు ఏమన్నారంటే "మేము మాకు తెలిసినదానిని ఆరాధించువారము." అని అన్నారు. ప్రభువైన క్రీస్తు యదార్థమైన ఆరాధికులు నుండి తాను ఆరాధనను కోరుతున్నట్టుగా ఎక్కడ చెప్పుకోలేదు. కాబట్టి నీవు ఎవరిని ఆరాధన చేస్తావో అనేది విచక్షణ లేకుండా చేసే ఆరాధన వ్యర్ధముగానో, తెలియబడని దానిగానో, ఇష్టానుసారంగా జరిగే ఆరాధననై ఉంటాది. 

 

5) విగ్రహరాధన :  

అందరియందు ఈ జ్ఞానము లేదు. కొందరిదివరకు విగ్రహమును ఆరాధించినవారు..... (1 కొరింథి. 8:7).

జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి, ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరివలె మీరు విగ్రహారాధకులై యుండకుడి. (1 కొరింథి. 10:7).

విగ్రహారాధనకు దూరముగా పారిపొండి. (1 కొరింథి. 10:14).

మీరు అన్యజనులై యున్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడిన అటు నడిపింపబడితిరని మీకు తెలియును. (1 కొరింథి. 12:2).

చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండ జాగ్రత్తగా ఉండుడి. (1 యోహాను. 5:21).

వ్యభిచారియైనను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై యున్న లోభియైనను, క్రీస్తుయొక్కయు దేవునియొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియును. (ఎఫెసి. 5:5)

  లోభి అనగా దేవుడు కంటే అత్యధికంగా దేనిని ప్రేమించిన అది విగ్రహారాధనయై అగును.

కావున భూమిమీదనున్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడి. (కొలస్స. 3:5)

ధనాపేక్ష అనగా దురాశ, లోభత్వము, లుబ్ధత్వము.


6) సృష్టికి/ప్రకృతికి ఆరాధన :  

            వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యులయొక్కయు, పక్షులయొక్కయు, చతుష్పాద జంతువులయొక్కయు, పురుగులయొక్కయు, ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఈ హేతువుచేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి, తమ శరీరములను పరస్పరము అవమాన పరచుకొనునట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై యున్నాడు, ఆమెన్‌. (రోమా. 1:23-25)


7) మనుష్యులకు ఆరాధన :  

            బర్నబాకు ద్యుపతి అనియు, పౌలు ముఖ్యప్రసంగి యైనందున అతనికి హెర్మే అనియు పేరుపెట్టిరి. పట్టణమునకు ఎదురుగా ఉన్న ద్యుపతి యొక్క పూజారి యెడ్లను పూదండలను ద్వారములయొద్దకు తీసికొనివచ్చి సమూహముతో కలిసి, బలి అర్పింపవలెనని యుండెను. అపొస్తలులైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని, తమ వస్త్రములు చించుకొని సమూహములోనికి చొరబడి అయ్యలారా, మీరెందుకీలాగు చేయుచున్నారు? మేము కూడ మీ స్వభావమువంటి స్వభావముగల నరులమే. మీరు ఈ వ్యర్థమైనవాటిని విడిచి పెట్టి, ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోఉండు సమస్తమును సృజించిన జీవముగల దేవునివైపు తిరుగ వలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. (అపో.కార్య. 14:12-15).

నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చుండి వారి యెదుట ఉపన్యాసముచేయగా జనులుఇది దైవస్వరమేకాని మానవస్వరముకాదని కేకలు వేసిరిఅతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. (అపో.కార్య. 12:21-23).


7) సబ్బాత్(విశ్రాంతి) దినము ఆరాధన :  

               విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపక ముంచుకొనుముఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయ కూడదు.  ఆరు దినములలో యెహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి, యేడవ దినమున విశ్రమించెను; అందుచేత యెహోవా విశ్రాంతిదినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను. (నిర్గమ.కాం. 20:8-11).

 సబ్బాత్/విశ్రాంతి దినము బౌతిక సంబంధమైన ఇశ్రాయేలీయుల ప్రజలకు మాత్రమే ఇవ్వబడిన ప్రత్యేకమైన/పరిశుద్ధ దినము. (నిర్గమ. 16:23; 31:12-16; లేవియా. 16:31; 19:3; 19:30; 23:24-39; 26:2; ద్వితియో. 5:12-15 చదువుము). 

 సబ్బాత్/విశ్రాంతి దినము ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులైన మనకు(క్రైస్తవులకు) ఇవ్వబడలేదు.

ముగింపు :

        ప్రియులారా.. పైన 👆 పేర్కొన్నబడిన వాటిలో ఏ ఆరాధన చేస్తున్నావో? ఆలోచన చేసుకో. ఒకవేళ నీవు చేయు ఆరాధన యదార్థమైన ఆరాధన కానిచో ఈ క్షణమే గ్రంథము పరిశీలన చేసి మార్చుకో..📖

మీ ఆత్మీయులు...👪

★ ఆరాధన : Click Here
★ ఆత్మతోను, సత్యముతోను : Click Here

"క్రైస్తవుడు ఆరాధనలో వాయిద్యములు ఎందుకు వాడకూడదు?" (Why should a Christian not use instruments in worship?)

క్రైస్తవుడు ఆరాధనలో వాయిద్యములు ఎందుకు వాడకూడదు?


ప్రియమైన సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

క్రైస్తవులు ఆరాధనలో వాయిద్యములు ఉపయోగించకూడదని లేఖనములను ఆధారము చేసుకొని, దేవుడు ఎటువంటి ఆరాధనను కోరుకుంటున్నాడో, నేటి క్రైస్తవులమైన మనము సత్య ఆరాధనలో వాయిద్యములు వాడవలసిన అవసరము లేదని వివిధ అంశముల ద్వారా తెలియజేసినప్పటికీ, కొంతమంది క్రైస్తవులు సత్య వాక్యమును సరియైన విధములో పరిశీలించకుండా, సరిగా విభజన చేయుకుండా, పరిశుద్ధ గ్రంథమును అపార్థము చేసుకుంటూ గ్రంథమును వ్రాయించిన పరిశుద్ధాత్మునే ప్రశ్నించే వారిగా ఉన్నారు.

ప్రియ సహోదరులారా, పరిశుద్ధ గ్రంధమందున్న ఏ ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగా పలికిరి. (2 పేతురు. 1:21). కాబట్టి క్రైస్తవుడవైన నీవు ఈ విషయమును చాలా ఖండితంగా నమ్మితీరాలి కానీ మన సొంత మాటలను చేరుస్తూ, గ్రంథములో  లేని విషయమును గూర్చి ఆలోచిస్తూ పరిశుద్ధాత్ముని ప్రశ్నించే వారిగా మనము ఉండకూడదు.

మొదటి ఆధారము :


● చితిసారకపు మ్రానుతో నీకొరకు ఓడను చేసికొనుము. – (ఆది. 6:14).

నోవాహుతో మన దేవుడు “చితిసారకపు మ్రానుతో” మాత్రమే ఓడను చేయమని ఆజ్ఞాపించారు. దీనికి అర్థము వేరొక మ్రానును ఉపయోగించకూడదని తెలుస్తుంది.

నోవాహు కూడా దేవుడిచ్చిన ఈ ఆజ్ఞను బట్టి చితిసారకపు మ్రానుతోనే ఓడను నిర్మించెను కాని ఇంకొక మ్రాను ఎందుకు ఉపయోగించకూడదని అజ్ఞానముగా దేవుని ప్రశ్నించలేదు.

● దేవుడు అతని (నోవాహు) కాజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. – (ఆది. 6:22).

రెండవ ఆధారము :


● నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోనును, అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును ఈతామారును ఇశ్రాయేలీయులలో నుండి నీ యొద్దకు పిలిపింపుము. – (నిర్గమా. 28:1).

ఈ వచనములో దేవుడు తనకు యాజకత్వము చేయుటకు ఆహారోను సంతతి వారు మాత్రమే అర్హులని మోషేకు సెలవిచ్చినప్పుడు  మోషే కాని మిగతా ఇశ్రాయేలీయులు కాని ఆహారోను సంతతి వారు మాత్రమే ఎందుకు యాజకత్వము చేయాలని అజ్ఞానముగా దేవుని ప్రశ్నించలేదు.

మూడవ ఆధారము :


● నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి, ఒక రొట్టెను ఎత్తికొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, దానిని విరిచి, ఇది మీకొరకైన నా శరీరము - నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తికొని - ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్ల నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. – (1 కొరింధి. 11:23-25).

ఈ వచనములో క్రీస్తు వారు తన శరీరమునకు చిహ్నముగా రొట్టెను, తన రక్తానికి చిహ్నముగా ద్రాక్షారసమును తీసుకుని ఆయనను జ్ఞాపకము చేసుకోమని మనకు తెలియజేసారు అయితే రొట్టెగా బదులుగా మాంసమును, రక్తమునకు బదులుగా మరొక పానీయమును ఎందుకు తీసుకోకూడదని నీవు అజ్ఞానముగా ప్రశ్నించకూడదు.

నాల్గవ ఆధారము :


★ యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను, సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను అనెను. – (యోహాను. 4:23-24).

క్రొత్త నిబంధనలో పాడుట గూర్చి మాత్రమే చూడగలము కాని వాయిద్యములు లేవనుటకు క్రింది వచనములే మనకు సాక్ష్యమిస్తున్నాయి.

★ అంతట వారు కీర్తన "పాడి" ఒలీవల కొండకు వెళ్లిరి. – (మత్తయి. 26:30).

★ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు "పాడుచు"నుండిరి. -  (అపొ.కార్య. 16:25).

★ అన్యజనులలో నేను నిన్ను "స్తుతింతును"; నీ "నామసంకీర్తనము" చేయుదును. – (రోమా. 15:9).

★ ఆత్మతో "పాడుదును", మనస్సుతోను "పాడుదును". – (1 కొరి౦ధి. 14:15).

మీ హృదయములలో ప్రభువునుగూర్చి "పాడుచు" కీర్తించుచు. – (ఎఫెసీ. 5:19).

★ మీ హృదయములలో దేవునిగూర్చి "గానము" చేయుచు. - (కొలస్సి. 3:16).

★ సమాజముమధ్య నీ కీర్తిని "గానము" చేతును అనెను. – (హెబ్రీ. 2:12).

★ ఎవనికైనను సంతోషము కలిగెనా? అతడు కీర్తనలు "పాడవలెను". – (యాకోబు. 5:13).

క్రొత్త నిబంధనలో సంగీతము గూర్చి మాట్లాడుతూ “పాడుట” లేదా “పాడిరి” అని మాత్రమే  ఈ వచనములన్నియు తెలియజేస్తున్నాయి. ఇది ఒక ప్రత్యేకమైన ఆజ్ఞగా మనము చూడగలము. అపోస్తులులు కూడా ఏ సంధర్భములోను వాయిద్యముల ప్రస్తావన తీసుకురాలేదు వాటిని ఉపయోగించమని గ్రంథములో ఎక్కడా కూడా బోధించలేదు. కాబట్టి, ఈ వచనములలో పాడుట గూర్చి మాత్రమే ఉన్నది వాయిద్యములు వాడకూడదని చెప్పలేదు కదా అని క్రైస్తవుడవైన నీవు అటువంటి ఆలోచనా విధముతో మాట్లాడుతూ లేని విషయమును కలిపితే పరిశుద్ధాత్మునికి విరోధముగా మాట్లాడినట్టే.

ఇలా చూసుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథమందు చాలా ఆధారములు ఉన్నవి అయితే ఇన్ని ఆధారములున్నప్పటికి, సొంత ఆలోచనలతో దేవుని ప్రత్యేకమైన ఆజ్ఞను మీరితే వాటి యొక్క ఫలితము కూడా గ్రంథమందు వ్రాయబడింది.

A) ఆహారోను కుమారులకు దేవుడిచ్చిన ప్రత్యేకమైన ఆజ్ఞను మీరినందుకు వారికి కలిగిన ఫలితము :

● అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసికొని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యమువేసి, యెహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను వారు యెహోవా సన్నిధిని మృతి బొందిరి. – (లేవీ. 10:1-2).

B) దేవుడు బండతో మాట్లాడమంటే మోషే బండను కఱ్ఱతో కొట్టగా అతనికి కలిగిన ఫలితము :

● నీవు నీ కఱ్ఱను తీసికొని, నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగుచేసి వారి కన్నుల యెదుట ఆ బండతో మాటలాడుము. అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకు నీళ్లను బండలోనుండి రప్పించి సమాజమునకును వారి పశువులకును త్రాగుటకిమ్ము. – (సంఖ్యా. 20:8).

● అప్పుడు మోషే తన చెయ్యి యెత్తి రెండుమారులు తన కఱ్ఱతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను; సమాజమును పశువులును త్రాగెను. – (సంఖ్యా. 20:11).

● ఏలయనగా మెరీబా నీళ్లయొద్ద మీరు నా మాట వినక నామీద తిరుగుబాటు చేసితిరి గనుక నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. – (సంఖ్యా. 20:24).

C) దేవుడు ఆజ్ఞాపించని యాజకత్వపు పనిని రాజైన ఉజ్జియా చేయగా అతనికి కలిగిన ఫలితము :

● వారు రాజైన ఉజ్జియాను ఎదిరించిఉజ్జియా, యెహోవాకు ధూపము వేయుట ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతివారైన యాజకుల పనియేగాని నీ పని కాదు; పరిశుద్ధస్థలములోనుండి బయటికి పొమ్ము, నీవు ద్రోహము చేసియున్నావు, దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగ జేయదని చెప్పగా" "ఉజ్జియా ధూపము వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై, యాజకులమీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూప పీఠము ప్రక్క నతడు ఉండగా యాజకులు చూచుచునే యున్నప్పుడు అతని నొసట కుష్ఠరోగము పుట్టెను. – (2 దినవృత్తా. 26:18-19).

D) పరిశుద్ధ గ్రంథములో వేటిని కలిపినా తీసివేసినా అతనికి కలుగు ఫలితము :

● ఈ గ్రంథమందున్న ప్రవచనవాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యమిచ్చునది ఏమనగా-ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపినయెడల, ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్లు దేవుడు వానికి కలుగజేయును ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనను తీసివేసినయెడల, దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధపట్టణములోను వానికి పాలులేకుండ చేయును. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు - అవును, త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. – (ప్రకటన. 22:18-20).

కాబట్టి నా ప్రియ సహోదరులారా, దేవుడు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చి, దానిని ప్రత్యేకపరిచినప్పుడు ఆ ఆజ్ఞకు వ్యతిరేకముగా ఏమియు మాట్లాడకూడదు, వేరొక ఆలోచన చేయకూడదు.  దీనిని బట్టి “క్రైస్తవులు సత్య ఆరాధనలో సంగీత వాయిద్యములు ఎందుకు వాడకూడదో, ఏ విధముగా తండ్రియైన దేవుని ఆరాధించాలో  చెప్పబడిన ఆజ్ఞ”కు వ్యతిరేకముగా ఆలోచన చేసి పరిశుద్ధాత్ముడికి విరోధముగా మాట్లాడకూడదని (మత్తయి. 12:32)నన్ను నేను హెచ్చరిక చేసికొనుచూ మీకు మనవి చేయుచున్నాను.

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"పరలోకములో వాయిద్యములు?" (Instruments in Heaven?)

పరలోకములో వాయిద్యములు?


ప్రియమైన సహోదరీ, సహోదరులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

నేటి క్రైస్తవులమైన మనము వాయిద్యములు ఉపయోగించవచ్చా? ఈ  విషయమై పరిశుద్ధ గ్రంథమును పరిశీలన చేసి, క్రైస్తవులు వాయిద్యములు ఉపయోగించకూడదని ఇంతకు మునుపు వ్రాయబడిన  “పాత నిబంధనలో వాయిద్యములు”, “క్రొత్త నిబంధనలో వాయిద్యములు” అనే అంశముల ద్వారా తెలుసుకున్నాము. అయితే మనలో కొంతమంది సహోదరులు పై అంశములలో తెలిజేయబడిన వాటిని  అంగీకరించినప్పటికి, ప్రకటన గ్రంథములో తెలుపబడిన వచనములను (ప్రకటన. 5:8, 14:2, 15:2) ఆధారము చేసుకొని పరలోకములో వాయిద్యములున్నవని తలంచి ఆరాధనలో వాయిద్యములు ఉపయోగించవచ్చని అనుకొనుచున్నారు.

★ మరియు విస్తారమైన జలముల ధ్వనితోను గొప్ప ఉరుముధ్వనితోను సమానమైన యొక శబ్దము పరలోకములో నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినది. – (ప్రకటన. 14:2).

★ మరియు అగ్నితో కలిసియున్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూరమృగమునకును దాని ప్రతిమకును దాని పేరు గల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణెలు గలవారై, ఆ స్ఫటికపు సముద్రము నొద్ద నిలిచియుండుట చూచితిని. – (ప్రకటన. 15:2).

పైన చూపబడిన రెండు వచనములలో “వీణెలు” అనే పదము ఉన్నది కనుక పరలోకములో వాయిద్యములో వాయిస్తున్నారని తప్పుగా అర్థము చేసికొనుచు పై వచనములను వక్రీకరణ చేయుచున్నారు.
పరిశుద్ధ గ్రంథములో ఉన్న 66 పుస్తకములలో ఒకటైన ప్రకటన గ్రంథము అనేకమైన దర్శనములతో నింపబడినది.

1) ఈ గ్రంథమును అపోస్తులుడైన యోహాను గారు రోమా చక్రవర్తి డొమి షియన్ కాలములో క్రీ.శ. 81 – 96 మధ్య  పరిశుద్ధాత్ముని ప్రేరణతో వ్రాయడము జరిగింది.

2) యోహాను గారు ఈ గ్రంథమును ఆత్మవశుడై (“అనగా దేవుని వశములో ఆత్మ మాత్రమే సంచారము చేయుట”) దేవుడు తనకు కనపరిచిన సంగతులను గురుతుల, సంఖ్యల భాషలలో వ్రాయడము జరిగినది.

3) పైన వచనములలో (ప్రకటన. 14:2, 15:2) తనకు చూపబడిన సంగతులను వివరిస్తూ, తాను  పరలోకములో నుండి ఒక శబ్దము రాగా విన్నారని, వినసొంపుగా ఉన్న ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదమును పోలినదని చెప్పుచున్నారు. ఇక్కడ గమనించాల్సినిది ఏమిటంటే యోహాను గారు విన్న వినసొంపైన ఆ శబ్దము వీణెలు వాయించుచున్న వైణికుల నాదము కాదు ఎందుకనగా ఆయన “పోలినది” అని మాత్రమే అన్నారు కాని విమోచింపబడిన వారు వాయిద్యములను వాయిస్తున్నట్టుగా తెలుపలేదు.

4) కాబట్టి, పరలోకములో భౌతిక సంబంధమైన వీణెలు వాయించుచున్నారని, ఇహలోక సంబంధమైన వాయిద్యములు పరలోకములో కలవని ఆ వచనములు యొక్క అర్థము కాదు. రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేవు (1 కొరింధి. 15:50) కనుక భౌతికమైన వీణెలు పరలోకములో ఉండుట వీలుపడదు.

5) ప్రియ సహోదరులారా, “దేవుని వీణెలు గలవారై” (ప్రకటన. 15:2) అనగా దేవుని సేవార్థమైన వీణెలు. ప్రకటన 14:2 వ వచనములో విస్తారమైన జలముల  ధ్వనివలె లయబద్ధంగాను మరియు గొప్ప ఉరుము ధ్వనివలె గంభీరంగాను వీణెలు వాయించుచున్న వైణికుల నాదమువలె యోహాను గారు విన్న శబ్దము వివరణ అదేమనగా పరిశుద్ధుల యొక్క మధుర గీతములే.

6) దేవుని సేవార్థమైన వీణెలు హృదయ వీణెలై ఉండాలి. ఎఫెసీ. 5:19, కొలస్సి. 3:16 లో గానము లేదా పాటలు అనే దానికి  గ్రీకు పదము “paasllo”. వీణెలు అనే పదము ప్రకటన గ్రంథములో 2 సార్లు చిహ్నముగా వ్రాయబడినది. దీనికి అర్థము ఈ వీణెలు హృదయ వీణెలే కాని, జంత్ర (వాయిద్యము) వీణెలు కాదు.

★ ఆయన దానిని తీసికొనినప్పుడు ఆ నాలుగు జీవులును, వీణెలును, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలును పట్టుకొనియున్న ఆ ఇరువది నలుగురు పెద్దలును, ఆ గొఱ్ఱె పిల్ల యెదుట సాగిలపడిరి. – (ప్రకటన. 5:8).

పై వచనములలో (ప్రకటన. 14:2, 15:2)  తెలుపబడిన ఈ వీణెలు వాయిద్యములు కాదని ఇంత చక్కగా తేటపరచబడినప్పటికి ప్రకటన. 5:8 వ వచనమును బట్టి పరలోకములో వీణెలు కలవని, అక్కడ వాయిస్తున్నారు కదా  నేటి క్రైస్తవులమైన మేము కూడా  ఆరాధనలో వాయిద్యములు  వాయించవచ్చు అని నీవు అనుకుంటే నీవు చేయు ఆరాధనలో “నాలుగు జీవులను, ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలును” కూడా ఉపయోగించవలసి ఉన్నదని గమనించగలరు.

కావున ప్రియ సహోదరీ, సహోదరుడా వాక్యాన్ని వక్రీకరణ చేయు భిన్న బోధల నుండి తొలగి, సత్య వాక్యమును సరిగ్గా విభజన చేయు అపోస్తులుల బోధలో నిలకడగా ఉండి, మన తండ్రియైన దేవుని సత్యముగా మరియు యదార్ధముగా ఆరాధించాలని  ప్రేమతో మనవి చేయుచున్నాను. 

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  

"ఎఫెసీ. 5:19, కొలస్సీ. 3:16." (Eph. 5:19, Col. 3:16)

ఎఫెసీ. 5:19, కొలస్సీ. 3:16



అపోస్తులుల బోధ అనే ఈ సైట్ ని చూస్తూ అనేక విషయములను తెలుసుకుంటూ దేవుని చిత్తములో నడిపింపబడాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనములు.

ప్రియ సహోదరీ, సహోదరులారా, మునుపు వ్రాసిన పాత నిబంధనలో వాయిద్యములు, కొత్త నిబంధనలో వాయిద్యములు అనే అంశముల  ద్వారా నేటి క్రైస్తవులమైన మనము వాయిద్యములు ఉపయోగించవచ్చా లేదా అని తెలుసుకున్నాము.

పరిశుద్ధ గ్రంథములో తెలుపబడిన లేఖనములను బట్టి నేటి క్రైస్తవులు వాయిద్యములు వాడకూడదని తెలిసినా, కొంతమంది వాక్యమును వక్రీకరణ చేస్తూ ఎఫెసీయులకు. 5:19 మరియు కొలస్సీయులు. 3:16 లో ఉన్న వచనములను ఆధారముగా చేసుకొని నేటి క్రైస్తవులు వాయిద్యములు వాయించవచ్చని సొంత బోధలు చేస్తూ దేవుని నామాన్ని అవమానపరుస్తున్నారు.

» ఒకనినొకడు కీర్తనలతోను సంగీతములతోను ఆత్మసంబంధమైన పాటలతోను హెచ్చరించుచు, మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు,.. – (ఎఫెసీ. 5:19).

» సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధిచెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవునిగూర్చి గానముచేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి,  – (కొలస్సి. 3:16).

పైన చూపబడిన రెండు వచనములలో “సంగీతము” అనే పదమును చూపి గ్రంథములో సంగీతము అని ఉంది కాబట్టి ఆరాధనలో వాయిద్యములు వాడవచ్చని భావిస్తున్నారు.

ప్రియులారా, సంగీతము అనగా ఒక వస్తువు నుండి వెలువడే “శబ్దము”. అంతే కాకుండా సంగీతము అనే పదము యొక్క అర్థము  మనము తెలుగు నిఘంటువులో చూసిన యెడల “గానము”, “శబ్దము” అని తెలుస్తుంది. ఇంకా వివరణగా చెప్పాలంటే, “స్వరపేటిక” లేక “శబ్దపేటిక” అని చెప్పవచ్చును.

పరిశుద్ధ గ్రంథములో సంగీతము అని ఉన్నది కనుక ఆది వాయిద్య సంగీతము అని భావించి వాయిద్యములు ఉపయోగిస్తున్నారు.  కాని సంగీతముకు మరియు వాయిద్య సంగీతమునకు చాలా వ్యత్యాసమున్నదని మనము గ్రహించాలి.

సంగీతము రెండు రకాలు :

★ గాత్ర సంగీతము (Vocal Music).
★ వాయిద్య (లేదా) జంత్ర సంగీతము (Instrumental Music).

గాత్ర సంగీతము : సప్త స్వరములు అనగాస రి గ మ ప ధ ని స” లతో స్వరపేటిక తో శబ్దము కలుగజేయు విధానమునే  గాత్ర సంగీతము అంటారు.

వాయిద్య సంగీతము : సప్త స్వరములు అనగాస రి గ మ ప ధ ని స” లతో స్వరపేటిక మరియు నిర్జీవ వస్తువులను (సితార, హార్మోని, గిటార్,....) ఉపయోగించి శబ్దమును కలుగజేయు విధానమును వాయిద్య సంగీతము అంటారు.

తెలుగు భాషలో ముద్రించబడిన పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీ మరియు కొలస్సి పత్రికలలో “సంగీతము” అని ఉన్నచోట గాత్ర సంగీతము గూర్చి తెలియజేసారని అనడానికి మరొక ఆధారము చూసినట్లయితే..

» Speaking to yourselves in psalms and hymns and spiritual songs, singing and making melody in your heart to the Lord,.. – (Eph. 5:19).
» Let the word of Christ dwell in you richly in all wisdom; teaching and admonishing one another in psalms and hymns and spiritual songs, singing with grace in your hearts to the Lord,.. – (Col. 3:16).

★ కీర్తనల “తోను” -  “ψαλμος”  (psalmois) – psalms – పాట, కీర్తి – లేఖనానుసారమైన పాటలు.
★ సంగీతముల “తోను” – “μνοις” (hymnois) – hymns – శ్లోకము, పాట – స్తుతి చేయు పాటలు.
★ ఆత్మసంబంధమైన పాటల “తోను” -  “δας”  (ōdais)spiritual songs –ఆత్మీయమైన గీతములు, పద్యములు.

కాబట్టి సహోదరులారా, గ్రంథమును చాలా జాగ్రత్తగా పరిశీలన చేసి సొంత జ్ఞానముతో కాక దేవుని జ్ఞానముతో ముందుకు వెళ్ళాలని మనవి చేయుచున్నాను.

1) ఎఫెసీ. 5:19 మరియు కొలస్సీ. 3:16. ఈ రెండు వచనములలో “మీ హృదయములలో ప్రభువుని గూర్చి పాడుచు, దేవుని గూర్చి గానము చేయుచు” అని వ్రాయబడుట చూడగలము.
హృదయములో నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడుతుంది కనుక ప్రతి ఒక్కరు తమ హృదయములలో నుండి పాడుతూ లేదా గానము చేయుచు దేవుని మహిమపరచాలని తెలుసుకోవాలి.

★ హృదయమందు నిండియుండుదానినిబట్టి యొకని నోరు మాటలాడును. (లూకా. 6:45).

మన హృదయములలో నిండినది మన నోటితో లేక స్వరపేటికతో బయటకి గానము చేసే ప్రక్రియను సంగీతము లేదా గాత్ర సంగీతము అంటారని తెలుసుకోవాలి.

దేవుడు ఎందుకు హృదయములలో నుండి వచ్చు గానమునే కోరుకుంటున్నాడు అని ఆలోచన చేస్తే నిర్జీవ వస్తువులు (సితార, హార్మోని, గిటార్,....) మనకు బోధ చేయవు, మనలను హెచ్చరించవు కనుక.

» హృదయములలో నుండి గానము ద్వారా కలుగు శబ్దము మనకు “హెచ్చరిక” కలుగజేయును.

» హృదయములలో నుండి గానము ద్వారా కలుగు శబ్దము మనకు “బోధ” చేయును.

» హృదయములలో నుండి గానము ద్వారా కలుగు శబ్దము మనకు “బుద్ధి” చెప్పును.

2) ఎఫెసీ 5:19; కొలస్సీ 3:16 లో చెప్పబడిన "సంగీతము" అంటే వాయిద్య సంగీతము కాదు అనుటకు ఋజువులు. 
వాయిద్యములు వాటంతట అవే మ్రోగలేవు  కనుక వాటిని వాయించుటకు ఒకరి సహాయము అవసరము కనుక నిర్జీవ వస్తువులు వలన కలుగూ శబ్దము దేవునికి అంగీకారయోగ్యమైనది కాదు.

» నిర్జీవ వస్తువులు ద్వార కలుగు శబ్దము మనకి “హెచ్చరిక” కలుగజేయవు.

» నిర్జీవ వస్తువులు ద్వార కలుగు శబ్దము మనకి “బోధ” చేయదు.

» నిర్జీవ వస్తువులు ద్వార కలుగు శబ్దము మనకి “బుద్ధి” చెప్పదు.

పాత నిబంధనలో వాయిద్యములు ఏ ఏ సందర్భములలో ఉపయోగించారు వాటిని దేవుడు ఎందుకు మాన్పివేసాడో మునుపు వ్రాసిన అంశము “పాత నిబంధనలో వాయిద్యములు” లో వివరణ చూసాము అలగే  క్రొత్త నిబంధనలో వాయిద్యములు ఎందుకు లేవు దేవుడు ఎటువంటి ఆరాధన కోరుకుంటున్నాడో “క్రొత్త నిబంధనలో వాయిద్యములు” అంశములో గ్రంథమును పరిశీలన చేసి తెలుకోగలిగాము.

ఎఫెసీ. 5:19 మరియు కొలస్సీ. 3:16 వచనములలో పరిశుద్ధాత్ముడు వ్రాయించిన సంగీతము అనే పదమునకు అర్థము, దేవుడు ఎందుకు గాత్ర సంగీతమునే కోరుకుంటున్నాడో గ్రంథము ద్వారా గ్రహించాలి.

★ పిల్లనగ్రోవి గాని వీణె గాని, నిర్జీవ వస్తువులు నాదమిచ్చునప్పుడు, స్వరములలో భేదము కలుగజేయనియెడల, ఊదినదేమి మీటినదేమి యని యేలాగు తెలియును?. – (1 కొరింధి. 14:7).

ప్రియమైన సహోదరీ, సహోదరులారా నిర్జీవ వస్తువులు అనగా జీవములేని వస్తువులతో దేవుని ఆరాధన చేయుటకు నీవు ఇష్టపడుతున్నావు కాని, మనలను తన రూపములో చేసుకుని, మనకు జీవమును,ఊపిరిని దయచేసిన (అపొ.కార్య. 17:25) మన దేవుడు మన హృదయముల ద్వారా గానము చేయుచు ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుచు (హెబ్రీ. 13:15) ఆయనను మహిమ పరచాలని, తనని మాత్రమే ఆరాధించాలని కోరుకుంటున్నాడు అటువంటి వారిని వెదకుచున్నాడని (యోహాను. 4:23-24) కానీ నిర్జీవ వస్తువులతో వ్యర్థముగా ఆరాధించాలని దేవుడు ఎంతమాత్రమును మనల నుండి కోరుకొనుటలేదు. 

 కావున, హృదయములను త్వరపడనియ్యక పవిత్ర పరచుకొని (ప్రసంగి. 5:1-2), తండ్రియైన దేవుని ఆత్మతోను, సత్యముతోను యదార్ధముగా ఆరాధించాలని నన్ను నేను హెచ్చరిక చేసికొనుచు మీకు మనవి చేయుచున్నాను.

మీ ఆత్మీయులు,
నవీన మనోహర్.  
The churches of Christ greet you - Roma 16:16